కృష్ణా: ప్రభుత్వ పాఠశాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు... తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కంప్యూటర్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని ఎత్తుకెళ్లారు. ప్రధానోపాధ్యాయాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(తిరువూరు)