పిల్లల్లో అధిక బరువు... సమస్యలు
ఇటీవల పిల్లలకు శారీరక శ్రమ తగ్గడం, వాళ్లు టీవీ, కంప్యూటర్లకు ఎక్కువగా అతుక్కుపోవడం వంటి మార్పుల వల్ల అధిక బరువు అనే సమస్య పెరుగుతోంది. పైగా ఇటీవలి జీవనశైలిలో మార్పులతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.
బరువు పెరగడం వల్ల వచ్చే భవిష్యత్తు సమస్యలు : అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్న పిల్లలు భవిష్యత్తులోనూ చాలా సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని...
అధిక రక్తపోటు
అధిక కొలెస్ట్రాల్
భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్
కీళ్లనొప్పులు
కొద్దిపాటి శారీరక శ్రమతోనే
సమస్యలు కలగడం, సమస్యలు పెరగడం
ఊపిరి తీసుకోవడంలో సమస్యలు
ఆస్తమా వమంటి ఇబ్బందులు
నిద్రలేమి
భవిష్యత్తులో సెక్స్ సమస్యలు
కాలేయం, పిత్తాశయానికి సంబంధించిన సమస్యలు
డిప్రెషన్
హృదయసంబంధ వ్యాధులు
అమ్మాయిల విషయంలో రుతుస్రావ సమయంలో ఇబ్బందులు వంటివి చాలా సాధారణం.
పిల్లల్లో అధిక బరువు సమస్యను అధిగమించడం ఎలా : ముందుగా వారికి తగినంత శారీరక శ్రమ కలిగిలా తల్లిదండ్రులు చూడాలి. ఈ శ్రమను పిల్లలు వినోదంగా తీసుకునే చేయాలి. ఉదాహరణకు తల్లిదండ్రులు షాపింగ్‌కు వెళ్లే సమయంలో పిల్లలను ఇంట్లో వదలకుండా తమతో తీసుకుని వెళ్లాలి. ఎక్కువగా నడిచేలా చేయాలి.
పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు నేర్పాలి. పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. వాళ్లు తీసుకునే వాటిల్లో తీపిపదార్థాలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. చిరుతిళ్లకు దూరంగా ఉంచాలి.
పిల్లలకు క్రమబద్ధమైన వ్యాయామాన్ని అలవాటు చేయాలి. ఆరుబయట ఆడుకునేలా వారిని ప్రోత్సహించాలి.
స్థూలకాయం, అధికబరువు సమస్యకు కొన్ని మందులు :
కాల్కేరియా కార్బ్, గ్రాఫైటిస్, యాంటిమోనియమ్ క్రూడ్, ఫైటోలెక్కా బెర్రీ, ఫ్యూకస్ వంటి హోమియో మందులు పిల్లల్లో అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని పిల్లల స్వరూప స్వభావాలను బట్టి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్