
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
లక్కిరెడ్డిపల్లె:
వేగంగా వెళుతున్న మోటార్ బైక్ అదుపు తప్పి కిందపడటంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు..
లక్కిరెడ్డిపల్లె మండలం పాళెంగొల్లపల్లె పంచాయతీ చిన్నపోతులవాండ్లపల్లెకు చెందిన మంగి రామచంద్రయ్య(20), నంద్యాల రమణయ్య(30), గుండే వీరాంజనేయులు అనే ముగ్గురు యువకులు బుధవారం గంగమ్మ జాతరకు వెళ్లి తిరిగి లక్కిరెడ్డిపల్లెకు బయలుదేరారు. గద్దగుండ్లరాచపల్లె సమీపంలోని కస్తూర్బా పాఠశాలకు Ðð ళ్లే మార్గ మధ్యంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సమాధిని ఢీకొంది. ఈ సంఘటనలో మంగి రామచంద్రయ్య అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా నంద్యాల రమణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండే వీరాంజనేయులు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించినట్లు అతని బంధువులు తెలిపారు. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.