Top 5 Electric Scooters: Check Price, Features and Other Details- Sakshi
Sakshi News home page

Electric Scooters: మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Published Wed, Aug 18 2021 4:01 PM | Last Updated on Thu, Aug 19 2021 9:25 AM

Here is Top 5 Electric Scooters in India: Features, Price - Sakshi

ప్రస్తుతం పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటిన సంగతి తెలిసిందే. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.  దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లో లభ్యం అవుతున్నప్పటికీ, మరికొన్ని ఈ సంవత్సరం చివరినాటికి కస్టమర్ల చేతికి అందనున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఇటీవల కొత్తగా కొన్ని స్కూటర్లు వచ్చాయి.

ఈ స్కూటర్లు వస్తూ వస్తూనే ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయని చెప్పుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది అత్యుత్తమం అనేది ప్రజలు తెలుసుకోలేక పోతున్నారు. మేము ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు తెలియజేస్తున్నాము.(చదవండి: ఎంజీ ఎస్టర్‌ ఎస్‌యూవీ.... కీ ఫీచర్లు ఇవే!)

ఓలా ఎస్1, ఎస్1 ప్రో
ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1ను ఆగస్టు 15న రూ.99,999(ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో అనే పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999, ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1,29,999గా ఉంది. ఓలా ఎస్1 సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ నుంచి 1,000 నగరాలు, పట్టణాల్లో డెలివరీల సేవలను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 8 వరకు కంపెనీ బుకింగ్స్ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఐడీసీ మోడ్ లో 181 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది.

గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగం, హైపర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 40 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్ ద్వారా చార్జ్ చేయడానికి సుమారు 6 గం. సమయం పడుతుంది. ఇందులో రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ ఫంక్షన్, డ్రైవింగ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. 0-40 కిలోమీటర్లు వేగాన్ని 3 సెకండ్లలో అందుకుటుంది. ఇది కీలెస్ లాక్, అన్ లాక్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, జియో ఫెన్సింగ్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్లో 3.97 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 రంగుల్లో లభిస్తుంది. ఓలా తమిళనాడులో 500 ఎకరాల్లో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.

సింపుల్ వన్
సింప్లీ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆగస్టు 15 నాడు లాంఛ్ చేసింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ప్రీ ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. మీరు సింపుల్ వన్ బుక్ చేసుకోవాలంటే రూ.1,947 చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్ వన్ ను రూ.1,09,999 (ఎక్స్ షోరూమ్ ధర)కు లాంఛ్ చేశారు. సింపుల్ వన్ బ్రెంజ్ బ్లాక్, అజ్యూరే బ్లూ, గ్రేస్ వైట్, నమ్మ రెడ్ రంగులలో లభిస్తుంది.
 

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను చార్జ్ చేస్తే ఐడీసీ మోడ్ లో 236 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. అలాగే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. దీనిలో 4.8కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ(కంబైన్డ్ ఫిక్సిడ్, పోర్టబుల్), 7 కెడబ్ల్యు మోటార్ ఉన్నాయి. దీనిలో టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. 

అథర్ 450ఎక్స్
అథర్ 450ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్ లో 116 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. బ్యాటరీ వాటర్ రెసిస్టెంట్ ఐపీ 67 రేటెడ్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియం బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ అండ్ రియర్ కోసం రెండు డిస్క్ బ్రేకులు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్ సిడి డిస్ ప్లేతో ఈ స్కూటర్ వస్తుంది. అథర్ 450ఎక్స్ ధర రూ.1,44,500. ఈ స్కూటర్లో 2.61 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్
ఈ ఏడాది జూన్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అర్బన్ స్కూటర్ ను రూ.115,218 ధరకు విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ లో 2.25 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 4.4 కిలోవాట్లు కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 78 కి.మీ. దీని ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఫ్రంట్ టెలిస్కోపిక్, రియర్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ తో వస్తుంది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ 140 ఎన్ఎమ్ టార్క్ ఉతపతి చేస్తుంది.

బజాజ్ చేతక్
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ మోటార్ చేత పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే).

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement