కంప్యూటర్‌తో పరీక్షలు | CBSE will be allowed to use computers in board exams | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌తో పరీక్షలు

Published Thu, Mar 1 2018 2:15 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

CBSE will be allowed to use computers in board exams - Sakshi

న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్నవారు) కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుకోవడానికి సీబీఎస్‌ఈ అనుమతించింది. ఈ ఏడాది నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి రానున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది.పరీక్షా కేంద్రంలో సదరు విద్యార్థి కంప్యూటర్‌ వినియోగించుకోవచ్చని సిఫార్సు చేస్తూ అర్హుడైన వైద్యుడు సర్టిఫికేట్‌ జారీచేయాల్సి ఉంటుంది. అలా సిఫార్సు చేయడానికి తగిన కారణాలను అందులో పేర్కొనాలి. విద్యార్థి ఈ సర్టిఫికేట్‌ను పరీక్షా సమయంలో సమర్పించాలి.

సమాధానాలు టైప్‌ చేయడానికి, ప్రశ్నలను వినడానికి, వాటిని పెద్ద అక్షరాల్లో చూడటానికి మాత్రమే కంప్యూటర్‌ వినియోగాన్ని పరిమితం చేయాలని సీబీఎస్‌ఈ పేర్కొంది. విద్యార్థి ఫార్మాట్‌ చేసిన కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ను తానే సొంతం గా వెంట తెచ్చుకోవాలని వెల్లడించింది. కంప్యూటర్‌ టీచర్‌ ఆ కంప్యూటర్‌ను పరీక్షించిన తరువాతే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌ దాన్ని అనుమతించాలని తెలిపింది. ఆ కంప్యూటర్‌కు ఇంటర్నెట్‌ ఉండొద్దని షరతు విధించింది. పరీక్ష రాసే సహాయకుడి బదులు ప్రశ్నా పత్రం చదివి వినిపించే రీడర్‌ కావాలన్నా తీసుకునే ప్రతిపాదనకూ సీబీఎస్‌ఈ అంగీకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement