జుట్టు ఊడిపోతుందని, సిగ్నల్ జంప్ చేసినా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో హెల్మెట్ పెట్టుకోకుండా ఎలక్ట్రిక్ బైక్‌లను నడుపుతున్నారా? కానీ రానున్న రోజుల్లో అలా సాధ్యం కాదు. ఎందుకంటే? హద్దులు చెరిపేస్తున్న టెక్నాలజీ!! హెల్మెట్ పెట్టుకోకుండా వాహననాన్ని నడిపే వాళ్ల భరతం పట్టనుంది. ఎలా అంటారా?
దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలిపింది. హెల్మెట్ లేని కారణంగా రోజురోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల్ని నివారించేలా అధునాతమైన సాంకేతికతను ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లలో ఉపయోగించనుంది.
ఇందుకోసం వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నారా? హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారా? అని గుర్తించేలా కెమెరాలను అమర్చనుంది. ఈ కెమెరాలు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న వాహనదారుల సమాచారాన్ని వెహికల్ కంట్రోల్ యూనిట్ (వీసీయూ)కు అందిస్తుంది. వెంటనే వీసీయూ విభాగం మోటర్ కంట్రోల్ యూనిట్‌కు చేరవేస్తుంది. అప్పుడు మోటర్ కంట్రోల్ యూనిట్ మీరు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే ఆటోమెటిగ్గా బండి ఆగిపోనుందంటూ ప్రముఖ ఆటోమొబైల్ బ్లాగ్ ఆటోకార్ కార్ ఇండియా నివేదికను విడుదల చేసింది.
ఈ విధంగా, రైడర్ హెల్మెట్ ధరించలేదని సిస్టమ్ గుర్తిస్తే, ఓలా స్కూటర్లు ఆటోమేటిక్‌గా పార్క్ మోడ్‌కి మారుతాయి. పార్క్ మోడ్‌లో ఒకసారి, హెల్మెట్ ధరించమని రైడర్‌కు గుర్తు చేయడానికి డాష్‌పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత, రైడర్ హెల్మెట్ ధరించినట్లు గుర్తిస్తేనే స్కూటర్ రైడ్ మోడ్‌కి మారుతుంది. తరువాత, సిస్టమ్ రైడర్‌ను పర్యవేక్షించడాన్ని కొనసాగిస్తుందని నివేదికలో పేర్కొంది.
ఈ సాంకేతికతను వినియోగిస్తున్న ఆటోమొబైల్ సంస్థల్లో ఓలాతో పాటు, కెమెరా ఆధారిత హెల్మెట్ రిమైండర్ సిస్టమ్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు టీవీఎస్ ఇటీవల ప్రకటించింది. అయితే, హెల్మెట్ లేకుండా వాహనదారుడు ప్రయాణించకుండా ఆపేలా టెక్నాలజీని వినియోగంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది.
టీవీఎస్ హెల్మెట్ ధరించమని గుర్తుచేసే హెచ్చరిక సందేశం మాత్రమే రైడర్‌లకు కనిపిస్తుందని, డ్రైవర్ హెల్మెట్ ధరించని సందర్భాల్లో స్కూటర్‌ను పార్క్ మోడ్‌లో ఉంచడం గురించి టీవీఎస్ పనిచేస్తుందా? లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదని ఏసీఐ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment