
కొత్త బైక్‌ను విడుదల చేస్తున్న టీవీఎస్ మోటార్ జాయింట్ ఎండీ సుదర్శన్ వేణు, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్తగా రేడియాన్ బైక్‌ను ఆవిష్కరించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ బైక్ ధర రూ. 48,400 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా ఉంటుంది. కార్ తరహా స్పీడోమీటర్, పెద్ద సీటు, క్రోమ్ సైలెన్సర్, స్మార్ట్ ఫోన్ చార్జర్, ట్యూబ్‌లెస్ టైర్లు, లీటరుకు 69.3 కిలోమీటర్ల మైలేజి వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. త్వరలోనే విక్రయాలు ప్రారంభించనున్నట్లు, తొలి ఏడాదిలో రెండు లక్షల వాహనాల అమ్మకాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ జాయింట్ ఎండీ సుదర్శన్ వేణు గురువారం విలేకరులకు తెలిపారు.
టీవీఎస్ ఇప్పటికే స్పోర్ట్, స్టార్ సిటీ, విక్టర్ బైక్స్ విక్రయిస్తోంది. రేడియాన్‌లో మరికొన్ని వేరియంట్స్ కూడా ప్రవేశపెడతామని, ఈ శ్రేణిని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సంస్థ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గతేడాది రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. ఈసారి రూ. 700 కోట్లు మేర వెచ్చించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన అపాచీ ఆర్‌ఆర్ 310, అపాచీ ఆర్‌టీఆర్ 160–4వి, ఎన్‌టార్క్ బైక్‌లకు మంచి స్పందన లభించిందని రాధాకృష్ణన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment