నాటక రంగానికి ప్రోత్సాహం కరువు | drought of encouraged by the dramatic sector | Sakshi
Sakshi News home page

నాటక రంగానికి ప్రోత్సాహం కరువు

Published Sat, May 3 2014 12:22 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

drought of  encouraged by the dramatic sector

 భెల్, న్యూస్‌లైన్:  సినిమాలు, కంప్యూటర్‌లు, టీవీల ప్రభావంతో ప్రస్తుతం నాటక రంగానికి ప్రోత్సాహం కరువైందని భెల్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ఆర్.ల క్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. కమ్యూనిటీ సెంటర్ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో 40వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు-2014 శుక్రవారం రాత్రి భెల్‌లోని కమ్యూనిటీ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను లక్ష్మీనారాయణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కమ్యూనిటీ సెంటర్ అధ్యక్షుడు, మరో జీఎం వీసీ కృష్ణన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోజురోజుకూ నాటకరంగం అంతరించిపోతుందని పేర్కొన్నారు.

 దీనిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమ్యూనిటీ సెంటర్ అధ్యక్షుడు కృష్ణన్ మాట్లాడుతూ కళాభిమానుల్లో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచేందుకు ఈరాష్ట్రస్థాయి నాటికల పోటీలు దోహదపడతాయని తెలిపారు. ఏజిఎం. ధనుంజయరావు ప్రసంగిస్తూ నాటక రంగం పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సెంటర్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.సునీల్, సాంసృ ్కతిక విభాగం కార్యదర్శి డి. నరేందర్‌రెడ్డి, సాహిత్య కార్యదర్శి ఎం.సతీష్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. తొలుత భెల్‌టౌన్‌షిప్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కమ్యూనిటీ సెంటర్ వరకు క ళాజ్యోతి ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా నటరాజస్వామి విగ్రహాన్ని ప్రదర్శనగా తీసుకువచ్చారు.

 ఆకట్టుకున్న అగ్నిపుష్పం నాటిక
 రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో శుక్రవారం రాత్రి తొలుత ప్రదర్శించిన అగ్నిపుష్పం నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుంటూరు సద్గురు కళానిలయం ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దేశంలో బాలికల బాల్యం ప్రమాదంలో పడింది. అత్యాచారాలకు గురవుతున్న బాలికలు, యువతులు పతితతు కాదు....పావనులు...అగ్నిపుష్పాలు అనే ఇతివృత్తంతో ఈనాటిక సాగింది. దీనికి కావూరి సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement