
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం జూన్ త్రైమాసికంలో రెట్టింపునకు పైగా పెరిగి రూ.46.63 కోట్లుగా నమోదైంది. విక్రయాల ద్వారా ఆదాయం సైతం 37 శాతం వృద్ధితో రూ.1,045 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.20 కోట్లు, ఆదాయం రూ.763 కోట్లుగా ఉండడం గమనార్హం. ‘‘లాక్‌డౌన్లు, రవాణాపై ఆంక్షలు, సరఫరా పరంగా సమస్యలు, ప్రయాణాలపై ఆంక్షలు, సామాజికంగా భౌతిక తూరం తదితర చర్యలు జూన్ త్రైమాసికంలో కంపెనీ సాధారణ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపించాయి’’ అని ఇండియా సిమెంట్స్ తెలిపింది. బీఎస్‌ఈలో ఇండియా సిమెంట్స్ షేరు 2 శాతం తగ్గి రూ.179 వద్ద క్లోజయింది.
Comments
Please login to add a commentAdd a comment