okaya company electronics
-
మార్కెట్లోకి ఒకాయా ఫాస్ట్ ఎఫ్౩ ఎలక్ట్రిక్ స్కూటర్
-
సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ దూసుకెళ్లనున్న ఒకాయా 'ఫాస్ట్' ఎలక్ట్రిక్ స్కూటర్..!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఓకాయా తన కొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ "ఫాస్ట్"ను గ్రేటర్ నోయిడాలో ఇటీవల జరిగిన 2021 ఈవీ ఎక్స్ పో షోలో లాంఛ్ చేసింది. ఈ కొత్త ఓకాయా ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్'ను ఎక్స్ షోరూమ్ (రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి) రూ.89,999కు లాంఛ్ చేశారు. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ.2 వేలను చెల్లించి బుక్ చేసుకోవచ్చు, ఓకాయా డీలర్ షిప్ కేంద్రాల వద్ద కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఓకాయా ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 60-70 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీనిలో 4.4 కిలోవాట్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంది. ఈ "ఫాస్ట్" ఈవీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, ఇందులో ఎల్ఈడీడీఆర్ఎల్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఫాస్ట్ స్కూటర్.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్, ఆథెర్ 450ఎక్స్, బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1, బజాజ్ చేతక్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. (చదవండి: రయ్..రయ్..డుగ్ డుగ్ మంటూ వచ్చేస్తున్నాయ్!) -
రూ.40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా ఎక్కువే!
న్యూఢిల్లీ: ప్రముఖ ఓకాయా పవర్ గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అంతేగాకుండా, ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్టంలో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన సంస్థ హర్యానాలో మరో తయారీ కర్మాగారాన్ని, నీమ్రానా(రాజస్థాన్)లో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్, ఫ్రీడమ్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని ప్రస్తుత భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు తెలిపింది. అందుకే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో కొత్తగా మరో ఏడు రాష్ట్రాల్లో 165 ఎలక్ట్రిక్ టూ వీలర్(ఈ2డబ్ల్యు) డీలర్లను ఓకాయా పవర్ గ్రూప్ నియమించింది. "నవరాత్రి పండుగ సందర్భంగా ఇటీవల ప్రారంభించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఓకాయా పవర్ గ్రూప్ తన డీలర్ షిప్ నెట్ వర్క్ ను ఇండియా మొత్తం విస్తరించడానికి ప్రణాళికలను ప్రకటించింది. ఓకాయా ఈవీ ఇప్పటికే భారతదేశంలోని 18 రాష్ట్రాల్లో 165 మంది డీలర్లను నియమించింది" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఓకాయా స్కూటర్ల ధర రూ.39,999 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లను ఒకసారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నాయి. వీటిని నడపడానికి ఎటువంటి లైసెన్సు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకాయా పవర్ గ్రూప్ 4 దశాబ్దాలుగా భారతదేశంలో బ్యాటరీ తయారీ రంగంలో నమ్మకానికి, నాణ్యతకు చిహ్నంగా ఉంది. దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. ఈ అనుభవంతోనే ఓకా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోనికి ప్రవేశించింది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వేహికల్స్, ఎలక్ట్రిక్ వేహికల్ బ్యాటరీల నుంచి ఈవి ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ పరిష్కారాల వరకు అన్నటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. (చదవండి: మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!) -
మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్, మిగిలిన వాటితో పోలిస్తే ధర తక్కువే
న్యూఢిల్లీ: ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ అందిస్తున్న ఒకాయా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం ఫ్రీడమ్ పేరుతో స్కూటర్‌ను ఆవిష్కరించింది. ధర రూ.69,900 నుంచి ప్రారంభం. లిథియం అయాన్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. నాలుగు వేరియంట్లలో రూపొందించారు. మోడల్‌నుబట్టి ఒకసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే కంపెనీ ఏవియన్ఐక్యూ, క్లాసిక్ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. మార్చికి 14 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. ఇందులో హైస్పీడ్ మోటార్‌సైకిల్, బీటూబీ కోసం ప్రత్యేక వాహనాలు ఉంటాయని తెలిపింది. చదవండి: ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు.. -
రూ. 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్
ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా, ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన సంస్థ హర్యానాలో మరో తయారీ కర్మాగారాన్ని, నీమ్రానా(రాజస్థాన్)లో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ స్కూటర్లు రూ.39,999 - రూ.60,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉంటాయి. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ వాహనాలకు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా దేశవ్యాప్తంగా షోరూమ్ లతో పాటు పంపిణీ, సేవా కేంద్రాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తెలిపారు. ఢిల్లీ, జైపూర్లలో రెండు ఎక్స్పీరియన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేగాక, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సెగ్మెంట్ కింద నాలుగు ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులన్నీ పూర్తిగా 'మేడ్-ఇన్ ఇండియా'గా ఉంటాయి. 2025 నాటికి భారతీయ రోడ్లపై కోటి ఈ-స్కూటర్లను తీసుకొని రావలన్న ప్రభుత్వ కలను సాకారం చేసేందుకు తమ వంతు సహకారం అందించనునట్లు గుప్తా తెలిపారు. -
శీల్యామ్స్‌ను పరిశీలించిన జపాన్ కంపెనీ ప్రతినిధి
బి.కొత్తకోట, న్యూస్‌లైన్ : బి.కొత్తకోట సమీపంలోని బత్తలాపురం రోడ్డులో ఏర్పాటవుతున్న శీల్యామ్స్ కంప్యూటర్ల తయారీ కేంద్రాన్ని మంగళవారం జపాన్‌కు ఒకాయా కంపెనీ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఇన్చార్జ్ నోజిబా పరిశీలించారు. ఒకాయో కంపెనీ జపాన్, చైనా, తైవాన్ తదితర 23 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంప్యూటర్ల తయారీకి అవసరమైన విడిభాగాలను సరఫరా చేస్తుంది. శీల్యామ్స్‌లో తయారయ్యే కంప్యూటర్లకు విడిభాగాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందం చేసుకునే విషయంలో శీల్యామ్స్ కంపెనీ స్థాపకులు శీలం రంగారెడ్డితో వారు చర్చించారు. కంప్యూటర్ల తయారీ, విడిభాగాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము తయారుచేసే చౌకధర కంప్యూటర్ల తయారీకి అవసరమైన పరికరాలను వివిధ దేశాల నుంచి కొనుగోలుచేసి తమకు సరఫరా చేయాలని రంగారెడ్డి నోజిబాను కోరారు. వీరివెంట ఒకాయో కంపెనీ బెంగళూరు ప్రాంతీయ మేనేజర్ రాజే ష్‌కుమార్ ఉన్నారు.