టీవీల విక్రయాల ద్వారా సాధిస్తాం
శామ్‌సంగ్ ఇండియా వెల్లడి
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం శామ్‌సంగ్ టీవీల అమ్మకాల ద్వారా 2024లో భారత మార్కెట్లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకోవడం ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించలేదని కంపెనీ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం టీవీల విభాగంలో పరిమాణం పరంగా వృద్ధిలో ఉన్నట్టు శామ్‌సంగ్ ఇండియా విజువల్ డిస్‌ప్లే బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. ‘ప్రీమియం టీవీలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. కంపెనీ విక్రయాల్లో ఈ విభాగం వాటా 40%. యూహెచ్‌డీ, పెద్ద స్క్రీన్ టీవీల విక్రయాలతో ఈ ఏడాది వృద్ధి ఉంటుంది. ప్రీమియం ఉత్పత్తులకు మెట్రోలు, చిన్న పట్టణాల నుంచీ డిమాండ్ ఉంది’ అని వివరించారు.
సంస్థకు 21 శాతం వాటా..
శామ్‌సంగ్ భారత్‌లో 2022–23లో రూ.98,924 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇందులో 70 శాతం మొబైల్స్ అమ్మకాల ద్వారా కాగా మిగిలినది టీవీలు, ఇతర ఉపకరణాల ద్వారా సమకూరింది. దేశీయ టీవీల విపణిలో పరిమాణం పరంగా సంస్థకు 21 శాతం వాటా ఉంది. శామ్‌సంగ్ తాజాగా ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్‌ఈడీ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టింది. పిక్చర్ స్పష్టంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.1.39 లక్షలు. ఓఎల్‌ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.1.64 లక్షలు. కాగా, శామ్‌సంగ్ దేశీ విక్రయ టీవీల్లో 90% భారత్‌లో తయారైనవే. దేశంలో ఏటా అన్ని బ్రాండ్లలో కలిపి 1.2 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment