ఐడియా, ఫ్లిప్‌కార్ట్: 4జీ స్మార్ట్‌ఫోన్లలో భారీ ఆఫర్
ఐడియా, ఫ్లిప్‌కార్ట్: 4జీ స్మార్ట్‌ఫోన్లలో భారీ ఆఫర్
Published Thu, May 18 2017 6:11 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
న్యూఢిల్లీ: దేశీయ మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులర్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యైకంగా కొనుగోలు చేసిన 4 జీ స్మార్ట్ ఫోన్లపై ప్రీపెయిడ్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను గురువారం ప్రకటించింది. 4 జీ స్మార్ట్‌ఫోన్లకు అప్ గ్రేడ్ చేసుకునే ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ. 356 తో రీఛార్జి చేసుకున్న ఐడియా వినియోగదారులకు 30 జిబి 4 జి డేటాను ఉచితంగా అందిస్తోంది. రోజువారీ డేటా పరిమితి లేకుండా ఈ డేటా ఉచితం. అలాగే అపరిమిత స్థానిక మరియు జాతీయ వాయిస్ కాలింగ్ సదుపాయం. రూ .191 రీఛార్జిపై 10 జిబి డేటా ఉచితంగా అందించనున్నామని సంస్థ ఒక ప్రకనటలో తెలిపింది.
. రూ .4 వేల నుంచి రూ .25 వేల మధ్య కొన్న లెనోవో, మైక్రోమ్యాక్స్, మోటరోలా,పానాసోనిక్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ ఆఫర్ ప్రత్యేకం. అలాగే కొత్త ఐడియా వినియోగదారులకు కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఐడియా పేర్కొంది.
ఈ అసోసియేషన్ ద్వారా మరింతమంది భారతీయులకు భారీ డేటా వినియోగం, మొబైల్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులో ఉంటుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ అన్నారు. ఈ భాగస్వామ్యం కీలకమనీ, తమ వినియోగదారులకు మెరుగైన డేటా ప్రణాళికలను అందించడానికి, తమ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల బేస్‌ను పెంచుకోవడానికి ఇది సాయపడుతుందని ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్, చెప్పారు. కాగా ఆదిత్య బిర్లా గ్రూపు ఐడియా సెల్యులార్ దేశవ్యాప్తంగా 200 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
Advertisement
Advertisement