తల్లడిల్లిన కన్నపేగు | mother shardha forceing to hand over her son | Sakshi
Sakshi News home page

తల్లడిల్లిన కన్నపేగు

Published Sat, Aug 24 2013 4:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

mother shardha forceing to hand over her son

కలెక్టరేట్, న్యూస్‌లైన్:  ‘నా బాబును ఎవ రో ఎత్తుకెళ్లారు. పాలు తా గే ఎనిమిది నెలల బిడ్డ డు... ఎలా ఉన్నాడో ఏ మో, పేగులు తల్లడిల్లుతున్నాయి. నా బాబు ఆ చూ కీ చెప్పి పుణ్యం కట్టుకోం డి’ అని కలెక్టరేట్‌కు వచ్చి న ప్రతి ఒక్కరికి తన బా బు ఫొటోను చూపిస్తూ ఆచూకీ తెలిస్తే చెప్పండి అని బోరున విలపిస్తోం ది నాలుగు రోజుల క్రితం అపహరణకు గురైన పసివాడి తల్లి శారద.
 
  వివరాల్లోకి వెళితే... కోస్గికి చెందిన శారద తన తల్లిగారి ఊరు పాలకొండ తండాకు వచ్చేందుకు సోమవారం రాత్రి పది గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొంది. ఆ సమయంలో తండాకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో ఆ రాత్రి తన ఇద్దరు పిల్లలతో బస్టాండ్‌లోనే ఉండిపోయింది. అర్ధరాత్రి వరకు మెళకువగా ఉన్న ఆ మె ఆ తర్వాత నిద్రలోకి జారుకుంది. తెల్లవారు జాము న 4 గంటల సమయంలో మెలుకువ రాగా, పక్కన పె ద్దకుమారుడు ఒక్కడే ఉన్నాడు. దీంతో రెండో బాబును ఎవరో ఎత్తుకెళ్లారని గుర్తించిన ఆమె  ఏడుస్తూ బస్టాండ్ ఆవరణమంతా వెదికింది. అయినా బాబు ఆచూకీ కనబడకపోవడంతో టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేసింది. పోలీసులు అనుమానంతో తల్లినే విచారణ చేయడంతో ఆమె మరింత ఆవేదనకు గురైంది.
 
 పో లీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని తానే స్వయం గా బాబు ఫొటోను తీసుకుని జిల్లాకేంద్రంలో కనిపిం చిన వారందరికీ చూపించి ఆచూకీ చెప్పి పుణ్యం కట్టుకోండి సారూ అంటూ బోరున విలపిస్తోంది. శుక్రవా రం తన ఆవేదనను కలెక్టర్‌కు చెప్పేందుకు వచ్చినా ఆ యన లేకపోవడంతో కలెక్టరేట్‌లో ఉన్న క్యాంటీన్ దగ్గర పడిగాపులు కాస్తూ వచ్చిన వారికి ఫొటోను చూపి వేడుకుంది. ఈ తల్లి ఆవేదనను చూసిన వారందరూ చలించి పోయారు. కొంతమంది ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
 
 దర్యాప్తు చేస్తున్నాం...
 అపహరణకు గురైన బాబుకు సంబంధించి కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ సీఐ అప్పలనాయుడు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. బాబు ఫొటోని రైల్వేస్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాలతో పాటు, జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లకు పంపించినట్లు చెప్పారు. ఇది వ రకే అనుమానిత ప్రాంతాల్లో తమ బృందాలతో ము మ్మర తనిఖీలు చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement