i Phone 7
-
రూ.7777 చెల్లిస్తే..ఐ ఫోన్ 7 మీ సొంతం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులను ఆకర్షించటానికి దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ ఐ ఫోన్ 7 పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్‌లో భాగంగా లాంచ్ చేసిన ఆన్లైన్ స్టోర్ ద్వారా ఐ ఫోన్‌పై ఆకర్షణీయ మైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 7 ను ఆకర్షణీయమైన డౌన్ చెల్లింపుల్లో అందిస్తోంది. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్లను త్వరలోనే జోడించాలని సంస్థ యోచిస్తోంది. జియోనుంచి గట్టిపోటీని ఎదుర్కొంటూ, దూకుడు ధరలను ఆఫర్ చేస్తున్న సంస్థ ఆన్లైన్ స్టోర్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై సరసమైన డౌన్ పేమెంట్స్, తక్షణ క్రెడిట్ వెరిఫికేషన్, ఫైనాన్సింగ్, నెలసరి ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో సోమవారం ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఆపిల్ ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లను జోడించింది. కేవలం రూ. 7,777 ల డౌన్ పేమెంట్‌తో 32 జీబీ ఐఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. మిగిలిన సొమ్మును 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,499 ( పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో కలిపి) చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తోంది. అంతేకాదు దీంతోపాటు, నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా, అపరిమిత కాలింగ్ (స్థానిక, ఎస్టీడీ, జాతీయ రోమింగ్) తోపాటు సైబర్ ప్రొటెక్షనతో పాటు ఫోన్ డ్యామేజ్ కవర్ చేసే ఎయిర్టెల్ సెక్యూర్ ప్యాకేజీ అందించే ప్రత్యేకమైన పోస్ట్ పెయిడ్ పధకాన్ని కూడా అందిస్తోంది. ఐఫోన్7 128 జీబీ వేరియెంట్‌కు రూ.16,300 డౌన్‌పేమెంట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ వేరియంట్‌కు రూ.17,300, 128 జీబీ వేరియంట్‌కు రూ.26వేల డౌన్‌పేమెంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం www.airtel.in/onlinestore కు లాగిన్ అయ్యి మొబైల్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మన ఎలిజిబిలిటీ, రుణ సదుపాయం తదితర అంశాలను పరిశీలించుకోవాలి. చివరగా మనం ఎంపిక చేసుకున్న మొబైల్‌కు సంబంధించిన డౌన్ పేమెంట్ చెల్లించాలి. లావాదేవీ సక్రమంగా పూర్తయితే సంబంధిత చిరునామాకు మొబైల్ చేరుతుంది. లక్షలాది మంది వినియోగదారులని ఆహ్లాదపరిచేందుకు ఎయిర్టెల్ మరో ఉత్తేజకరమైన డిజిటల్ ఆవిష్కరణను తీసుకొచ్చినట్టు హర్మీన్ మెహతా భారతి ఎయిర్టెల్ గ్లోబల్ డైరెక్టర్ తెలిపారు. కస్టమర్లు ఎల్లప్పుడూ కోరుకునే పరికరాలకు అప్‌గ్రేడ్ చేయడమే కాదు, డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధునాతనమైన, సరళమైన ప్రక్రియతో వారి కలను సాకారం చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తమ భాగస్వాములకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ సేవలు భారతదేశంలోని 21 నగరాల్లో ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఇంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, క్లిక్స్ కాపిటల్, సెయిన్స్ టెక్నాలజీస్, బ్రైట్ స్టార్ టెలికమ్యూనికేషన్స్ , వుల్కాన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలతో భాగస్వామ్యంను కలిగి ఉంది. -
ఐ ఫోన్ 7పై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఇ-కామర్స్ సైట్ అమెజాన్ దీపావళి అమ్మకాలకు మరోసారి తెర తీసింది. దీపావళి సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలను తిరిగి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై రూ. 11వేల కోతపెట్టి అమేజింగ్ ఆఫర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అక్టోబరు 14 శనివారం నుంచి ప్రారంభమైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 17 న ముగియనుంది. సుమారు రూ. 60వేల విలువచేసే ఐఫోన్ 7 32జీబీ డివైస్‌ను రూ. 37,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ద్వారా కూడా ఉంది. రూ.1,807 నుంచి మొదలవుతుంది. అంతేకాదు రూ. 9,500 వరకు ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాంక్, అమెజాన్ పే ద్వారా అయితే రూ. 500 క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు ఎంపిక చేసుకున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెప్టెంబరులో బంగారం, నలుపు రంగుల ఆప్లన్లలో ఐ ఫోన్ 7ను రూ .38,999కే విక్రయించింది. మరోవైపు జీఎస్టీ అనంతరం ఐఫోన్ 7 ధర రూ.60 వేల నుంచి రూ .56,200 కి తగ్గింది. అయితే అమెజాన్ ద్వారా ఇండియాలో దీని ధర రూ.49,990 గా ఉంది. -
