![Okaya Launches Electric Scooter Freedom - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/17/okaya_Electric%20Scooter.jpg.webp?itok=ZlLTj-Oh)
న్యూఢిల్లీ: ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ అందిస్తున్న ఒకాయా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం ఫ్రీడమ్ పేరుతో స్కూటర్‌ను ఆవిష్కరించింది. ధర రూ.69,900 నుంచి ప్రారంభం.
లిథియం అయాన్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. నాలుగు వేరియంట్లలో రూపొందించారు. మోడల్‌నుబట్టి ఒకసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇప్పటికే కంపెనీ ఏవియన్‌ఐక్యూ, క్లాసిక్‌ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. మార్చికి 14 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. ఇందులో హైస్పీడ్ మోటార్‌సైకిల్, బీటూబీ కోసం ప్రత్యేక వాహనాలు ఉంటాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment