కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌ | screeningtest continues | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌

Published Sat, Nov 12 2016 10:06 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌ - Sakshi

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌

కర్నూలు: కమ్యూనికేషన్‌ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఆరో రోజు శనివారం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన 713 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఛాతీ, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా పరీక్షలను నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 431 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు 128 మంది  తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి వారిని అనుమతించకుండా వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్‌ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement