సియోల్: స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కు వగా ఉపయోగించే చిన్నారులకు కళ్లు పొడి బారతాయని తాజా అధ్యయనంలో తేలింది. దక్షిణ కొరియాలోని చుంగ్ ఆంగ్ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వ హించారు. దీని కోసం 916మంది చిన్నారులను పరీక్షించారు. స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం వల్ల పిల్లల్లో కళ్లు పొడిబారుతున్నట్లు (డీఈడీ వ్యాధి) గుర్తించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారు లతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తేల్చారు. బయట ఆటలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ద్వారా దీని బారి నుంచి బయటపడగలరన్నారు. పట్టణాల్లోని చిన్నారుల్లో 8.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో 2.8 శాతం మంది డీఈడీ బారిన పడినట్లు గుర్తించారు.
స్మార్ట్ ఫోన్లతో చిన్నారుల్లో కంటి సమస్యలు
Published Tue, Jan 10 2017 3:29 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
Advertisement
Advertisement