శాంసంగ్ పెయిన్.. ఆపిల్ గెయిన్
స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ మధ్య జరుగుతున్న పోరులో అమ్మకాల పరంగా శాంసంగ్ రారాజులా వెలిగిన మాట వాస్తవం. కానీ తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 వైఫల్యం శాంసంగ్ ప్రతిష్టను దిగజార్చడంతోపాటూ ఆదాయానికి తీవ్ర గండి పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లను దాదాపు 25 లక్షలకుపైగా రీకాల్ చేయనున్నట్టు ప్రకటించడం సంస్థకు తీరని నష్టాన్నిమిగిల్చింది. చివరకు రీప్లేస్ చేసిన ఫోన్లనుంచి పొగలు రావడంతో మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంసంగ్ ఆదాయం 17 బిలియన్ డాలర్లు (1,13, 517,41,50,000 లక్షా పదమూడు వేల అయిదువందల కోట్లు) దాదాపు రూ. 1.14 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. మరోవైపు బ్యాటరీ పేలుడు ప్రమాదాలతో శాంసంగ్ కేసులను కూడా ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు ఆపిల్ కు అనుకూలంగా ఫెడరల్ కోర్టు తీర్పుతో శాంసంగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇరు సంస్థల మధ్య దీర్ఘకాలంగా సాగుతున్న పేటెంట్ హక్కుల వివాదం లో ఆపిల్ వాదనలను కోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్ 7 ఉత్పత్తిని శాశ్వంగా నిలిపి వేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించడంతో మార్కెట్లో ఈ షేర్ ధర భారీగా పడిపోయింది. శాంసంగ్ పరిస్థితి ఇలా ఉంటే ఆపిల్ క్రమంగా పుంచుకుంటోంది. శాంసంగ్ ఫస్ట్ రీకాల్ తర్వాత శాంసంగ్ 8 శాతం క్షీణించగా, ఆపిల్ షేర్లు దాదాపు 10 శాతం లాభపడ్డాయి. అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఐ ఫోన్ 7 స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయనీ ఆపిల్ స్వయంగా ప్రకటించింది. ఎన్ని ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసిందీ వెల్లడించడానికి నిరాకరించిన ఆపిల్ అన్ని యూనిట్లను విక్రయించినట్టు పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 వైఫల్యంతో కేవలం 10 బిలియన్ డాలర్లు మేరకు శాంసంగ్ నష్టపోయే అవకాశం ఉందనీ, గత నెల షేర్ పతనం అంత భారీదికాదని మరికొంతమంది ఎనలిస్టుల అంచనా. సంస్థ తన తరువాతి స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8 హిట్అయితే ఈ నష్టాలనుంచి కోలుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్వార్టర్ లో ఆపిల్ కు 45 మిలియన్ల ఐ ఫోన్లు అమ్మడు పోయాయనీ, గత ఏడాది 48 మిలియన్లతో పోలిస్తే ఇది క్షీణత అని ఎనలిస్టులంటున్నారు. శాంసంగ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 15.6 లక్షల కోట్లు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ విక్రయాలు కొంతమేర పడిపోయాయి. దీనికి తోడు గతం వారం భారీ నష్టాలతో... కంపెనీ విలువ కూడా తగ్గపోయే అవకాశం ఉందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఆపిల్ కొత్త మోడల్ ఐ ఫోన్ 7 ఇపుడు హైదరాబాద్ ముంగిట్లో కొలువు దీరనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ పండగ సీజన్ లో హైదరాబాదీలను ఆకట్టుకునేందుకు అక్టోబర్ 7 నగర మార్కెట్లోకి ప్రత్యేకంగా లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సాయంత్రం 7 గంటలకు అప్ట్రానిక్స్, అపెక్స్ స్టోర్లలో ఎక్స్ క్లూజివ్ గా లిమిటెడ్ స్టాక్ ను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. సమీపంలోఈ స్టోర్లలో సంప్రదించి తమ తాజా డివైస్ ఐ ఫోన్ 7 ను సొంతం చేసుకోవాలని కోరింది. అలాగే అప్ ట్రానిక్స్ తన ఫేస్ బుక్ పేజ్ లో ఐ ఫోన్ లాంచింగ్ విషయాన్ని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం http://aptronixindia.com/store/service-centers సందర్శించాలని కోరింది. కాగా ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్ ఐ ఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్లు, నేడు భారత వినియోగదారుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.