కంప్యూటర్ దొంగల అరెస్టు | computer theives are arrested | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ దొంగల అరెస్టు

Published Sat, Dec 21 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

వివిధ నేరాలకు పాల్పడిన ము గ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.8.83 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ పి.శివశంకరరెడ్డి తెలిపారు.

     ఊరి చివర స్కూళ్లే లక్ష్యం
     రూ.8.83 లక్షల విలువైన         
     సొత్తు స్వాధీనం
 కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ :
 వివిధ నేరాలకు పాల్పడిన ము గ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.8.83 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ పి.శివశంకరరెడ్డి తెలిపారు. సర్పవరం జంక్షన్‌లోని పోలీసు గెస్ట్‌హౌస్ లో శుక్రవారం విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జి ల్లా నల్లజర్లకు చెందిన సరెళ్ల శ్రీనివాసరావు, సరెళ్ల రాజు, పెద్దాపురం మం డలం కాండ్రకోటకు చెందిన గ్రంధి గంగాధర్ ఒకే బైక్‌పై వెళ్తుండగా, కిర్లం పూడి మండలం రామచంద్రపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. కిర్లంపూడి పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ అయిన కొత్త బైక్ విషయమై విచా రణ చేయగా, అనేక దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. నింది తులు మొత్తం 32 నేరాలకు పాల్పడగా, జిల్లాలో 28 నేరాలు, పశ్చిమ గోదావరి లో 4 నేరాలు చేశారు. ఊరి శివారులో ఉండే ప్రభుత్వ పాఠశాలలను లక్ష్యం చేసుకుని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, వివిధ దేవాలయాల్లో బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు.
 
 కోటనందూరు, ఆలమూరు, ప్రత్తిపాడు, రంగంపేట, సర్పవరం, పిఠాపురం, గొల్లప్రోలు, తొండంగి, కోరం గి, గొల్లపాలెం, బిక్కవోలు, ఇంద్రపాలెం, కాట్రేనికోన, ఏలేశ్వరం, రావులపాలెం, అంబాజీపేట, సామర్లకోట, రాజానగరం, జగ్గంపేటల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదప్పాడు, ఇరగవరం పాఠశాలల్లోను కంప్యూటర్లు దొంగిలించారు. అత్తిలిలోని రెండు దేవాలయాల్లో చోరీ లకు పాల్పడ్డారు. మొత్తం 48 సీపీయూలు, 87 మెనిటర్లు, 58 మౌస్‌లు, 51 కీబోర్డులు, బైకు, ల్యాప్‌టాప్, వెండి కిరీటం, కవచం, కత్తి, వెండి పిడికిలి, అమ్మవారి ముక్కుపుడక, బొట్టు ను వీరు కాజేశారు. వీటిని ఆక్షన్లలో పాడుకున్న వస్తువులుగా నమ్మించి ఇం టర్నెట్ సెంటర్లలో, కంప్యూటర్ షా పుల్లో, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారు. సమావేశంలో డీఎస్పీ వి.అరవింద్‌బాబు, జగ్గంపేట సీఐ మురళీమోహన్, కిర్లంపూడి, పెద్దాపురం క్రైం ఎస్సైలు పాల్గొన్నారు. నిందితులను ప్రత్తిపాడు కోర్టుకు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement