వన్‌ప్లస్‌ టీవీలపై రిలయన్స్‌ ఆఫర్‌ | Discover the OnePlus TV experience exclusively at Reliance Digital | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ టీవీలపై రిలయన్స్‌ ఆఫర్‌

Published Sat, Oct 19 2019 2:16 PM | Last Updated on Sat, Oct 19 2019 3:07 PM

Discover the OnePlus TV experience exclusively at Reliance Digital - Sakshi

సాక్షి, ముంబై : చైనా సంస్థ వన్‌ప్లస్‌ దేశీయ నెంబర్‌ వన్‌ ఎలక్ట్రానిక్స్ రిటైలర్  రిలయన్స్‌ డిజిటల్‌ తో  మరోసారి కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.  వేగంగా అభివృద్ధి చెందుతున్న టీవీ మార్కెట్‌పై కన్నేసిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీలను రూపొందించింది. ఈ మేరకు వన్‌ ప్లస్‌ టీవీలను నేడు (శనివారం, 19) రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1, వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1 ప్రో టీవీలు రెండింటినీ ప్రత్యేకంగా విక్రయిస్తుంది.  

ఆఫర్లు
వన్‌ప్లస్‌ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు,హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై  రూ .7వేల వరకు క్యాష్‌బ్యాక్ నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌టెండెడ్ వారంటీతోపాటు మల్టీబ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి ప్రత్యేకమైన ఆఫర్‌లను    రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. రెండు వెర్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న వందకు పైగా   రిలయన్స్ డిజిటల్,  జియో స్టోర్స్‌లో లభిస్తాయి.

ప్రభాదేవిలో జరిగిన  ఈ లాంచింగ్‌ కార్యక్రమానికి రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బడే అధ్యక్షత వహించగా,  రిలయన్స్ డిజిటల్, ఈవిపి అండ్‌ సిఎంఓ  కౌషల్ నెవ్రేకర్, వన్‌ప్లస్‌ ఇండియా జనరల్ మేనేజర్ (జీఎం) వికాస్ అగర్వాల్‌ పాల్గొన్నారు.  బాలీవుడ్ నటి తారా సుతారియా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ డిజిటల్ తన అభిమాన టెక్నాలజీ స్టోర్ అనీ, భారతదేశమంతా ఈ కొత్త తరం టీవీని అనుభవించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. గత ఏడాది నవంబరునుంచి రిలయన్స్‌ డిజిటల్‌తో  కలిసి పనిచేస్తున్నామని, స్పందన అద్భుతంగా వుందని వికాస్‌ అగర్వాల్‌ వెల్లడించారు. తాజాగా వన్‌ప్లస్‌ టీవీలతో తమ ఈ భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. బ్రియాన్ బాడే మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించిన నెంబర్‌ వన్‌ సంస్థగా తమ ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలోఉంచుకుని, రిలయన్స్ డిజిటల్ కుటుంబానికి వన్‌ప్లస్ టీవీని స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందనీ, భారత వినియోగదారునికి,  ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన తాజా టెక్నాలజీ బ్రాండ్ల మధ్య వారధిగా కొనసాగుతామని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement