అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
తిమ్మాపూర్ : అప్పుల బాధతో కంప్యూటర్ల షాపు య జమాని అనుమాండ్ల తిరుపతిరెడ్డి క్రిమి సం హారక మందు తాగి మండల కేంద్రం శివారు లో కాకతీయ కాలువ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌కు చెందిన తిరుపతిరెడ్డికి వీణవంక మండలం మల్లారెడ్డిపల్లెకు చెందిన శైలజసంగీతతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తన్విత(6) కూతురు ఉంది.
తిరుపతిరెడ్డి కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నెట్ ఇండియా కంప్యూటర్ల షాపు ఉంది. భగత్‌నగర్‌లో నివాసముంటూ వ్యాపారపరంగా అప్పు చేసి స్వగ్రామంలో భూములు కొన్నా డు. అప్పులు పెరిగిపోవడంతో డబ్బులిచ్చిన వారు పలుమార్లు పంచాయితీ పెట్టారు. దీం తో హుస్నాబాద్‌లోని ఎకరా భూమిని, సీతారాంపూర్‌లో ఉన్న భూమిని అప్పు ఇచ్చిన కొం దరు జీపీఏ చేయించుకున్నారు. మరికొందరు వేధిస్తున్నారు. ఉన్న భూమిని విక్రయిద్దామంటే తండ్రి అంగీకరించలేదు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు గురువారం కరీంనగర్‌లోని ఓ ఇంట్లో పంచాయితీ పెట్టారు. అక్కడ స్వగ్రామానికి చెందిన ముస్కు వేణుగోపాల్‌రెడ్డి, పచ్చునూర్‌కు చెందిన కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి భూమి జీపీఏ చేయాలని, లేదంటే అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన తిరుపతిరెడ్డిని మల్లారెడ్డిపల్లెకు తీసుకెళ్దామని అత్తింటివారు కరీంనగర్ చేరుకున్నారు.
కూతురు చాక్లెట్ కావాలని అనడంతో బయటకు వెళ్లిన తిరుపతిరెడ్డి తిరిగి రాలేదు. శుక్రవారం కాకతీయ కాలువ వద్ద పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సైలు దామోదర్‌రెడ్డి, అంజయ్య పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు.
12 మందిపై కేసు
మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు అత్త రాజమ్మ, మామ శ్రీనివాసరెడ్డి, మరిది సతీష్‌రెడ్డి, తోడి కోడలు పద్మ, ఆడబిడ్డ సుజాత, ఆడబిడ్డ భర్త తిరుపతిరెడ్డి, ముస్కుల వేణుగోపాల్‌రెడ్డి, ముస్కుల మాధవరెడ్డి, కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి, కాసం రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎల్‌ఎండీ ఎస్సై దామోదర్‌రెడ్డి తెలిపారు.