microwave
-
సూట్‌కేస్‌లా కనిపిస్తుంది, కానీ సూట్‌కేస్ కాదు.. మరి ఏంటేంటే..
ఇప్పటి దాకా పోర్టబుల్ గ్రిల్, పోర్టబుల్ స్టవ్, పోర్టబుల్ కుకర్ ఇలా చాలానే చూసుంటారు కానీ.. పోర్టబుల్ మైక్రోవేవ్‌ని చూశారా? లేటెస్ట్ వెర్షన్ గా వచ్చిన ఈ కుక్వేర్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీన్ని ఓపెన్ చేసి సెట్ చేస్తే ఓవెన్‌లా.. ఫోల్డ్ చేసి లాక్ చేస్తే చిన్న సూట్‌కేస్‌లా ఉంటుంది. ఇది జపానీస్ టెక్నాలజీతో రూపొందింది. బ్యాటరీతో పని చేస్తుంది. హ్యాండిల్‌ని వెనక్కి జరిపితే లాక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు సూట్‌కేస్ ఓపెన్ అయ్యి.. ఓవెన్ లా మార్చుకోవడానికి వీలుంటుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చిత్రాల్లో చూడొచ్చు. అయితే ఈ మోడల్ వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. -
ప్రాణాలు తీసేందుకు యత్నించిన మైక్రోవేవ్
Microwave with voice-controlled AI: శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విషయాలు కనుక్కునే క్రమంలో అనేక రకాలైన ప్రమాదాలను ఎదుర్కొవడం సహజం. ఒక్కోసారి తమ ప్రాణాలనే కోల్పోతారు కూడా. కానీ కొన్ని విపత్కర పరిస్థితి తాము రూపొందించిన వాటి చేతిలోనే హతమవ్వడం లేదా అవే ప్రాణాంతకంగా మారడం జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడొక వ్యక్తికి ఎదురైంది. వివరాల్లోకెళ్తే..యూట్యూబర్ లుకాస్ రిజోట్టో తను చేసిన విచిత్రమైన ప్రయోగం తనకు చేదు అనుభవాన్ని ఇచ్చింది. లూకాస్ ఏకంగా తన చిన్ననాటి ఊహజనిత స్నేహితుడు మాగ్నెట్రాన్ గురించి వంద పేజీల పుస్తకాన్ని రాశాడు. పైగా అతను మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొన్న అనుభవశాలి అని చెప్పడం గమనార్హం. అంతేకాదు తన ఊహజనిత స్నేహితుడిని పునర్జీవింప చేసే ప్రయత్నంలో భాగంగా...వాయిస్ నియంత్రిత ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఒక సరికొత్త మైక్రోవేవ్‌ని తయారు చేశాడు. అతను ఆ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) మైక్రోవేవ్‌ని ఆన్ చేయగానే తన పాత మిత్రుడితో మాట్లాడుతున్నట్లు భావించేవాడు. అంతేకాదు లూకాస్ శిక్షణలో అన్ని విషయాలను నేర్చుకున్నాడు మైక్రోవేవ్గా రూపొందిన మాగ్నెట్రాన్. అయితే మాగ్నెట్రాన్ తన గత కాలపు మొదటి ప్రపంచ యుద్ధం తాలుకా భయాలు, బాధలు ఒత్తిడికి సంబంధించిన మనోవ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో మైక్రోవేవ్ రూపంలో ఉన్న మాగ్నెట్రాన్ లూకాస్ని బెదిరించడం, హింసించడం వంటివి మొదలు పెట్టాడు. అఖరికి నీ మనసులో ఏముందని లుకాస్ మాగ్నెట్రాన్ మైక్రోవేవ్‌ని అడిగితే ప్రతీకారం అని పదే పదే బదులు ఇవ్వడమే కాకుండా నిన్ను వెన్నుపొటు పొడిచి మరీ చంపుతానని వచెప్పడం గమనార్హం. అంతేకాదు లూకాన్ని మైక్రోవేవ్‌లోకి రావాల్సిందిగా మైక్రోవేవ్ రూపంలో ఉన్న మాగ్నెట్రాన్ అన్నాడు. అయితే లూకాస్ తనతో వస్తున్నట్లు నటించి మైక్రోవేవ్ డోర్‌ని మూసేశాడు. మనం సృష్టించింది మనకే యుముడై కూర్చోవడం అంటే ఇదే కదా!. I brought my childhood imaginary friend back to life using A.I. (#GPT3) and it was one of the scariest and most transformative experiences of my life. A thread 🤖 (1/23) pic.twitter.com/70C9Yo7m4x — Lucas Rizzotto (@_LucasRizzotto) April 19, 2022 (చదవండి: పోకిరిని చితకబాదిన యువతి.. హ్యాట్సాఫ్ అంటూ వాసిరెడ్డి పద్మ కామెంట్) -
యువతి కంటి చూపు పోగొట్టిన ‘ఆన్లైన్’వంట
లండన్ : మెక్రోవేవ్‌లో ఉడకబెట్టిన కోడిగుడ్డు ఓ యువతి జీవితంలో విషాదాన్ని నింపింది. బ్రేక్‌ఫాస్ట్ తయారుచేయటానికి ఆన్లైన్ చిట్కాను ఉపయోగించి కంటి చూపును కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని రెడ్డిచ్‌కు చెందిన బెతానీ రోసర్(22) ఓ రోజు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయటానికి కోడిగుడ్లు ఉడకబెట్టాలనుకుంది. అప్పుడు ఆమెకు ‘మెక్రోవేవ్‌లో గుడ్లు ఉడకబెట్టటం ప్రమాదం కాదు. సురక్షితంగా, వేగంగా గుడ్లను ఉడకబెట్టుకోవచ్చు’ అని ఇంటర్నెట్లో చదివిన సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే ఓ బౌల్లో నీళ్లు తీసుకుని గుడ్లు వేసి, అందులో కొద్దిగా ఉప్పు కూడా కలిపింది. ఆ గుడ్ల బౌల్‌ను మెక్రోవేవ్‌లో ఆరు నిమిషాల పాటు 900 వాట్స్ వద్ద ఉడికించింది. అనంతరం వాటిని బయటకు తీసి కొద్దిసేపు చల్లారబెట్టి.. అవి ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఓ గుడ్డును నొక్కి చూసింది. అంతే అది ఒక్కసారిగా పేలి ఆమె కుడివైపు ముఖంపై పడింది. వేడివేడి ముక్కలు బలంగా ఆమె కుడి కంటిని ఢీ కొన్నాయి. దీంతో ఆమె కన్ను దెబ్బతిని, కంటిచూపును కోల్పోయింది. ముఖం కూడా బాగా కాలటంతో నొప్పి భరించలేక ఆమె దగ్గరలోని ఆసుపత్రికి పరిగెత్తింది. చికిత్స అనంతరం బెతానీ మాట్లాడుతూ.. ‘మెక్రోవేవ్ నుంచి గుడ్లను బయటకు తీసిన తర్వాత అవి ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఒకదాన్ని గట్టిగా నొక్కి చూశాను. అంతే అది పేలి నా ముఖంపై పడింది. నా జీవితంలో నేనెప్పుడు అంత భయపడలేదు. శరీరం వణుకుతూ ఉంది. నొప్పి భరించలేక ఏడుస్తూ ఉన్నాను. ఇంటర్నెట్లో చదివే విషయాలను గుడ్డిగా నమ్మవద్దు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికి నా కంటిచూపు మెరుగవలేదు. అసలు కంటిచూపు వస్తుందన్న నమ్మకం నాకు లేదని వాపోయింది. -
మరో రెండు రోజుల్లో ఆ వస్తువులపై బాదుడే
కోల్‌కతా : మరో రెండు రోజుల్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్లపై ఈ కంపెనీల బాదుడు షురూ అవుతుంది. ఇప్పటికే ధర ఎక్కువగా ఉండే ఈ వస్తువులు, మరింత కాస్ట్లీగా మారనున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, వీటికి కీలక వనరులుగా ఉంటున్న స్టీల్, కాపర్ ధరలు ఎగియడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నట్టు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చిన దగ్గరనుంచి ప్రీమియం మోడల్స్ ధరలన్నీ 400 వందల రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధరలు పెరుగతాయని తెలిపారు. ఇన్పుట్ కాస్ట్ ఒత్తిడి, రూపాయి విలువ పడిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీటి ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు తెలిపాయి. ఈ ధరలు పెంపు జూన్ నుంచి దశల వారీగా ఉంటుందని గోద్రేజ్ అప్లియన్స్ బిజినెస్ హెడ్ కమల్ నండీ చెప్పారు. గోద్రేజ్ వీటి ధరలను 2 నుంచి 3 శాతం పెంచుతుండగా... దేశంలో అతిపెద్ద ఎయిర్-కండీషనర్ తయారీదారిగా ఉన్న ఓల్టస్ 3 శాతం ధరలను పెంచింది. త్వరలోనే తాము కూడా ధరలను పెంచుతామని వర్పూల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైతం చెప్పారు. అయితే ఈ ధరల పెంపుపై ఎల్జీ, శాంసంగ్ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రమోషన్ ఆఫర్లతో ఈ ధరల పెంపు ప్రభావాన్ని వినియోగదారులపై తగ్గిస్తామని ఓల్టస్ ఎండీ ప్రదీప్ భక్షి అన్నారు. అయితే ఈ ధరల పెంపు తమ డిమాండ్‌పై ప్రభావం పడదని, 70 శాతం విక్రయాలు కన్జ్యూమర్ ఫైనాన్సింగ్‌పై ఆధారపడి ఉంటాయని ముంబైకి చెందిన రిటైలర్ విజయ్ సేల్స్ మేనేజింగ్ పార్టనర్ నైలేష్ గుప్తా చెప్పారు. -
పెరుగనున్న టీవీలు, మైక్రోవేవ్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : టీవీలు, మైక్రోవేవ్, ఎల్ఈడీ ల్యాంప్స్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిందే. స్థానిక తయారీకి ఊతమివ్వడానికి ఇటీవల ప్రభుత్వం కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని పెంచిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిపై ఇక కస్టమర్లు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత నోటిఫికేషన్ ప్రకారం టెలివిజన్ సెట్లపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి పెంచినట్టు తెలిసింది. అదేవిధంగా స్మార్ట్ఫోన్లపై ఈ డ్యూటీని 15 శాతానికి పెంచారు. ఎల్ఈడీ పంప్స్‌పై కూడా ప్రస్తుతం 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించనున్నారు. మైక్రోవేవ్లపై కూడా ఈ డ్యూటీని రెండింతలు చేసి, 20 శాతంగా నిర్ణయించారు. దీంతో ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలన్నీ పెరిగిపోనున్నాయి. పూర్తిగా దిగుమతి చేసుకున్న టీవీలపై 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని భరించాల్సి ఉంటుందని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ మనీష్ శర్మ చెప్పారు. స్క్రీన్ సైజు బట్టి సగటున ఎల్ఈడీ టీవీల ధరలు రూ.2000 నుంచి రూ.10వేల మేరకు పెరగబోతున్నట్టు సంబంధిత ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం స్థానిక తయారీదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని శర్మ చెప్పారు. శర్మ, పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియాకు సీఈవో, ప్రెసిడెంట్. ఈ నిర్ణయం కేవలం స్థానిక తయారీదారులను ప్రోత్సహించడమే కాకుండా.. మేకిన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్‌ను ఏర్పరుస్తుందని కూడా శర్మ పేర్కొన్నారు. అదేవిధంగా దిగుమతి సుంకాలను పెంచడం విదేశీ తయారీదారులు భారత్‌లో ఉత్పత్తులు తయారు చేసేలా ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా టెలివిజన్ సెట్లపైనే ధరలు ఎక్కువగా పెరుగనున్నట్టు అంచనావేస్తున్నారు. మైక్రోవేవ్లపై విధించిన 20 శాతం దిగుమతి సుంకంతో, మొత్తంగా మైక్రోవేవ్ కేటగిరీలో ధరల పెరుగుదల రూ.400 నుంచి రూ.500 వరకు ఉండొచ్చని గోద్రెజ్ అప్లియెన్స్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నండి తెలిపారు. ఇప్పటికే ఆపిల్, తన ఐఫోన్ మోడల్స్ అన్నింటిపై భారత్‌లో రూ.3,720 వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. -
మైక్రోవేవ్ ఓవెన్లో ఇరుక్కుపోయిన తల
లండన్: ప్రాంక్.. అంటే తెలిసిందే. సరదాగా ఇతరులను ఆటపట్టించేందుకు చేసే పని. దానిని వీడియో తీసి, యూట్యూబ్‌లో పెడతారు. వీటిని ఫన్నీ ప్రాంక్స్ అని పిలుస్తారు. ఇలాంటివి చేసేవారిని ప్రాంక్‌స్టర్ అంటారు. బ్రిటన్‌కు చెందిన వోల్వర్‌హ్యాంప్టన్‌కు కూడా ఇలాంటి ప్రాంక్స్ చేయడం సరదా. ఈ సరదా పనే.. అతణ్ని చావు దగ్గరిదాకా తీసుకెళ్లి వెనక్కు పంపింది. ఇంతకీ మన హీరో ఏం చేశాడంటే... తన తలను ఓ ప్లాస్టిక్ కవర్‌తో కప్పి, మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టాడు. ఆ తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ నిండా పాలిఫిల్లా(రకరకాల ఆకారాలు తయారుచేసేందుకు ఉపయోగించే సిమెంట్ లాంటి పదార్థం)ను నింపారు. ఆ తర్వాత తల తీసేస్తే తన ముఖాన్ని తయారు చేయడానికి ఓ అచ్చు తయారవుతుందని భావించాడు. అనుకున్నట్లుగా అంతా బాగానే జరిగినా పాలిఫిల్లా పోసిన తర్వాత తల ఎంతకీ బయటకు రాలేదు. ఇక లోపల ఊపిరి ఆడక మన ప్రాంక్‌స్టర్ అల్లాడిపోయాడు. కాసేపటికే చలనం లేకపోయేసరికి చచ్చిపోయాడని కూడా అనుకున్నారు. అయితే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి, దాదాపు గంటన్నరపాటు శ్రమించి, మైక్రోవేవ్ ఓవెన్‌ను కట్ చేసి, పాలిఫిల్లాను పగులగొట్టి, తలను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి, చికిత్స చేయడంతో ప్రాంక్‌స్టర్ కాస్తా ప్రాణాలతో బయటపడ్డాడు. -
చేపలు ఎండబెట్టేందుకు ‘మైక్రోవోవెన్’..
రూపొందించిన సీఐఎఫ్టీ సాక్షి, విశాఖపట్నం: చేపలను ఎండబెట్టడానికి సరి కొత్త విధానం రాబోతోంది. ఇప్పటిదాకా మత్స్యకారులు వీటిని సాంప్రదాయ పద్ధతిలో ఎండబెట్టే వారు. దీనివల్ల నాణ్యత లోపించడంతో పాటు చేపలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గానూ విశాఖలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషింగ్ టెక్నాలజీ సంస్థ మైక్రోవోవెన్ వాక్యూమ్ డ్రయ్యర్లను రూపొందిం చింది. దీనిపై సీఐఎఫ్టీకి చెందిన డాక్టర్ మధు సూదనరావు, పి.విజిల తదితరులతో కూడిన శాస్త్రవేత్తల బృందం ఏడాది పాటు పరిశోధనలు చేసింది. సత్ఫలితాలు రావడంతో వీటిని వినియోగం లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ వాక్యూమ్ డ్రయ్యర్ల ద్వారా ఎండిన చేపలు నాణ్యత, పరిశుభ్రతతో పాటు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయని, పోషక విలువలు కూడా తగ్గవని సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు చెప్పారు. వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుందని, విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఈ మైక్రోవోవెన్ వాక్యూమ్ డ్రయ్యర్ ధర రూ.5 లక్షల వరకూ ఉంటుందని సీఐఎఫ్టీ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.రఘుప్రకాశ్ చెప్పారు. -
రేడియేషన్ పొల్యూషన్ ఈ కాలుష్యాన్నీ నివారించుకుందాం రండి..!
మనం ‘రేడియేషన్’ అనే మాటను కనీసం అదేమిటో తెలియకుండానే మనం తరచు ఉపయోగిస్తుంటాం. అసలు రేడియేషన్ అంటే ఏమిటి? అది చెడ్డదా? మంచిదా? దాంతో ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా? క్యాన్సర్ లాంటి చికిత్సలకు రేడియేషన్ లాంటి ఉపయోగాలు ఉన్నాయనుకుందాం. అప్పుడది మంచిదే కావాలి కదా! కానీ దానికి ఎక్స్పోజ్ కావడాన్ని ఎందుకు కీడుగా పరిగణిస్తాం. ఇటీవల ఆ రేడియేషన్ కాలుష్యం వాతావరణంలో పెరుగుతుండటంతో దాని గురించిన జాగ్రత్తలూ అవసరమవుతున్నాయి. వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో విరివిగా ప్రస్తావనకు వచ్చే రేడియేషన్ గురించిన అవగాహన కోసమే ఈ కథనం. రమేశ్‌కు క్యాన్సర్ గడ్డ తొలగించాక ఉన్న కొద్దిపాటి క్యాన్సర్ భాగాన్నీ కాల్చివేయడానికి రేడియేషన్ ఇచ్చారట. ఇక సురేశ్ విషయంలో ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. అదేమిటంటే... నిత్యం రేడియేషన్‌కు గురికావడం వల్ల సురేశ్‌కూ క్యాన్సర్ వచ్చిందట. అది బ్లడ్ క్యాన్సర్ట. అదేమిటి? ఒక జబ్బు ను తగ్గించిన రేడియేషన్, మరోచోట అదేలాంటి మరో జబ్బును కలిగించిందా? అసలీ రేడియేషన్ అంటే ఏమిటనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వాటికి సమాధానాలు చూద్దాం. రేడియేషన్ అంటే ఏమిటి? మనం రోజూ ఎండ రూపంలో కాంతిని చూస్తాం కదా! ఈ కాంతి సూర్యుడి నుంచి తరంగాల రూపంలో వస్తుంది. ఈ తరంగాలలో మన కళ్లకు కనపడే కాంతికిరణాలేగాక... కంటికి కనపడని కిరణతరంగాలూ ఉంటాయి. కాంతితో వచ్చే ఈ తరంగాలన్నీ వేర్వేరుగా ఉంటాయి. మన కంటికి కనపడే కాంతిని విజిబుల్ లైట్ అంటారు. ఇదిగాక... దీనికి ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలు, అల్ట్రావయొలెట్ కిరణాలు ఇలా చాలా రకాలుంటాయి. అయితే ఆకాశం నుంచి వచ్చే ఈ కిరణాలను ఒక పోలిక కోసం కాసేపు ఓ చెట్టు మొదలు సైజ్‌లో ఉంటాయనుకుందాం. అందులో మనకు కనిపించే ‘కాంతి’ కేవలం మధ్యలోని ఓ పూచిక పుల్లంత మాత్రమే. మిగతాభాగంలో ఆయా తరంగదైర్ఘ్యాల (వేవ్లెంగ్త్ల)ను బట్టి ఒక వైపున ఇన్ఫ్రారెడ్ కిరణాలు, మైక్రోవేవ్ తరంగాలు, రేడియోతరంగాలు ఉంటాయి. మరోవైపున ఆల్ఫా, బీటా, గామా తరంగాలు ఉంటాయి. కాంతితో సహా ఈ కిరణాల సముదాయాన్నంతటినీ కలిపి ‘రేడియేషన్’ అంటారు. రేడియేషన్‌ను రోజూ చూస్తామా? కాంతిని తప్ప మరిదేన్నీ కంటితో చూడలేం. కానీ రేడియేషన్‌లోని తరంగాలన్నింటినీ రోజూ మనం వాడుకుంటాం. ఉదాహరణకు... కాంతి కంటే తక్కువ వేవ్లెంత్ ఉన్న రేడియో తరంగాల సహాయంతోనే మనం రేడియో వింటాం. వాటికంటే కాస్త పవర్‌ఫుల్‌గా ఉండే మైక్రోవేవ్ తరంగాలు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. కాబట్టి వాటి సహాయంతో వంట వండుకుంటాం. మనం మొబైల్ వాడేటప్పుడు ఒకరితో మరొకరికి అనుసంధానం ఈ తరంగాల వల్లనే కలుగుతుంది. ఈ కిరణాల్లో ఒక రకమైన రాడార్ తరంగాల సహాయంతో వాతావరణాన్ని తెలుసుకోవడం, సముద్రంలోని ఓడలు దారి తప్పకుండా చూడటం, సమాచారాలను పంచుకోవడం చేస్తుంటాం. అంతెందుకు పెద్ద పెద్ద భవంతుల్లోకి వెళ్లినప్పుడు తలపై స్మోక్ డిటెక్టర్స్ అని ఉంటాయి. భవనంలో ఎక్కడైనా పొగను పసిగట్టి మనల్ని హెచ్చరించేలా చేసుకోడానికి ఈ తరంగాలనే ఉపయోగించుకుంటున్నాం. ఇలా ఈ రేడియేషన్ తరంగాల తో మనం అనేకరకాల సేవలు చేయించుకుంటున్నాం. కాంతికి ఈ వైపు ఉన్న ఈ తరహా కిరణాలు ఏదైనా వస్తువుపై పడితే వాటికి ఎలాంటి విద్యుదావేశమూ కలిగించవు కాబట్టి వాటిని ‘నాన్ ఐయొనైజింగ్ రేడియేషన్’ అంటారు. ఇక ఇప్పుడు ఐయొనైజింగ్ రేడియేషన్ కిరణాల దగ్గరకు వద్దాం. ఇవి కాంతికిరణాలకు మరోవైపున ఉంటాయి. వాటి శక్తి కాస్త ఎక్కువ. వాటిలో ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ తరంగాలు అని రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి గాని ఇవి మనిషి చర్మంలోకి చొచ్చుకుపోయేంత శక్తి కలిగి ఉండవు. కాకపోతే ఎక్కడైనా గాయం ఉంటే దాన్లోంచి మనిషి శరీరంలోకి వెళ్లగలవు. అయితే కాగితంలోంచి అతి కష్టం మీద అట్నుంచి ఇటు వెళ్లగలిగే ఇవి... దుస్తుల్లోంచి మాత్రం వెళ్లలేవు. ఇక బీటా పార్టికిల్స్ వాటి కంటే మరికాస్త ఎక్కువ శక్తి ఉంటుంది. అవి శరీరంలోకి ఒకింత దూరం ప్రవేశించగలవు. కానీ దుస్తుల్లోంచి దూరలేవు. అందుకే దుస్తులు వేసుకోవడం వల్ల అటు ఆల్ఫా, బీటా తరంగాల నుంచి రక్షణ కలుగుతుంది. మన చర్మంలో ‘జెర్మినేషన్ లేయర్’ అనే పొర ఉంటుంది. మన చర్మం ఎప్పుడూ మనకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఈ క్రమంలో శిథిలమైన చర్మకణాల స్థానంలో కొత్తకణాలు వచ్చి చేరుతుంటాయి. ఆ కొత్త కణాలు ఎప్పుడూ పుడుతుండే పొరే... ఈ జర్మినేషన్ లేయర్. ఒకవేళ ఏ కారణంగానైనా బీటా తరంగాలు ఈ పొర వరకు చేరితే కొత్త కణాలు పుట్టే ప్రక్రియకు హాని చేకూరుతుంది. ఆల్ఫా, బీటా తరంగాలతో పోలిస్తే గామా తరంగాలు మరింత శక్తిమంతమైనవి. అవి మానవ దేహాల్లోకి చొచ్చుకుపోగలవు. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు... ఈ రెండూ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. కాబట్టే ఈ ఎక్స్-రే ల సహాయం తో విరిగిన ఎముకలు, విరిగిన పంటి భాగాలను, ఇతరత్రా కణజాలాలను చూసి తగిన చికిత్స చేయడానికి సాధ్యమవుతుంది. ఇలా ఎక్స్-రే రూపంలో రేడియేషన్ కూడా మానవుల వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే గామా రేస్ కూడా వైద్యవిజ్ఞానంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కోబాల్ట్-60 అనే మూలకం నుంచి ఇవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నారు. ఈ గామా కిరణాలను ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలోనూ, వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేయడంలోనూ ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ఉపయోగకరమైన రేడియేషన్ గురించి ఆందోళన ఎందుకు? మనకు వైద్యశాస్త్రంలో ఇంతగా ఉపయోగపడే రేడియేషన్ కిరణాల గురించి ఆందోళన ఎందుకు? ఎందుకంటే... ఇవి మనిషి కణజాలాల్లోని కణంపైన ప్రభావం చూపినప్పుడు అందులోని జన్యుస్వరూపాన్ని మార్చగలవు కాబట్టి. జన్యుస్వరూపం అంతా జెనిటిక్ కోడ్ రూపంలో కణంలో నిక్షిప్తమై ఉంటుంది. మన అన్ని జీవక్రియలకు ఇదే ప్రాతిపదిక. ఒకవేళ జన్యుస్వరూపంలో మార్పు వస్తే ఆ మేరకు అది జీవక్రియల్లోనూ ప్రతిఫలిస్తుంది. దాంతో జీవక్రియలు అస్తవ్యస్తమైపోతాయి. ఇలా అస్తవ్యస్తన జీవక్రియలు దీర్ఘకాలంలో మృత్యువుకు సైతం దారితీయవచ్చు. అందుకే ఇలా దీర్ఘకాలంలో రేడియేషన్‌కు గురవుతూంటే క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి రేడియేషన్‌కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రేడియేషన్ కంటామినేషన్ కూడా ఉంటుందా? వ్యాధి ఇతరులకు సోకినట్లుగా రేడియేషన్ కూడా ఇతరులకు సోకుతుందా? ‘రేడియేషన్ కంటామినేషన్’ కూడా ఉంటుందా? అన్న ప్రశ్నకు ‘ఉంటుంది’ అన్నదే జవాబు. రేడియేషన్ ఎక్కడైనా ఉంటుంది. ఆఖరికి మన సాధారణ వాతావరణంలో కూడా ఉండనే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు అది మనకు హాని చేసేంత మోతాదులో ఉండదు. కాబట్టి వాతావరణంలో, కాంతికిరణాలతో పాటు నిత్యం ఉండే రేడియేషన్ వల్ల మనకు హాని జరగదు కాబట్టే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా రేడియేషన్‌ను వెలువరించగల వస్తువులుంటే అవి దుస్తులపై ఉన్నా, అవి ఒకరి నుంచి మరొకరికి తాకి కంటామినేషన్కు దారితీయవచ్చు. రేడియేషన్‌ను వెలువరించగల పదార్థాల వద్ద ఆవలించినప్పుడు లేదా శ్వాసించినప్పుడు అవి మనలోకి వెళ్లవచ్చు లేదా చర్మంపైన రేడియేషన్ పేరుకున్నప్పుడు... దురదృష్టవశాత్తు అక్కడ ఏదైనా గాయం ఉంటే అది శరీరంలోకి ప్రవేశించవచ్చు. అలాంటప్పుడు దాని దుష్ర్పభావాలను ఎంతోకొంత చూపించే ప్రమాదమూ ఉంది. పెరుగుతున్న రేడియేషన్ కాలుష్యం... ఇప్పుడు మనం ప్రతిరోజూ రేడియేషన్ ఉపయోగాలను పెంచుకుంటుండంతోనూ, రేడియేషన్ కిరణాలతో ఉపయోగించే వస్తువుల (ఉదా: మొబైల్ఫోన్లు, స్మోక్ డిటెక్టర్లు, మైక్రోవేవ్ అవెన్ వంటివి) వాడకం కూడా పెరగడంతోనూ వాతావరణంలో నిత్యం ఉండే పాళ్ల కంటే రేడియేషన్ మరింతగా పెరుగుతోంది. దాంతో రేడియేషన్ వల్ల మనపై పడే దుష్ర్పభావాలూ పెరుగుతాయి కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. అందుకే గతంలో నిపుణులకు మాత్రమే పరిమితమైన రేడియేషన్ గురించి, వారితో పాటు సాధారణ ప్రజలకూ అవగాహన అవసరం. రేడియేషన్కూ కొలత ఉంటుందా? ఉంటుంది. మన చుట్టూ ఉండే రేడియేషన్ పాళ్లనూ కొలవగలం. దీనికి యూనిట్ ‘గ్రే’ అనీ, ‘సీవెర్ట్స్’ అని కొలతకు ప్రమాణాలు కూడా ఉంటాయి. ఇంకొక విషయం... కేవలం సూర్యుడు ఉన్నప్పుడు ఎండవేళల్లోనే కాంతికిరణాలతో పాటు రేడియేషన్ వస్తుందని అపోహ పడకూడదు. సూర్యుడి శక్తి భూమిలో నిక్షిప్తమై రాత్రివేళల్లో బయటికి వస్తున్నప్పుడు, దానితోపాటు భూమిలో ఉండే రేడియేషన్‌ను వెలువరించే ఖనిజాలు, మూలకాల నుంచి కూడా రేడియేషన్ బయటకు వస్తుంటుంది. ఆకాశం నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘కాస్మిక్ రేడియేషన్’ అంటారు. భూమి నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘టెరెస్ట్రియల్ రేడియేషన్’ అంటారు. ఇలా రేడియేషన్ అన్నది వానలా ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. అయితే దానిపాళ్లను ప్రమాదకరం కాకుండా పర్యావరణ స్పృహతో అదుపులో ఉంచుకోవడమంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కూడానని గ్రహించాలి. - నిర్వహణ: యాసీన్ రేడియేషన్ ప్రమాదాల నుంచి జాగ్రత్తలు నిత్యం పొడవు చేతుల చొక్కాలు, శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులు ధరించడం మంచిది. అవి మనల్ని కేవలం వాతావరణ దుష్ర్పభావాల నుంచి మాత్రమే గాక... ఇలాంటి రేడియేషన్ దుష్ర్పభావాల నుంచి కూడా ఎంతో కొంత కాపాడుతుంటాయి. ఒకవేళ దుస్తులు రేడియేషన్‌తో కంటామినేట్ అయ్యాయని గ్రహిస్తే వాటిని విడిచి, మళ్లీ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. రేడియేషన్‌ను వెలువరించే వస్తువులు ఉండే కంటెయినర్ వద్దకు వెళ్లినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా ముట్టుకోకూడదు. డాక్టర్లు ఎక్స్-రే వంటి పరీక్షలు చేయించుకోమన్నప్పుడు ఎక్స్-రే తీసేవారు చెప్పే సూచనలను విధిగా పాటించాలి. ఎక్స్-రే గాని లేదా రేడియేషన్ ప్రమేయం ఉండే సీటీ స్కాన్ వంటి అన్ని రకాల పరీక్షలు అన్ని జాగ్రత్తలతో చేయించుకోవాలి. (ఇక్కడ అల్ట్రాసౌండ్ పరీక్షలను రేడియేషన్ పరీక్షలుగా పొరబడేవారు చాలామంది ఉంటారు. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో కేవలం ఒకరకమైన శబ్దతరంగాలను ఉపయోగించి దేహం లోపలి భాగాలను చూస్తారు. వాటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కాబట్టి గర్భవతుల విషయంలో చేసే అల్ట్రాసౌండ్ పరీక్షలతో ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందకూడదు. అది అనవసరమైన భయాలను పెంపొందించుకోవడమే. అయితే గర్భవతులు మాత్రం వీలైనంతవరకు రేడియేషన్‌కు గురికావలసిన ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలను చేయించుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై చేయించాల్సి వస్తే, తాము ఎన్నో నెల గర్భవతి, ఏ అవసరాల కోసం చేయించుకోవాల్సి వస్తుందో డాక్టర్‌తో విపులంగా చర్చించాలి. మీరు రేడియేషన్‌కు గురైన తర్వాత, రేడియేషన్ సోకిందని అనుకున్న భాగాన్ని సబ్బు (నాన్-అబ్రేసిడ్ సోప్)తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటప్పుడు అక్కడ గరుకుగా ఉండే సబ్బు (అబ్రెసివ్ సోప్)ను వాడకూడదని గుర్తుంచుకోండి. డాక్టర్ రావూరి పవర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్