screening
-
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్
హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నెల రోజుల పాటు 500 మంది మధుమేహ బాధితులకు ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. మధుమేహ బాధితులకు కాళ్లు తొలగించాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్సలతో నయం చేయవచ్చని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు 9010100536 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. సెప్టెంబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా అదనపు పరీక్షలు అవసరమైతే వాటిమీద 50% రాయితీ వర్తిస్తుంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మధుమేహ బాధితులు ఎవరైనా అర్హులే. అయితే తాజాగా మధుమేహం బయటపడినవారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధపడుతున్నవాళ్లకు అయితే వెంటనే బయటపడుతుంది. ఇప్పటికే కాళ్లలో కొంత ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. -
చిన్నారుల్లో కోపం స్మార్ట్ గాడ్జెట్స్ ప్రభావం..
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వాడకం చిన్నారుల్లో ప్రతికూల భావోద్వేగాలను పెంచుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్ పరికరాలు వాడే ప్రీ స్కూల్ చిన్నారుల్లో చిరాకు, కోపం ఎక్కువగా కనిపిస్తోందని గుర్తించారు. కెనడా లోని షెర్‌బ్రూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. స్మార్ట్ ఫోన్ వాడకం చిన్నారుల్లో స్వీయ నియంత్రణ, నైపుణ్యాల అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోంది. మూడున్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వయసు నుంచి టాబ్లెట్‌కు అలవాటుపడ్డ చిన్నారుల భావోద్వేగాలను పరిశీలించారు. ఇలాంటి చిన్నారుల్లో ఏడాది తర్వాత కోపం, నిరాశ విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. చిన్నారులు సొంత ప్రతికూల భావోద్వేగాలను నేర్చుకునే విధానం సాంకేతిక పరికరాల ద్వారా జరుగుతుండటం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో బాల్య వికాసం జరిగితేనే.. సరైన భావోద్వేగం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో చిన్నారుల అల్లరిని కట్టడి చేసేందుకు, ఏడుపును అదుపు చేసేందుకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేయడం సరైన పద్ధతి కాదని అధ్యయనం చెబుతోంది. ఇది బాల్యం, యుక్తవయసులో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు. యునిసెఫ్ సైతం యునిసెఫ్ సైతం చిన్నారుల స్క్రీనింగ్ అలవాట్లను తీవ్రంగా తప్పుపడుతోంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎటువంటి సాంకేతిక పరికరాల నుంచి ఏమీ నేర్చుకోలేరని చెబుతోంది. వారికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు చూపించడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం గురించి యునిసెఫ్ వైద్య బృందం సైతం హెచ్చరిస్తోంది. ఆఫ్–్రస్కీన్ అనుభవాలను అందించడం ద్వారా క్లిష్టమైన వాటిని కూడా చిన్నారులు నేర్చుకోవడంతో పాటు సామాజిక, అభిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. చిన్నారుల్లో మెదడు బాహ్య ప్రపంచం నుంచి గ్రహించిన వాటితోనే అభివృద్ధి చెందుతుందని, కథలు వినడం, పుస్తకాలను బిగ్గరగా చదవడం, చిత్రాలను గుర్తించడం ద్వారా ప్రేరణ పెరుగుతోందని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు స్క్రీన్ సమయం ఇవ్వకూడదని, నాలుగేళ్ల లోపు చిన్నారులకు పాఠ్యాంశాల పరమైన వాటికి, గంటలోపు మాత్రమే స్క్రీనింగ్‌కు కేటాయించాలని సూచిస్తోంది. తాజా పరిశోధనలో 75 నిమిషాలు, అంతకంటే ఎక్కువ రోజువారీ స్క్రీన్ సమయం ఉండటం గమనార్హం. స్క్రీనింగ్‌తో అనారోగ్యం మన ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల స్క్రీన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్క్రీన్ సమయంలో కదలకుండా ఒకేచోట కూర్చోవడంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు తలెత్తున్నాయి. ఇది యుక్త వయసు వచ్చేసరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్త వైకల్యానికి దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు మాట్లాడే పదాలను తక్కువగా నేర్చుకోవడంతో పాటు డిప్రెషన్ ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతాయని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు చెబుతున్నారు. -
ఐదోవంతు సమయం స్మార్ట్‌ఫోన్‌కే సరి
సాక్షి, అమరావతి : స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్‌లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెట్టి, వాటిని అమలు పరిచే చర్యల్లో భాగంగా వచ్చే వారం రోజుల్లో కాంగ్రెస్ కీలక భేటీలు నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా పారీ్టకి తన లక్ష్యాలను వివరించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ, ప్రచారాస్త్రాల ఖరారుకు మేనిఫెస్టో కమిటీలు వారం రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో అభ్యర్థుల జాబితా, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై నేతలకు వివరించే అవకాశాలున్నాయి. రానున్న వారం రోజుల్లో కనీసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
దీర్ఘకాలిక జబ్బులకు ‘సురక్ష’తో భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. వైద్య శాఖ ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజలందరినీ స్క్రీనింగ్ చేయడమే కాకుండా.. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ), క్షయ జబ్బులతో బాధపడుతున్నవారిని గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1.84 కోట్ల మందిలో షుగర్ లక్షణాలు.. గత నెలలో ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 4.63 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారు. 2.16 కోట్ల మందిలో బీపీ, 1.84 కోట్ల మందిలో షుగర్ జబ్బు లక్షణాలను గుర్తించారు. గతంలో నిర్వహించిన నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) సర్వేలో నిర్ధారించిన పాత బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బీపీ కేసులు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 12,790, నెల్లూరులో 12,583, విజయనగరంలో 12,124 వెలుగులోకి వచ్చాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 9,279, నెల్లూరులో 8,275, విజయనగరంలో 7,363 షుగర్ కేసులను గుర్తించారు. మరోవైపు క్షయ అనుమానిత లక్షణాలున్న 1,78,515 మంది నుంచి నిర్ధారణ పరీక్ష కోసం నమూనాలు సేకరించగా.. 417 మందిలో వ్యాధి నిర్ధారణ అయ్యింది. అలాగే కుష్టు వ్యాధి లక్షణాలున్న 9,925 మందిని గుర్తించగా.. వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 8 లక్షల మందిలో కంటి సమస్యలున్నట్టు గుర్తించిన వైద్యులు.. సాధారణ మందులతో తగ్గే సమస్యలున్న 2.44 లక్షల మందికి మందులు అందజేశారు. 4.86 లక్షల మందిని కళ్లద్దాలకు, 69,676 మందిని కేటరాక్ట్ సర్జరీలకు రిఫర్ చేశారు. వీరిలో 833 మందికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా సర్జరీలు నిర్వహించింది. కొత్తగా బయటపడిన బీపీ, షుగర్, క్షయ తదితర జబ్బులున్న వారికి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. ప్రారంభదశలోనే గుర్తిస్తే ఎంతో మేలు.. చిన్న ఆరోగ్య సమస్యే కదా అని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. చాలా మందికి బీపీ, షుగర్ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు. ఇలా అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే.. 20 శాతం పెరాలసిస్ కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. షుగర్ సమస్యను కూడా ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. కిడ్నీ, గుండె, ఇతర సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదముంది. దేశంలో బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా 64.9 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా గుర్తించిన మధుమేహం, రక్తపోటు, క్షయ, ఇతర సమస్యలన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి అనుసంధానం చేశాం. కొత్తగా గుర్తించిన మధుమేహం కేసుల్లో సంబంధిత వ్యక్తులకు హెచ్1బీ ఏసీ టెస్టులు నిర్వహిస్తాం. సంబంధిత వ్యక్తుల ఆరోగ్యాలను ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో పాటు మందులు అందిస్తుంటారు. ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే తగిన సహకారం అందిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 6 లక్షల మందికిపైగా బీపీ బాధితులకు, 4.10 లక్షల మందికిపైగా మధుమేహం బాధితులకు నిరంతర వైద్య సేవలందిస్తున్నాం. –జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజారోగ్యంలో మంచి ఫలితాలు గ్రామాల్లో వ్యవసాయం, ఇతర కూలిపనులు చేసుకుంటూ జీవించే పేదలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వమే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి వైద్య సేవలందించడం శుభపరిణామం. ఇలా చేయడం ద్వారా బీపీ, షుగర్, ఇతర జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించవచ్చు. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ప్రజారోగ్య రంగంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. – డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ -
విడివిడిగా.. కూలంకషంగా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను, మీ నాన్న ఫ్రెండ్స్: పొన్నాల మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు. నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్ ట్వీట్ సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీసీలు ఎందుకు గెలవడం లేదు? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు. తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం. -
