'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో | i Phone 7 launches hyderabad exclusively in aptronix and apex stores | Sakshi
Sakshi News home page

'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో

Published Fri, Oct 7 2016 3:27 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో - Sakshi

'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో

హైదరాబాద్:   ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఆపిల్ కొత్త మోడల్ ఐ ఫోన్ 7  ఇపుడు  హైదరాబాద్  ముంగిట్లో కొలువు దీరనుంది.  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్  పండగ సీజన్ లో  హైదరాబాదీలను ఆకట్టుకునేందుకు అక్టోబర్ 7 నగర మార్కెట్లోకి  ప్రత్యేకంగా లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సాయంత్రం 7 గంటలకు  అప్ట్రానిక్స్,  అపెక్స్  స్టోర్లలో ఎక్స్ క్లూజివ్ గా   లిమిటెడ్ స్టాక్ ను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. సమీపంలోఈ స్టోర్లలో  సంప్రదించి తమ తాజా డివైస్ ఐ ఫోన్ 7 ను సొంతం చేసుకోవాలని కోరింది. అలాగే అప్ ట్రానిక్స్  తన ఫేస్ బుక్  పేజ్ లో  ఐ ఫోన్ లాంచింగ్  విషయాన్ని  ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం http://aptronixindia.com/store/service-centers సందర్శించాలని కోరింది.

కాగా ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్ ఐ ఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్లు, నేడు భారత వినియోగదారుల   ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement