
చెన్నై: కార్లు, బైకులు ఏదైనా సమస్య వచ్చి రోడ్డు మధ్యలో ఆగిపోయిన పక్షంలో బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ సేవలందించే దిశగా పేటీఎం మాల్‌తో టీవీఎస్ ఆటో అసిస్ట్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద రోడ్ అసిస్టెన్స్ సర్వీస్ ప్యాకేజీలను పేటీఎం తమ ప్లాట్‌ఫాంపై విక్రయించనుంది. ఆటో అసిస్ట్‌లో సభ్యత్వానికి సంబంధించి గోల్డ్ మెంబర్ షిప్ ఫీజు రూ.1,499గా, ప్లాటినం మెంబర్‌షిప్‌కి రూ.2,999గా ఉంటుంది. వినియోగాన్ని బట్టి చార్జీలు చెల్లించే ప్రాతిపదికన టీవీఎస్ ఆటో అసిస్ట్‌లో సభ్యులు కాని వారికి కూడా సర్వీసులు అందిస్తామని టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్ ఈడీ జి. శ్రీనివాస రాఘవన్ తెలిపారు.
రాత్రి 8 గం. నుంచి తెల్లవారుఝాము 5 గం.ల మధ్య ప్రయాణించే మహిళా ప్యాసింజర్స్‌కి కూడా సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ తరహా ప్రయోగాన్ని హైదరాబాద్‌తో పాటు న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో అందించనున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment