Two town police station
-
నల్లగొండలో జైభీమ్ తరహా ఘటన.. వీడియో వైరల్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జై భీమ్ సినిమా తరహా సన్నివేశం చోటు చేసుకుంది. కేసు నిమిత్తం ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిచి.. అతడిని చితకబాదారు ఎస్సై, కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు) నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భూ వివాదానికి సంబంధించన కేసులో ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించాడు ఎస్సై నర్సింహులు. అనంతరం అతడిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం కాస్త పెద్దది కావడంతో ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు.. -
టీటీడీపై నిరాధార ఆరోపణలు చేసిన ఇద్దరిపై కేసులు
తిరుమల: టీటీడీపై నిరాధార ఆరోపణలు ప్రతిష్టను దెబ్బతీశారంటూ టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తిరుమల టూ టౌన్ ఏఎస్ఐ ఎం.వెంకటముని తెలిపిన వివరాలు.. తిరుపతిలో నివాసముంటున్న పి.నవీన్‌కుమార్‌రెడ్డి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీపై ఓ నిరాధారమైన నకిలీ వార్తను సోషల్ మీడియాలో, తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తద్వారా టీటీడీ ప్రతిష్టను, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. దీనిపై టీటీడీ విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో ఎస్.పద్మనాభన్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. సదరు ఫిర్యాదుపై న్యాయస్థానం అనుమతి తీసుకుని నవీన్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసినందుకు.. టీటీడీ ఇటీవల లడ్డూ కౌంటర్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కేటాయించడంపై జెమినీ న్యూస్ ఆన్లైన్.కామ్ ఎడిటర్.. టీటీడీ అధికారులు ముడుపులు తీసుకున్నట్టు నిరాధార ఆరోపణలు చేశారని టీటీడీ విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు ప్రతిష్ట దిగజార్చడంతో పాటు, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై న్యాయస్థానం అనుమతితో ఆ ఎడిటర్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల టూటౌన్ ఎస్ఐ సాయినాథ్‌చౌదరి చెప్పారు. -
వీఆర్‌కు టూటౌన్ ఎస్ఐలు?
అనంతపురం సెంట్రల్ : అనంతపురం టూటౌన్ ఎస్ఐలు జనార్ధన్, క్రాంతికుమార్‌లను వీఆర్‌కు పంపుతూ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 13న సాయినగర్ స్టేట్‌బ్యాంకు ఎదుట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డి ఘటనలో ఇప్పటికే త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్‌ను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టూటౌన్ ఎస్ఐలు కూడా ఉండడంతో వారిపైనా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 24న మానవహక్కుల కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. -
ఇప్పుడైనా మోక్షం కలిగేనా?
కలగానే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిఏటా పెరుగుతున్న నేరాల సంఖ్య శాంతిభద్రతల పరిరక్షణకు సరిపోని సిబ్బంది అమలుకు నోచని నేతల హామీలు సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించింది. సూర్యాపేట జిల్లా హైదరాబాద్, విజయవాడ మహానగరాలకు మధ్యలో ఉండి అన్నిరంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సూర్యాపేట పట్టణంలో 1952లో పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి పట్టణంలో శాంతిభద్రతల కోసం పోలీసులు పాటుపడుతున్నారు. 40 సంవత్సరాల క్రితం సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నియమించిన సిబ్బంది సంఖ్యే ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. 30 ఏళ్ల క్రితం పట్టణ జనాభా సుమారు 50 వేలు ఉండేది. ప్రస్తుతం లక్షా 70 వేలకు చేరింది. దీనికితోడు గతంకంటే ప్రస్తుతం బైక్‌లు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాల సంఖ్య, పట్టణ విస్తీర్ణం కూడా పెరిగింది. అంతేగాక సూర్యాపేట హైదరాబాద్, విజయవాడ నగరాలకు మధ్య, ఇటు జనగామ, వరంగల్, మిర్యాలగూడ ప్రాంతాలకు మధ్య కేంద్రంగా ఉండడంతో నిత్యం ఇక్కడకు వివిధ పనుల నిమిత్తం వేలసంఖ్యలో జనం వచ్చివెళ్తుంటారు. సరిపడా లేని సిబ్బంది.. పేటలో ఏర్పాటుచేసిన పోలీస్‌స్టేషన్‌కు 40 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన సిబ్బంది సంఖ్యే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు ఏఎస్ఐలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 45 మంది కానిస్టేబుళ్లతోపాటు 36 మంది హోంగార్డులను పట్టణపోలీస్స్టేషన్కు కేటాయించారు. కాగా వీరిలో సుమారు 30 మంది వివిధ లూప్‌లైన్ డ్యూటీల్లో విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం బందోబస్తులతో ఉన్న సిబ్బంది వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఉన్న సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు సరిపోవడం లేదు. పోలీస్ మ్యాన్వల్ ప్రకారం.. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పోలీస్‌ను నియమించాల్సి ఉంది. ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. కాగా జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట పట్టణాలు గ్రేడ్-1 మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నల్లగొండలో రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయ గా గ్రేడ్-2 మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో రెండు పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఆ విధంగా చూసుకుంటే సూర్యాపేటలో మిర్యాలగూడ కంటే ముందుగానే టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత హోంమంత్రి జానారెడ్డి ‘పేట’లో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. నేరాల సంఖ్య పెరుగుతున్నా.. పట్టణంలో ఆస్తి తగాదాలు, ఈవ్‌టీజింగ్, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, భార్యాభర్తల ఘర్షణలు, మిస్సింగ్ కేసులు ఇతర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాదిలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వంద నుంచి 200 కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం 560 కేసులు తగ్గకుండా నమోదవుతున్నాయి. వాటిని అదుపుచేసేందుకు ఒక్కటే పోలీస్‌స్టేషన్ ఉండడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. పేటలో రెండు పోలీస్స్టేషన్లు ఉంటే నేరాలను అదుపుచేయడం పోలీసులకు సులువుగా ఉంటుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు పేటలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం సూర్యాపేట జిల్లా కేంద్రం అవుతున్న తరుణంలో టూటౌన్ స్టేషన్‌తోపాటు మహిళా, సీసీఎస్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. నివేదికలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రం కాబట్టి ఈ స్టేషన్లు తప్పనిసరిగా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ట్రాఫిక్ స్టేషన్‌కు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవసరం ఉండటంతో అట్టి ప్రతిపాదనలను కూడా పంపించాం. - వి.సునితామోహన్, డీఎస్పీ, సూర్యాపేట -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
– భర్తే హత్య చేశాడని బంధువుల ఆరోపణ కడప అర్బన్ : కడప నగరం, టుటౌన్ పోలీసుస్టేషన్ పరిధి బళ్లారిరోడ్డులోని కేసీ కెనాల్ సమీపంలో షేక్ హబీబా (27) అనే మహిళ తమ ఇంటిలో అనుమానాస్పద స్థితిలో గురువారం రాత్రి మృతి చెందింది. అర్బన్ సీఐ సదాశివయ్య తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబీబాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. హబీబాకు బిలాల్‌తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా భార్యాభర్తలమధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వెళ్లేసరికి ఆమె మృతదేహం పడకపై ఉంది. పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతురాలి భర్త బిలాల్ మాత్రం తన భార్య కిటికీకి నైలాన్ తాడుతో ఉరి వేసుకుందని, అది గమనించి తాను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందిందని తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సదాశివయ్య, ఎస్ఐ అరుణ్‌రెడ్డిలు తెలిపారు. -
'ఫ్యాక్షన్ వదిలితేనే అభివృద్ధి'
కర్నూలు: జిల్లా అభివృద్ది చెందాలంటే ఫ్యాక్షన్ వదిలి శాంతియుతంగా ఉండాలని ఏపీ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప కర్నూలు జిల్లా వాసులకు సూచించారు. ఆదివారం కర్నూలులో టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆర్థిక మంత్రి యనమలతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గిపోయిందని చినరాజప్ప వెల్లడించారు. -
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
తిమ్మాపూర్ : అప్పుల బాధతో కంప్యూటర్ల షాపు య జమాని అనుమాండ్ల తిరుపతిరెడ్డి క్రిమి సం హారక మందు తాగి మండల కేంద్రం శివారు లో కాకతీయ కాలువ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌కు చెందిన తిరుపతిరెడ్డికి వీణవంక మండలం మల్లారెడ్డిపల్లెకు చెందిన శైలజసంగీతతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తన్విత(6) కూతురు ఉంది. తిరుపతిరెడ్డి కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నెట్ ఇండియా కంప్యూటర్ల షాపు ఉంది. భగత్‌నగర్‌లో నివాసముంటూ వ్యాపారపరంగా అప్పు చేసి స్వగ్రామంలో భూములు కొన్నా డు. అప్పులు పెరిగిపోవడంతో డబ్బులిచ్చిన వారు పలుమార్లు పంచాయితీ పెట్టారు. దీం తో హుస్నాబాద్‌లోని ఎకరా భూమిని, సీతారాంపూర్‌లో ఉన్న భూమిని అప్పు ఇచ్చిన కొం దరు జీపీఏ చేయించుకున్నారు. మరికొందరు వేధిస్తున్నారు. ఉన్న భూమిని విక్రయిద్దామంటే తండ్రి అంగీకరించలేదు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు గురువారం కరీంనగర్‌లోని ఓ ఇంట్లో పంచాయితీ పెట్టారు. అక్కడ స్వగ్రామానికి చెందిన ముస్కు వేణుగోపాల్‌రెడ్డి, పచ్చునూర్‌కు చెందిన కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి భూమి జీపీఏ చేయాలని, లేదంటే అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన తిరుపతిరెడ్డిని మల్లారెడ్డిపల్లెకు తీసుకెళ్దామని అత్తింటివారు కరీంనగర్ చేరుకున్నారు. కూతురు చాక్లెట్ కావాలని అనడంతో బయటకు వెళ్లిన తిరుపతిరెడ్డి తిరిగి రాలేదు. శుక్రవారం కాకతీయ కాలువ వద్ద పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సైలు దామోదర్‌రెడ్డి, అంజయ్య పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. 12 మందిపై కేసు మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు అత్త రాజమ్మ, మామ శ్రీనివాసరెడ్డి, మరిది సతీష్‌రెడ్డి, తోడి కోడలు పద్మ, ఆడబిడ్డ సుజాత, ఆడబిడ్డ భర్త తిరుపతిరెడ్డి, ముస్కుల వేణుగోపాల్‌రెడ్డి, ముస్కుల మాధవరెడ్డి, కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి, కాసం రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ ఎస్సై దామోదర్‌రెడ్డి తెలిపారు. -
పిచ్చిదాన్నంటున్నారు..
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: పిచ్చిదని ముద్ర వేసి భార్యను వదిలించుకోవడానికి ఓ భర్త ప్రయత్నించగా, చావైనా, బతుకైనా అతనితోనే అంటూ ఆ మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గానికి చెందిన గాయత్రికి, అనంతపురంలోని ఓబుళదేవనగర్‌కు చెందిన రమేష్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పట్లో ఆమె తల్లిదండ్రులు రూ.50 వేల వరకట్నం, 15 తులాల బంగారం ఇచ్చారు. ఓ కొరియర్ సంస్థలో సర్వీస్ బాయ్‌గా పని చేస్తున్న రమేష్ రెండేళ్లపాటు భార్యను బాగానే చూసుకున్న అతనిలో క్రమేణా మార్పు వచ్చింది. తరచూ ఆమెను మాటలతో వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో భర్త కర్రతో దాడి చేయడంతో తలకు గాయమై మానసిక అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు చికిత్స చేయించారు. అమె ప్రసవించిన అనంతరం కూడా అల్లుని వద్దకు పంపకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో ఆదివారం భర్త ఇంటి వద్దకు వచ్చింది. అప్పటికే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అతను భార్య వచ్చిన విషయం గుర్తించి, ఆమెను లోనికి రానివ్వకుండా తలుపులకు తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆమె ఇంటి ముందే బైఠాయించింది. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లడిల్లిన కన్నపేగు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘నా బాబును ఎవ రో ఎత్తుకెళ్లారు. పాలు తా గే ఎనిమిది నెలల బిడ్డ డు... ఎలా ఉన్నాడో ఏ మో, పేగులు తల్లడిల్లుతున్నాయి. నా బాబు ఆ చూ కీ చెప్పి పుణ్యం కట్టుకోం డి’ అని కలెక్టరేట్‌కు వచ్చి న ప్రతి ఒక్కరికి తన బా బు ఫొటోను చూపిస్తూ ఆచూకీ తెలిస్తే చెప్పండి అని బోరున విలపిస్తోం ది నాలుగు రోజుల క్రితం అపహరణకు గురైన పసివాడి తల్లి శారద. వివరాల్లోకి వెళితే... కోస్గికి చెందిన శారద తన తల్లిగారి ఊరు పాలకొండ తండాకు వచ్చేందుకు సోమవారం రాత్రి పది గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొంది. ఆ సమయంలో తండాకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో ఆ రాత్రి తన ఇద్దరు పిల్లలతో బస్టాండ్‌లోనే ఉండిపోయింది. అర్ధరాత్రి వరకు మెళకువగా ఉన్న ఆ మె ఆ తర్వాత నిద్రలోకి జారుకుంది. తెల్లవారు జాము న 4 గంటల సమయంలో మెలుకువ రాగా, పక్కన పె ద్దకుమారుడు ఒక్కడే ఉన్నాడు. దీంతో రెండో బాబును ఎవరో ఎత్తుకెళ్లారని గుర్తించిన ఆమె ఏడుస్తూ బస్టాండ్ ఆవరణమంతా వెదికింది. అయినా బాబు ఆచూకీ కనబడకపోవడంతో టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేసింది. పోలీసులు అనుమానంతో తల్లినే విచారణ చేయడంతో ఆమె మరింత ఆవేదనకు గురైంది. పో లీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని తానే స్వయం గా బాబు ఫొటోను తీసుకుని జిల్లాకేంద్రంలో కనిపిం చిన వారందరికీ చూపించి ఆచూకీ చెప్పి పుణ్యం కట్టుకోండి సారూ అంటూ బోరున విలపిస్తోంది. శుక్రవా రం తన ఆవేదనను కలెక్టర్‌కు చెప్పేందుకు వచ్చినా ఆ యన లేకపోవడంతో కలెక్టరేట్లో ఉన్న క్యాంటీన్ దగ్గర పడిగాపులు కాస్తూ వచ్చిన వారికి ఫొటోను చూపి వేడుకుంది. ఈ తల్లి ఆవేదనను చూసిన వారందరూ చలించి పోయారు. కొంతమంది ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. దర్యాప్తు చేస్తున్నాం... అపహరణకు గురైన బాబుకు సంబంధించి కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ సీఐ అప్పలనాయుడు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. బాబు ఫొటోని రైల్వేస్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాలతో పాటు, జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లకు పంపించినట్లు చెప్పారు. ఇది వ రకే అనుమానిత ప్రాంతాల్లో తమ బృందాలతో ము మ్మర తనిఖీలు చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు.