Helmet compulsory
-
BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?
పోలీస్ బలగాల రక్షణ కోసం తయారు చేసే హెల్మెట్లతో పాటు బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్లు, డోర్ ఫిట్టింగ్‌లకు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా నిబంధనలు తీసుకొచ్చారు. దేశ రక్షణకోసం, ప్రజల శ్రేయస్సుకోసం నిరంతరం పని చేసే పోలీస్ దళాలు మరింత పటిష్ఠంగా పనిచేసేలా చూడాలని ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగానే వారు వినియోగించే వస్తువులు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోబుతున్నట్లు ప్రకటించింది. నాసిరక ఉత్పత్తులు దేశంలోకి దిగుమతి కాకుండా నిరోధించాలని చెప్పింది. దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 23న పోలీస్ దళాలు, సివిల్ డిఫెన్స్, వ్యక్తిగత భద్రతా నిబంధనలు 2023, బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్ల నిబంధనలు 2023, డోర్ ఫిట్టింగ్స్ నిబంధనలు 2023 పేరిట మూడు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ ఆదేశాల ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ లేని ఈ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, దిగుమతులు, నిల్వ చేయరాదు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. -
ఓలా టెక్నాలజీ అదిరింది..హెల్మెట్ లేకపోతే బండి స్టార్ట్ కాదు!
జుట్టు ఊడిపోతుందని, సిగ్నల్ జంప్ చేసినా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో హెల్మెట్ పెట్టుకోకుండా ఎలక్ట్రిక్ బైక్‌లను నడుపుతున్నారా? కానీ రానున్న రోజుల్లో అలా సాధ్యం కాదు. ఎందుకంటే? హద్దులు చెరిపేస్తున్న టెక్నాలజీ!! హెల్మెట్ పెట్టుకోకుండా వాహననాన్ని నడిపే వాళ్ల భరతం పట్టనుంది. ఎలా అంటారా? దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలిపింది. హెల్మెట్ లేని కారణంగా రోజురోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల్ని నివారించేలా అధునాతమైన సాంకేతికతను ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లలో ఉపయోగించనుంది. ఇందుకోసం వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నారా? హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారా? అని గుర్తించేలా కెమెరాలను అమర్చనుంది. ఈ కెమెరాలు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న వాహనదారుల సమాచారాన్ని వెహికల్ కంట్రోల్ యూనిట్ (వీసీయూ)కు అందిస్తుంది. వెంటనే వీసీయూ విభాగం మోటర్ కంట్రోల్ యూనిట్‌కు చేరవేస్తుంది. అప్పుడు మోటర్ కంట్రోల్ యూనిట్ మీరు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే ఆటోమెటిగ్గా బండి ఆగిపోనుందంటూ ప్రముఖ ఆటోమొబైల్ బ్లాగ్ ఆటోకార్ కార్ ఇండియా నివేదికను విడుదల చేసింది. ఈ విధంగా, రైడర్ హెల్మెట్ ధరించలేదని సిస్టమ్ గుర్తిస్తే, ఓలా స్కూటర్లు ఆటోమేటిక్‌గా పార్క్ మోడ్‌కి మారుతాయి. పార్క్ మోడ్‌లో ఒకసారి, హెల్మెట్ ధరించమని రైడర్‌కు గుర్తు చేయడానికి డాష్‌పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత, రైడర్ హెల్మెట్ ధరించినట్లు గుర్తిస్తేనే స్కూటర్ రైడ్ మోడ్‌కి మారుతుంది. తరువాత, సిస్టమ్ రైడర్‌ను పర్యవేక్షించడాన్ని కొనసాగిస్తుందని నివేదికలో పేర్కొంది. ఈ సాంకేతికతను వినియోగిస్తున్న ఆటోమొబైల్ సంస్థల్లో ఓలాతో పాటు, కెమెరా ఆధారిత హెల్మెట్ రిమైండర్ సిస్టమ్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు టీవీఎస్ ఇటీవల ప్రకటించింది. అయితే, హెల్మెట్ లేకుండా వాహనదారుడు ప్రయాణించకుండా ఆపేలా టెక్నాలజీని వినియోగంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది. టీవీఎస్ హెల్మెట్ ధరించమని గుర్తుచేసే హెచ్చరిక సందేశం మాత్రమే రైడర్లకు కనిపిస్తుందని, డ్రైవర్ హెల్మెట్ ధరించని సందర్భాల్లో స్కూటర్‌ను పార్క్ మోడ్‌లో ఉంచడం గురించి టీవీఎస్ పనిచేస్తుందా? లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదని ఏసీఐ వెల్లడించింది. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
అట్టుడుకుతున్న పుదుచ్చేరి..
సాక్షి, చెన్నై : ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదంతో పుదుచ్చేరి అట్టుడుకుతుంది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి.. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కొన్ని రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తక్షణమే పాటించాలంటూ కిరణ్ బేడి ప్రజలను ఒత్తిడి చేస్తుండటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ బేడి చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు పిలుపున్వివడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో భాగంగా బుధవారం నారాయణ స్వామి కిరణ్ బేడి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీదే నిద్రపోయారు. సీఎంకు మద్దతుగా మంత్రులు, డీఎంకే కార్యకర్తలు కూడా అక్కడే బైఠాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ విషయం గురించి నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను దశల వారిగా అమలు చేయాలి. అంతేతప్ప తక్షణమే జరిగిపోవాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. కిరణ్ బేడి చర్యల వల్ల ప్రజల్లో మాపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమె చర్యలను వ్యతిరేకిస్తూ.. రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చాన’ని పేర్కొన్నారు. అంతేకాక నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే కిరణ్ బేడి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నారాయణస్వామి చేపట్టిన ధర్నాకు డీఎంకే కూడా మద్దతు పలకటంతో భారీ సంఖ్యలో జనాలు రాజ్ భవన్ ముందుకు చేరుకున్నారు. -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
-
హెల్మెట్‌పై కఠినంగా ఉండాలి: హైకోర్టు
హైదరాబాద్: హెల్మెట్ ధరించని వాహనదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే ఎంతో కొంత పురోగతి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్ వాడని వాహనదారులకు జరిమానా విధిస్తున్నట్లు తమకు ఎక్కడా కనిపించడం లేదన్న ధర్మాసనం, ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెల్మెట్ ధరించే విషయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని కఠినంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ప్రతీ రోజూ తమకు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారే అత్యధికంగా కనిపిస్తున్నారని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతుండటం వల్లే ఇది సాధ్యమవుతున్నట్లుందని వ్యాఖ్యానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్జీ) అందేపల్లి సంజీవ్‌కుమార్ స్పందిస్తూ, ఇప్పటి వరకు 49వేల కేసులు నమోదు చేశామన్నారు. ఎన్ని ద్విచక్ర వాహనాలున్నాయని ధర్మాసనం ప్రశ్నించగా, 40 లక్షలున్నాయని సంజీవ్ చెప్పారు. దీని ప్రకారం మీరు ఒక్క శాతం మేర కేసులను మాత్రమే నమోదు చేశారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధారణ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇవి మాత్రమే సరిపోవని, హెల్మెట్ ధరించని వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే ఎంతో కొంత పురోగతి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది.