ఫ్లిప్ కార్ట్: 1 బిలియన్ డాలర్ల టార్గెట్ | Mission $ 1 billion: Flipkart’s target from sale of TVs, white goods in FY18 | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్: 1 బిలియన్ డాలర్ల టార్గెట్

Published Wed, May 17 2017 8:46 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్ కార్ట్: 1 బిలియన్ డాలర్ల టార్గెట్ - Sakshi

ఫ్లిప్ కార్ట్: 1 బిలియన్ డాలర్ల టార్గెట్

కోల్ కత్తా : ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ టార్గెట్ నిర్దేశించుకుంది. టెలివిజన్, వైట్ గూడ్స్  ఉత్పత్తుల విక్రయాల్లో 2018 మార్చి వరకు 1 బిలియన్ డాలర్ల టార్గెట్ ను అంటే  6700 కోట్ల అమ్మకాలను చేధించాలని ఫ్లిప్ కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది  గత ఆర్థిక సంవత్సరం కంటే మూడింతలు  ఎక్కువ వృద్ధి. ''టెలివిజన్, అప్లియన్స్ ఫ్లిప్ కార్ట్ లో చాలా త్వరగా వృద్ధి చెందుతున్న కేటగిరీ. ఈ ఏడాది బిగ్ బిలియన్ డే  ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం ఇండస్ట్రీ విక్రయాలు 60వేల కోట్లలో 10 శాతానికి పైగా అంటే 6700 కోట్ల విక్రయ టార్గెట్ ను మేము నిర్దేశించుకున్నాం. దేశంలో ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్న వాటిలో రెండో అతిపెద్ద విక్రయదారిమి మేమే'' అని ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద ఉపకరణాల అధినేత సందీప్ కర్వా తెలిపారు.  
 
కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, వైట్ హౌజ్ వేర్ హౌజింగ్ ను విస్తరిస్తామని కూడా చెప్పారు.  ప్రస్తుతమున్న ఆన్ లైన్ టెలివిజన్ 8 శాతం విక్రయాలను 18 శాతానికి పెంచుకోవాలని కూడా ఫ్లిప్ కార్ట్ భావిస్తోంది. ఎయిర్ కండీషన్లను 8-9 శాతం, వాషింగ్ మిషన్లను, రిఫ్రిజిరేటర్లను 6-7 శాతం పెంచుకోనున్నట్టు తెలిపింది. వచ్చే వేసవి వరకు సొంత లేబల్ పై ఫ్లిప్ కార్ట్ ఎయిర్-కండీషనర్లను కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కొన్ని చిన్న ఉపకరణలపై ప్రైవేట్ లేబల్ ను ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లాంచ్ చేసింది. స్మార్ట్ బై బ్రాండు కింద మిక్స్డ్ గ్రైండర్, జ్యూసర్స్, ఇండక్షన్ కుక్ టాప్స్, శాండ్విచ్ కేటగిరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement