![Okaya Faast Electric Scooter Launched at RS 89999, Range Up To 200 Km - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/2/Okaya-Faast-Electric-Scooter.jpg.webp?itok=e3VXLCTX)
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఓకాయా తన కొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ "ఫాస్ట్"ను గ్రేటర్ నోయిడాలో ఇటీవల జరిగిన 2021 ఈవీ ఎక్స్ పో షోలో లాంఛ్ చేసింది. ఈ కొత్త ఓకాయా ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్'ను ఎక్స్ షోరూమ్ (రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి) రూ.89,999కు లాంఛ్ చేశారు. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.2 వేలను చెల్లించి బుక్ చేసుకోవచ్చు, ఓకాయా డీలర్ షిప్ కేంద్రాల వద్ద కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త ఓకాయా ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 60-70 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీనిలో 4.4 కిలోవాట్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంది. ఈ "ఫాస్ట్" ఈవీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, ఇందులో ఎల్ఈడీడీఆర్ఎల్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఫాస్ట్ స్కూటర్.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్, ఆథెర్ 450ఎక్స్, బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1, బజాజ్ చేతక్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment