![World EV Day 2021:India market emerging favourite destination - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/9/Electric-scooters.jpg.webp?itok=1r9QP8wo)
సాక్షి, ముంబై: దేశంలో ఒక వైపు 100 రూపాయల దాటేసిన పెట్రోలు ధర వాహనదారులను భయపెడుతోంది. మరోవైపు బయో, సాంప్రదాయ ఇంధన వాహనాలను మార్కెట్లోకి తీసుకు రావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలు ఆటో కంపెనీలకు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రో వాతల నుంచి విముక్తి కలిగించే ఎలక్ట్రిక్ వాహనాలు శరవేగంగా దూసుకొస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పన అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓలా, టీవీఎస్, అథెర్స్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న జరుపుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా చైనా ఉండగా, రెండవ ఈవీ మార్కెట్ హబ్‌గా ఇండియా అవతరించనుంది. ఈ సందర్బంగా మార్కెట్లోకి హల్‌చల్ చేయనున్న వాహనాలపై స్పెషల్ స్టోరీ మీ కోసం..
Comments
Please login to add a commentAdd a comment