సాక్షి, న్యూఢిల్లీ : టీవీలు, మైక్రోవేవ్, ఎల్‌ఈడీ ల్యాంప్స్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిందే. స్థానిక తయారీకి ఊతమివ్వడానికి ఇటీవల ప్రభుత్వం కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని పెంచిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిపై ఇక కస్టమర్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత నోటిఫికేషన్ ప్రకారం టెలివిజన్ సెట్‌లపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి పెంచినట్టు తెలిసింది. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్లపై ఈ డ్యూటీని 15 శాతానికి పెంచారు. ఎల్‌ఈడీ పంప్స్‌పై కూడా ప్రస్తుతం 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నారు. మైక్రోవేవ్‌లపై కూడా ఈ డ్యూటీని రెండింతలు చేసి, 20 శాతంగా నిర్ణయించారు. దీంతో ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలన్నీ పెరిగిపోనున్నాయి.
పూర్తిగా దిగుమతి చేసుకున్న టీవీలపై 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని భరించాల్సి ఉంటుందని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ మనీష్ శర్మ చెప్పారు. స్క్రీన్ సైజు బట్టి సగటున ఎల్‌ఈడీ టీవీల ధరలు రూ.2000 నుంచి రూ.10వేల మేరకు పెరగబోతున్నట్టు సంబంధిత ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం స్థానిక తయారీదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని శర్మ చెప్పారు. శర్మ, పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియాకు సీఈవో, ప్రెసిడెంట్.
ఈ నిర్ణయం కేవలం స్థానిక తయారీదారులను ప్రోత్సహించడమే కాకుండా.. మేకిన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్‌ను ఏర్పరుస్తుందని కూడా శర్మ పేర్కొన్నారు. అదేవిధంగా దిగుమతి సుంకాలను పెంచడం విదేశీ తయారీదారులు భారత్‌లో ఉత్పత్తులు తయారు చేసేలా ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా టెలివిజన్ సెట్లపైనే ధరలు ఎక్కువగా పెరుగనున్నట్టు అంచనావేస్తున్నారు. మైక్రోవేవ్‌లపై విధించిన 20 శాతం దిగుమతి సుంకంతో, మొత్తంగా మైక్రోవేవ్ కేటగిరీలో ధరల పెరుగుదల రూ.400 నుంచి రూ.500 వరకు ఉండొచ్చని గోద్రెజ్ అప్లియెన్స్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నండి తెలిపారు. ఇప్పటికే ఆపిల్, తన ఐఫోన్ మోడల్స్ అన్నింటిపై భారత్‌లో రూ.3,720 వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment