శీల్యామ్స్‌ను పరిశీలించిన జపాన్ కంపెనీ ప్రతినిధి | Japan representative at silyams | Sakshi
Sakshi News home page

శీల్యామ్స్‌ను పరిశీలించిన జపాన్ కంపెనీ ప్రతినిధి

Published Wed, May 28 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

శీల్యామ్స్‌ను పరిశీలించిన జపాన్ కంపెనీ ప్రతినిధి

శీల్యామ్స్‌ను పరిశీలించిన జపాన్ కంపెనీ ప్రతినిధి

 బి.కొత్తకోట, న్యూస్‌లైన్ :  బి.కొత్తకోట సమీపంలోని బత్తలాపురం రోడ్డులో ఏర్పాటవుతున్న శీల్యామ్స్ కంప్యూటర్ల తయారీ కేంద్రాన్ని మంగళవారం జపాన్‌కు ఒకాయా కంపెనీ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఇన్‌చార్జ్ నోజిబా పరిశీలించారు. ఒకాయో కంపెనీ జపాన్, చైనా, తైవాన్ తదితర 23 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంప్యూటర్ల తయారీకి అవసరమైన విడిభాగాలను సరఫరా చేస్తుంది. శీల్యామ్స్‌లో తయారయ్యే కంప్యూటర్లకు విడిభాగాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
 
 దీనికి సంబంధించిన ఒప్పందం చేసుకునే విషయంలో శీల్యామ్స్ కంపెనీ స్థాపకులు శీలం రంగారెడ్డితో వారు చర్చించారు.  కంప్యూటర్ల తయారీ, విడిభాగాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము తయారుచేసే చౌకధర కంప్యూటర్ల తయారీకి అవసరమైన పరికరాలను వివిధ దేశాల నుంచి కొనుగోలుచేసి తమకు సరఫరా చేయాలని రంగారెడ్డి నోజిబాను కోరారు.  వీరివెంట ఒకాయో కంపెనీ బెంగళూరు ప్రాంతీయ మేనేజర్ రాజే ష్‌కుమార్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement