
టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహన రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ వాహనాల రేట్లు తగ్గించాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మోడల్స్ రేట్ల తగ్గుదల రూ. 1,600– రూ. 2,300 మధ్య (చెన్నై ఆన్ రోడ్) ఉంటుందని పేర్కొంది. మరోవైపు, « ఎంత మేర తగ్గిస్తున్నది టీవీఎస్ మోటార్స్ వెల్లడించలేదు. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందజేస్తామని సంస్థ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చాకా చాలా మటుకు మోటార్‌సైకిల్స్‌పై పన్నుల భారం ప్రస్తుతమున్న 30% నుంచి 28 శాతానికి తగ్గనుంది. ఇప్పటికే బజాజ్ ఆటో తమ వాహనాల రేట్లను రూ. 4,500 దాకా తగ్గించింది.