కేవలం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే వైరస్ సోకుతుందని భావిస్తున్నారా?. అయితే మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. స్మార్ట్ టీవీలకు కూడా వైరస్ సోకుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటర్నెట్ కనెక్షన్‌తో టీవీలోనే అన్ని రకాల యాప్‌లు తదితర సర్వీసులు వినియోగించే అవకాశం స్మార్ట్ టీవీల ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని వల్ల ఇంతకుముందు ఉన్న టీవీల కంటే కూడా అధికంగా స్మార్ట్ టీవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీలకు వైరస్ సోకడం వినియోగదారులకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
యూరప్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబానికి చెందిన ఓ స్మార్ట్ టీవీకి ఇటీవల వైరస్ సోకింది. ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన కుటుంబసభ్యులు సినిమా చూస్తుండగా మధ్యలో హఠాత్తుగా టీవీ ఆగిపోయిందట. ఆ తర్వాత స్క్రీన్‌పై వైరస్ సోకినట్లు చూపుతున్న ఓ ఫొటో తప్ప మరేమి కనపడలేదట. దీంతో ఆందోళన చెందిన సదరు ఇంజనీరు ఆ టీవీని రీసెట్ చేయడానికి యత్నించినా అది కుదరలేదు. దీంతో చేసేదేమీలేక టీవీ సంస్థను సంప్రదించగా.. ఇంటికి వచ్చిన టెక్నీషియన్ రీసెట్ చేయడానికి రూ.23,170/, సోకిన వైరస్ ను తొలగించడానికి రూ.11 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అయితే, టీవీ యజమాని సదరు యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేశారా? లేదా వేరే సైట్ల నుంచి డౌన్ లోడ్ చేశారా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. సో టీవీలను జాగ్రత్తగా వాడాలన్నమాట.
స్మార్ట్ టీవీలకూ వైరస్!
Published Sat, Dec 31 2016 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
Advertisement
Advertisement