టీవీఎస్‌ మోటార్స్‌ లాభం 7 శాతం అప్‌ | TVS Motor Company Q1FY18 standalone net profit rises 6.6% yoy | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ మోటార్స్‌ లాభం 7 శాతం అప్‌

Published Sat, Aug 12 2017 3:15 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

టీవీఎస్‌ మోటార్స్‌ లాభం 7 శాతం అప్‌

టీవీఎస్‌ మోటార్స్‌ లాభం 7 శాతం అప్‌

న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ జూన్‌ త్రైమాసికంలో రూ. 129 కోట్ల నికర లాభం ప్రకటించింది. ప్రీ–జీఎస్‌టీ వాహన నిల్వలకు సంబంధించి డీలర్లకు అదనపు డిస్కౌంటు కోసం రూ. 16.50 కోట్లు కేటాయించిన అనంతరం ఈ లాభాలు నమోదు చేసినట్లు సంస్థ పేర్కొంది.

ఇది క్రితం క్యూ1లో నమోదైన రూ. 121 కోట్లతో పోలిస్తే సుమారు 7 శాతం అధికం. అటు క్యూ1లో ఆదాయం రూ. 3,188 కోట్ల నుంచి రూ. 3,800 కోట్లకు పెరిగింది. ఉత్పత్తుల రేట్లు తగు రీతిలో తగ్గించడం ద్వారా వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement