motorbike
-
ఇది కదా తుఫాన్ అంటే.. రూ.12 కోట్ల IPOకు వెళ్తే.. రూ.4800 కోట్ల బిడ్స్..!
-
పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు!
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి, ఇద్దరు మహిళలతో పాటు ఒక వృద్ధునికి గాయలయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు,, పక్కనే ఉన్న గోడ కూలిపోయాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తాడ్వి తెలిపారు. శాంతి నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో బ్యాటరీ పేలిపోయిందని అధికారి తెలిపారు. ఛార్జింగ్ కోసం ఇంట్లోనే బైక్ పెట్టుకున్నారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో 28 ఏళ్ల మహిళ, పొరుగింట్లో ఉంటున్న 66 ఏళ్ల వృద్ధుడు, 56 ఏళ్ల మహిళ గాయపడ్డారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
బైక్‌ను నెత్తిన పెట్టుకొని.. బస్సెక్కించాడు.. వైరలవుతున్న వీడియో
కుటుంబాన్ని పోషించేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల పనులు చేస్తుంటారు. పొట్ట కూటి కోసం కొందరు ఎంత కష్టమైనా భరిస్తుంటారు. తమ శక్తికి మించి చెమట చిందిస్తారు. తాజాగా అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బైక్‌ను పైకి లేపేందుకు కూడా మనకు శక్తి సరిపోదు.. అలాంటిది ఓ వ్యక్తి బైక్‌ను తలపై పెట్టుకొని ఏకంగా బస్సు మీదకు ఎక్కించాడు. ముందుగా బైక్‌ను తన నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్‌కు ఏర్పాటు చేసిన నిచ్చెన సాయంతో పైకి వచ్చాడు. తన మెడను బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు టాప్‌పైన ఉన్న క్యారియర్‌పై బైక్‌ను దించేశాడు. బైక్‌ను నెత్తిన పెట్టుకుని కొద్ది దూరం నడిచి బస్సు టాప్‌పైకి ఎక్కించారు. అయితే అది ఎక్కడ జరిగిందో, అతనెవరనేదానిపై స్పష్టత లేదు. గుల్జార్ సాహెబ్ అనే వ్యక్తి.. ఈ వీడియోను శుక్రవారం తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు దీనిని 76 వేలకుపైగా మంది చూడగా, 5 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఎలాంటి సాయం లేకుండా బైక్‌ను నెత్తిన పెట్టుకొని మోసిన వ్యక్తిని సూపర్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: సత్యేందర్ జైన్ మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ -
ఎగిరే మోటర్‌బైక్.. ద స్పీడర్!
ట్రాఫిక్ పెరిగిపోతోందని చికాకు పడుతున్నారా? ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ ఆఫీసుకు వెళ్లగలిగితే భలే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. అమెరికన్ కంపెనీ జెట్ప్యాక్ ఏవియేషన్ ‘ద స్పీడర్’ పేరుతో ఎగిరే మోటర్‌బైక్‌ను అభివృద్ధి చేయడం దీనికి కారణం. కొన్నేళ్ల క్రితం వెన్నుకు తగిలించుకునే జెట్‌ప్యాక్‌ను తయారు చేసిన కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ద స్పీడర్ విషయానికి వస్తే.. ఇది చూడ్డానికి మోటర్‌బైక్ మాదిరిగా ఉంటుంది. కానీ నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. కాకపోతే దాదాపుగా బొక్కబోర్లా పడుకుని నడపాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు టర్బోజెట్ ఇంజిన్లు ఉంటాయి. గరిష్టంగా 15000 అడుగుల ఎత్తులో ఎగరగల సామర్థ్యం దీని సొంతం. దాదాపు 125 కిలోల బరువు మోసుకెళ్లగలదు. కిరోసిన్ లేదా విమాన ఇంధనం సాయంతో 22 నిమిషాలపాటు ఎగురగలదు. అది కూడా గరిష్టంగా గంటకు 241 కిలోమీటర్ల వేగంతో! ఇంకోలా చెప్పాలంటే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చునన్నమాట. ప్రస్తుతానికి తాము 20 నమూనా బైక్‌లను మాత్రమే తయారు చేస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఐదు టర్బోజెట్ల ఇంజిన్లతో పైలట్ అవసరం లేని మైక్‌ల తయారీకి జెట్ప్యాక్ మిలటరీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అంతా బాగుంది కానీ.. ధర ఎంత అంటారా? ఒక్కో ‘ద స్పీడర్’ ఖరీదు రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. మిలటరీ వెర్షన్ ఎంతన్నది మాత్రమే తెలియదు. -
టీవీఎస్ నుంచి రేడియాన్ మోటార్‌బైక్
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్తగా రేడియాన్ బైక్‌ను ఆవిష్కరించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ బైక్ ధర రూ. 48,400 (ఎక్స్‌షోరూం ఢిల్లీ)గా ఉంటుంది. కార్ తరహా స్పీడోమీటర్, పెద్ద సీటు, క్రోమ్ సైలెన్సర్, స్మార్ట్ ఫోన్ చార్జర్, ట్యూబ్‌లెస్ టైర్లు, లీటరుకు 69.3 కిలోమీటర్ల మైలేజి వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. త్వరలోనే విక్రయాలు ప్రారంభించనున్నట్లు, తొలి ఏడాదిలో రెండు లక్షల వాహనాల అమ్మకాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ జాయింట్ ఎండీ సుదర్శన్ వేణు గురువారం విలేకరులకు తెలిపారు. టీవీఎస్ ఇప్పటికే స్పోర్ట్, స్టార్ సిటీ, విక్టర్ బైక్స్ విక్రయిస్తోంది. రేడియాన్‌లో మరికొన్ని వేరియంట్స్ కూడా ప్రవేశపెడతామని, ఈ శ్రేణిని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సంస్థ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గతేడాది రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. ఈసారి రూ. 700 కోట్లు మేర వెచ్చించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన అపాచీ ఆర్ఆర్ 310, అపాచీ ఆర్టీఆర్ 160–4వి, ఎన్‌టార్క్ బైక్‌లకు మంచి స్పందన లభించిందని రాధాకృష్ణన్ చెప్పారు. -
బైక్‌పై మహిళా క్రికెటర్..
లాహోర్: పాకిస్థాన్‌లో క్రికెట్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో..అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రపంచకప్ టోర్ని నుంచి నిష్క్రమించిన పాక్ మహిళా జట్టుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంటికి వెళ్లడానికి కనీస సౌకర్యం కల్పించలేదు. బౌలర్ నష్రా సంధుకు లాహోర్ ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లే సౌకర్యం కల్పించకపోవడంతో ఆమె చేసేది ఏమి లేక కుటుంబ సభ్యుని బైక్‌పై ఇంటికి వెళ్లింది. ఇది కాస్త సామా టీవీ చానెల్ ప్రసారం చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పాక్ క్రికెట్ అభిమానులంతా పీసీబీపై మండిపడుతుండగా భారత అభిమానులు మాత్రం ఎవరి చేసుకున్న కర్మ వారిదే అని కశ్మీర్ పరిస్థితి ఉద్ధేశించి కామెంట్లు చేస్తున్నారు. పాక్ పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మాతో క్రికెట్ ఆడటానికి మా దేశానికి రండి అని విజ్ఞప్తి చేసినా టాప్ ర్యాంకులో ఉన్న ఏ జట్లు పాక్‌లో ఆడటానికి సుముఖత చూపకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గడ్డు కాలాన్ని ఎదురుకుంటోంది. ఇక పాక్ మహిళా క్రికెటర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్ ఆదరణ పొందుతుండగా పాక్ మహిళల జట్టు మాత్రం ప్రపంచకప్‌లో దారుణంగా ఓటమిపాలైంది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఒక్కటి గెలవకుండా టోర్ని నుంచి నిష్క్రమించింది. ఇక పీసీబీ నుంచి వీరికి ఎలాంటి ఆదరణ లేదు. ఘోర వైఫల్యాల కారణంగా పాక్ మహిళా జట్టు కెప్టెన్ సనామిర్పై వేటుపడింది. కెప్టెన్సీ నుంచి పీసీబీ ఆమెను తప్పించింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
లక్కిరెడ్డిపల్లె: వేగంగా వెళుతున్న మోటార్ బైక్ అదుపు తప్పి కిందపడటంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. లక్కిరెడ్డిపల్లె మండలం పాళెంగొల్లపల్లె పంచాయతీ చిన్నపోతులవాండ్లపల్లెకు చెందిన మంగి రామచంద్రయ్య(20), నంద్యాల రమణయ్య(30), గుండే వీరాంజనేయులు అనే ముగ్గురు యువకులు బుధవారం గంగమ్మ జాతరకు వెళ్లి తిరిగి లక్కిరెడ్డిపల్లెకు బయలుదేరారు. గద్దగుండ్లరాచపల్లె సమీపంలోని కస్తూర్బా పాఠశాలకు Ðð ళ్లే మార్గ మధ్యంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సమాధిని ఢీకొంది. ఈ సంఘటనలో మంగి రామచంద్రయ్య అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా నంద్యాల రమణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండే వీరాంజనేయులు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించినట్లు అతని బంధువులు తెలిపారు. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌పై ఐదుగురమ్మాయిల వీడియో హల్ చల్
హెజోవ్(చైనా): ఒకే బైక్ పై ఐదుగురు అమ్మాయిలు రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దక్షిణ చైనాలోని హెజోవ్ నగరంలోని రోడ్లపై అమర్చిన సీసీకెమెరాల్లో ఐదుగురు అమ్మాయిలు బైక్ పై ప్రయాణిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే వారు కొద్ది దూరం ప్రయాణించగానే పోలీసులకు చిక్కారు. ఐదురుగురిలో నలుగురు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. బైక్ పై ఎక్కువ మంది కూర్చోవడమే కాకుండా డ్రైవింగ్ చేసిన అమ్మాయికి లైసెన్స్ కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. వర్షాలతో తడిగా ఉన్న రోడ్ల పై ఐదుగురు అమ్మాయిలు ప్రయాణించడమేంటని వీడియోని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నేతల దాడి
వరికుంటపాడు: మండలంలోని గువ్వాడి క్లస్టర్ పంచాయతీ కార్యదర్శి కె.వెంకట్రామిరెడ్డిపై టి.బోయమడుగుల టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు యాదవ్ వర్గీయులు దాడిచేసిన సంఘటన శుక్రవారం రాత్రి వరికుంటపాడులో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. కార్యదర్శి కె.వెంకట్రామిరెడ్డి ఏడాది క్రితం గువ్వాడి పంచాయతీ క్లస్టర్‌కు కార్యదర్శిగా నియమితులయ్యారు. టి.బోయమడుగుల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు యాదవ్ అనుచరులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు.దానిద్వారా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కోసం మీసేవలో దరఖాస్తు చేశారు. మీసేవలో జరిగిన తప్పువల్ల మరణ ధ్రువీకరణ పత్రంలో చనిపోయిన తేదీ తప్పు దొర్లింది. దీంతో టీడీపీ నేత మీసేవ ద్వారా వచ్చిన సర్టిఫికెట్లో చనిపోయిన తేదీ ఏదైతే నమోదైందో అదే తేదీతో తిరిగి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. అలా కాదనడంతో వివాదం మొదలైంది. దీనిపై ఎంపీపీ వెంకటాద్రి వద్ద పంచాయతీ జరిగింది. కానీ కార్యదర్శి తేదీ మార్చి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన్ను టి.బోయమడుగుల పంచాయతీ కార్యదర్శిగావున్న బాధ్యతలను తొలగించి వేరే కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. యినా ఆ టీడీపీ నేత పలు రకాలుగా బయటి వ్యక్తులతో దుర్భాషలాడుతున్నారని తెలుసుకొని శుక్రవారం రాత్రి పంచాయతీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డి సదరు నేతకు ఫోన్ చేసి అడిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది జరిగిన కొంతసేపటికి టీడీపీ నేత అనుచరులు వరికుంటపాడులోని తన గదిలో పిడిగుద్దులు గుప్పించి రికార్డులను చించేశారు. చుట్టుపక్కల వారు రావడంతో మోటర్‌బైక్‌లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాధితుడు ఎస్సై కె.నాగార్జునరెడ్డికి తనపై జరిగిన దాడిని వివరించి మోటర్‌బైక్‌లను వారికి అప్పగించారు. ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిపై కార్యదర్శుల ఖండన పంచాయతీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కార్యదర్శులు డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్‌చేసి తగిన చర్యలు తీసుకోకపోతే సోమవారం విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ధర్నా చేపడతామన్నారు. గతంలో కూడా మహ్మదాపురం సర్పంచ్ బంధువు పంచాయతీ కార్యదర్శి వెంకటకృష్ణపై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. -
అప్పట్లో ఆవిరి బైకులు
మోటార్‌బైకులు ఇప్పుడు కామన్‌గా మారాయి గానీ, శతాబ్దం కిందట చాలా అరుదుగా ఉండేవి. అయితే, మోటార్‌బైక్ ఆవిర్భావం వెనుక చాలా చరిత్రే ఉంది. ఆవిరి యంత్రం కనిపెట్టిన తర్వాత రవాణారంగం వేగం పుంజుకుంది. వాహనాలను నడపడానికి ఆవిరి శక్తిని ఉపయోగించడం మొదలైంది. తొలినాళ్లలో పెద్ద వాహనాలను నడపడానికే ఆవిరిశక్తిని ఉపయోగించేవాళ్లు. ఇదే శక్తితో రెండు చక్రాల సైకిల్‌ను కూడా నడపవచ్చని 1860లలో ఇద్దరు ఇంజనీర్లు ఆలోచించారు. ఫ్రెంచి ఇంజనీర్ పియర్రె మిషాక్స్, అమెరికన్ ఇంజనీర్ సిల్వెస్టర్ హోవర్డ్ రోపర్ వేర్వేరుగా తమ ప్రయత్నాలు చేశారు. మిషాక్స్ సింగిల్ సిలిండర్ ఆవిరి యంత్రాన్ని సైకిల్‌కు అమర్చాడు. రోపర్ డబుల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చాడు. ఈ రెండు ఇంజన్లూ సైకిళ్లకు మించిన భారం కావడంతో వారిద్దరివీ విఫలయత్నాలుగానే మిగిలాయి. అయితే, 1885లో జర్మన్ ఇంజనీర్ గాట్లియెబ్ డైమ్లర్ పెట్రోలుతో నడిచే ఇంజన్‌ను విజయవంతంగా రూపొందించాడు. దీనికి పేటెంట్ కూడా సాధించాడు. డైమ్లర్ రూపొందించిన మోటార్‌సైకిళ్లు 1890 నాటికల్లా యూరోప్ వీధుల్లో విహరించడం ప్రారంభించాయి. అప్పట్లో జనాలు వాటిని అబ్బురంగా చూసేవాళ్లు. దాదాపు యాభయ్యేళ్ల పాటు మోటార్‌సైకిళ్ల నమూనాల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, 1940-50 మధ్య కాలంలో గణనీయమైన మార్పులే వచ్చాయి. వాటి ఆధారంగానే పలు కంపెనీలు అధునాతనమైన మోటార్ సైకిళ్లకు రూపకల్పన చేయడం ప్రారంభించాయి. -
టైగర్ వుడ్స్‌కు రూ. 250 కోట్లు
భారీ మొత్తానికి ‘హీరో’ ఒప్పందం ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ ‘హీరో’ కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, విరాట్ కోహ్లి తదితరులకు ఏడాదికి ఒక ఒప్పందానికి రూ. 4 నుంచి 10 కోట్లు లభిస్తాయి. క్రికెటర్లను కాదని గోల్ఫర్‌తో హీరో సంస్థ ఒప్పందం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ‘టైగర్ వుడ్స్ గోల్ఫ్ చాంపియనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో గుర్తింపు పొందినవాడు’ అని పవన్ ముంజల్ అన్నారు. భవిష్యత్‌లో ఇతర క్రీడాంశాల్లోని మేటి ఆటగాళ్లతో కూడా తమ సంస్థ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌కు వచ్చిన వుడ్స్... అక్కడి ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరవలేనన్నాడు. -
అనుకున్న దొక్కటి...అయినది మరొక్కటి