
ఐవైఆర్ సార్.. ఆదుకోండి..!
ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్‌తో ముఖాముఖి నేడు
వేదిక.. ఫ్యాన్సీగూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు
ఒంగోలు కల్చరల్: ఆర్థికంగా చితికిపోయి ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు పొందేందుకు అలమటిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గం.. రాష్ట్ర మాజీ సీఎస్, రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై కోటి ఆశలు పెట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా పేరుపోరుున తమ సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతికి సానుకూల చర్యలు తీసుకుంటారని బ్రాహ్మణ సంఘాల నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక రంగారాయుడు చెరువువద్దగల ఫ్యాన్సీగూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో బ్రాహ్మణ సంఘాల నిర్వాహకులతో, విద్యార్థులు, యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశానికి ఐవైఆర్ ముఖ్యఅతిథిగా హాజరై బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరిస్తారు. ఆయనతోపాటు క్రెడిట్ సొసైటీ సీఈవో అభిజిత్‌కూడా పాల్గొంటారు.
ఆహ్వాన కమిటీ సభ్యులు, ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఆలూరు జైశంకర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. తొలిసారి చైర్మన్ హోదాలో ఒంగోలుకు విచ్చేస్తున్న ఐవైఆర్‌కు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. చాణక్య స్కీంకు గురువారంతో దరఖాస్తు గడువు ముగిసిందని అరుుతే మరో వారంపాటు పొడిగించాలని పలువురు ఐవైఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో అమలుజరుగుతున్న పలు పథకాల గురించి పుస్తకాల రూపంలో, టీవీలు, పత్రికలద్వారా మరింత విస్తృత ప్రచారం చేపట్టాలనికూడా కోరుతున్నారు. జిల్లాలోని బ్రాహ్మణ సంఘాల వారు, యువత , విద్యార్థులు తప్పనిసరిగా ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.