నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
Published Thu, Nov 10 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు దెబ్బకు దాదాపు విక్రయాలన్నీ డౌన్ అయ్యాయి. ఈ నోట్ల రద్దుతో పాటు, నగదు విత్డ్రాలో పరిమితులు విధించడం వినియోగదారుల తయారీ వస్తువులకు భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. వచ్చే ఆరునెలల వరకు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల విక్రయాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వైట్ గూడ్స్గా పేరున్న టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 70 శాతం క్షీణించనున్నాయని, మార్కెట్లో ఈ గూడ్స్ ఎక్కువగా నగదు అమ్మకాలే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
'' వచ్చే ఆరు నెలల వరకు ఈ క్షీణతను కంపెనీలు భరించాల్సి ఉంటుంది. ప్రజానీకానికి అవసరమైన మేరకు కొత్త కరెన్సీలు చలామణిలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి ఎదురవుతుంది'' అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. మంగళవారం రాత్రి 500, 1000 నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్, సినిమా హాల్స్ వెలవెలపోయాయని, దీంతో ఫుడ్ అవుట్ లెట్స్ బిజినెస్లు 40 శాతం పతనమయ్యాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రియాజ్ అమ్లానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం విక్రయాలన్నీ పడిపోయినట్టు వీడియోకాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఎం సింగ్ తెలిపారు. నెలవారీ వాయిదాల ప్రకారం ప్రీమియం అప్లియన్స్, టెలివిజన్ కొనుగోళ్లు పట్టణ ప్రాంతాల్లో 60 శాతం వరకు జరుగుతాయని, మిగతా 40 శాతం కొనుగోళ్లు నగదు చెల్లింపులతోనే జరుగుతున్నాయని రియాజ్ తెలిపారు.
దీంతో నగదు చెల్లింపులతో చేసే కొనుగోళ్లన్నీ భారీగా దెబ్బతిన్ననున్నాయని వివరించారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా 500, 2000 నోట్లను ప్రజల్లోకి తీసుకొస్తున్నా.. వాటిపై పరిమితులు విధించడం వ్యాపారాలకు ప్రతికూలతేనని చెప్పారు. అయితే మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంచలన నిర్ణయం సెల్ఫోన్ విక్రయాలకు బాగా కలిసివచ్చిందట. ఈ రద్దును కొంతమంది వినియోగదారులు వారికి అవకాశంగా మరలుచుకుని, వెంటనే సెల్ఫోన్ రిటైల్ షాపులకు పరుగెత్తారు. దీంతో సెల్ఫోన్ రిటైలర్లు బిజెనెస్లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ఫోన్లను వినియోగదారులు భారీగా డిమండ్ పెరిగినట్టు తెలుస్తోంది. కొంతమంది కస్టమర్లు ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు హ్యాండ్సెట్లు కొనుగోలు కూడా చేశారని ఓ లీడింగ్ సెల్ఫోన్ రిటైలర్ సీఈవో తెలిపారు.
Advertisement
Advertisement