exclusively
-
వన్‌ప్లస్ టీవీలపై రిలయన్స్ ఆఫర్
సాక్షి, ముంబై : చైనా సంస్థ వన్‌ప్లస్ దేశీయ నెంబర్ వన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ రిలయన్స్ డిజిటల్ తో మరోసారి కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టీవీ మార్కెట్‌పై కన్నేసిన వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలను రూపొందించింది. ఈ మేరకు వన్ ప్లస్ టీవీలను నేడు (శనివారం, 19) రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1, వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1 ప్రో టీవీలు రెండింటినీ ప్రత్యేకంగా విక్రయిస్తుంది. ఆఫర్లు వన్‌ప్లస్ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు,హెచ్డీఎఫ్సీ కార్డులపై రూ .7వేల వరకు క్యాష్‌బ్యాక్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్టెండెడ్ వారంటీతోపాటు మల్టీబ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి ప్రత్యేకమైన ఆఫర్లను రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది. రెండు వెర్షన్లు దేశవ్యాప్తంగా ఉన్న వందకు పైగా రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్‌లో లభిస్తాయి. ప్రభాదేవిలో జరిగిన ఈ లాంచింగ్ కార్యక్రమానికి రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బడే అధ్యక్షత వహించగా, రిలయన్స్ డిజిటల్, ఈవిపి అండ్ సిఎంఓ కౌషల్ నెవ్రేకర్, వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ (జీఎం) వికాస్ అగర్వాల్ పాల్గొన్నారు. బాలీవుడ్ నటి తారా సుతారియా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ డిజిటల్ తన అభిమాన టెక్నాలజీ స్టోర్ అనీ, భారతదేశమంతా ఈ కొత్త తరం టీవీని అనుభవించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. గత ఏడాది నవంబరునుంచి రిలయన్స్ డిజిటల్‌తో కలిసి పనిచేస్తున్నామని, స్పందన అద్భుతంగా వుందని వికాస్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా వన్‌ప్లస్ టీవీలతో తమ ఈ భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. బ్రియాన్ బాడే మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించిన నెంబర్ వన్ సంస్థగా తమ ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలోఉంచుకుని, రిలయన్స్ డిజిటల్ కుటుంబానికి వన్‌ప్లస్ టీవీని స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందనీ, భారత వినియోగదారునికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన తాజా టెక్నాలజీ బ్రాండ్ల మధ్య వారధిగా కొనసాగుతామని వ్యాఖ్యానించారు. -
ఐడియా, ఫ్లిప్‌కార్ట్: 4జీ స్మార్ట్ఫోన్లలో భారీ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయ మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులర్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యైకంగా కొనుగోలు చేసిన 4 జీ స్మార్ట్ ఫోన్లపై ప్రీపెయిడ్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను గురువారం ప్రకటించింది. 4 జీ స్మార్ట్ఫోన్లకు అప్ గ్రేడ్ చేసుకునే ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 356 తో రీఛార్జి చేసుకున్న ఐడియా వినియోగదారులకు 30 జిబి 4 జి డేటాను ఉచితంగా అందిస్తోంది. రోజువారీ డేటా పరిమితి లేకుండా ఈ డేటా ఉచితం. అలాగే అపరిమిత స్థానిక మరియు జాతీయ వాయిస్ కాలింగ్ సదుపాయం. రూ .191 రీఛార్జిపై 10 జిబి డేటా ఉచితంగా అందించనున్నామని సంస్థ ఒక ప్రకనటలో తెలిపింది. . రూ .4 వేల నుంచి రూ .25 వేల మధ్య కొన్న లెనోవో, మైక్రోమ్యాక్స్, మోటరోలా,పానాసోనిక్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ ఆఫర్ ప్రత్యేకం. అలాగే కొత్త ఐడియా వినియోగదారులకు కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఐడియా పేర్కొంది. ఈ అసోసియేషన్ ద్వారా మరింతమంది భారతీయులకు భారీ డేటా వినియోగం, మొబైల్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులో ఉంటుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ అన్నారు. ఈ భాగస్వామ్యం కీలకమనీ, తమ వినియోగదారులకు మెరుగైన డేటా ప్రణాళికలను అందించడానికి, తమ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల బేస్‌ను పెంచుకోవడానికి ఇది సాయపడుతుందని ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్, చెప్పారు. కాగా ఆదిత్య బిర్లా గ్రూపు ఐడియా సెల్యులార్ దేశవ్యాప్తంగా 200 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. -
'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఆపిల్ కొత్త మోడల్ ఐ ఫోన్ 7 ఇపుడు హైదరాబాద్ ముంగిట్లో కొలువు దీరనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ పండగ సీజన్ లో హైదరాబాదీలను ఆకట్టుకునేందుకు అక్టోబర్ 7 నగర మార్కెట్లోకి ప్రత్యేకంగా లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సాయంత్రం 7 గంటలకు అప్ట్రానిక్స్, అపెక్స్ స్టోర్లలో ఎక్స్ క్లూజివ్ గా లిమిటెడ్ స్టాక్ ను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. సమీపంలోఈ స్టోర్లలో సంప్రదించి తమ తాజా డివైస్ ఐ ఫోన్ 7 ను సొంతం చేసుకోవాలని కోరింది. అలాగే అప్ ట్రానిక్స్ తన ఫేస్ బుక్ పేజ్ లో ఐ ఫోన్ లాంచింగ్ విషయాన్ని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం http://aptronixindia.com/store/service-centers సందర్శించాలని కోరింది. కాగా ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్ ఐ ఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్లు, నేడు భారత వినియోగదారుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.