అభ్యర్థుల వడపోత షురూ
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలెవరన్న దానిపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. కర్ణాటక తరహాలోనే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు అప్పు డే వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేయదగిన నాయ కుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి పంపినట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, ఆశావహులతో కూడిన జాబితా ఢిల్లీకి వెళ్లిందని సమాచారం. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున పేర్లను పంపాలన్న ఏఐసీసీ సూచన మేరకు కసరత్తు చేసిన టీపీసీసీ... ఆ జాబితాను అధిష్టానా నికి పంపిందని, ఈ నెల 26న ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గేలతో భేటీ కావడానికి ముందే ఈ జాబితా అక్కడకు వెళ్లిందనే చర్చ గాంధీ భవన్లో జరుగుతోంది. ఈ జాబితాను త్వరలో ఏర్పాటు కాబోయే ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) పరిశీలించిన అనంతరం కొన్ని మార్పుచేర్పులు చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపుతుందని, ఈ జాబితా నుంచి అధిష్టానం పరిశీలన కోసం రెండు పేర్లు వెళతాయని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ముగ్గురి వరకు.. ఏఐసీసీ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆశావహుల పేర్లను టీపీసీసీ ఢిల్లీకి పంపింది. ఇందులో 70కిపైగా స్థానాల్లో ముగ్గురి పేర్లు వెళ్లాయని, స్పష్టత ఉన్న స్థానాల్లో కేవలం ఒకే పేరు, మరికొన్ని చోట్ల రెండుపేర్లు వెళ్లాయని సమాచారం. దీంతోపాటు 2009, 2014, 2018లలో వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలున్న నియోజకవర్గాల్లో కొత్త పేర్లు వెళ్లాయని, అక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఏఐసీసీ మొగ్గుచూపుతోందని అంటున్నారు. మొత్తంమీద ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉండగానే ఏఐసీసీ అభ్యర్థుల జాబితా కోరడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్.. తమిళనాడులో షోలు రద్దు
ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ మూవీ అనేక అడ్డంకుల నడుమ మే 5న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత కూడా సినిమాను రాజకీయ వివాదం వదలడం లేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మధ్యప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించింది. తాజాగా ది కేరళ స్టోరీ సినిమాకు తమిళనాడలో భారీ షాక్ తగిలింది. తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లో షోలు రద్దు చేశారు. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. సినిమాకు వ్యతిరేకంగా చెన్నై అన్నానగర్ అర్చ్ స్కై వాక్ మాల్ వద్ద పార్టీ అధినేత నటుడు, దర్మకుడు సీమన్ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ జెండాలు పట్టుకొని థియేటర్లలోకి ప్రవేశించి నినాదాలు చేశారు. చదవండి: The Kerala Story: ది కేరళ స్టోరీ రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా? సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులను, చూడవద్దని ప్రేక్షకులను సీమన్ విజ్జప్తి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వమే కాకుండా తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు సైతం సినిమాను ప్రదర్శిస్తే.. థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. కేరళ స్టోరీ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గతంలో సీమాన్ డిమాండ్ చేశారు. కాగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై రాజకీయ దుమారం మొదలైన విషయం తెలిసిందే. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. చదవండి: కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’ ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. దీని వెనక ఆరెస్సెస్, బీజేపీలున్నాయని ఆరోపిస్తున్నాయి.సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. కోర్టు మెట్లు కూడా ఎక్కిన ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకే మొగ్గు చూపింది, -
కాంతారకు అరుదైన గౌరవం, ఐక్యరాజ్య సమితిలో స్క్రీనింగ్
-
స్మార్ట్‌గా అతుక్కుపోతున్నారు.. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం మనిషి బాహ్య ప్రపంచానికి దూరంగా ఆన్లైన్లో గడుపుతున్నాడు. పక్కవాడిని కూడా చాటింగ్‌లోనే పలకరిస్తున్నాడు. సుఖదుఃఖాలన్నీ కూర్చున్నచోటునే అనుభవిస్తున్నాడు. గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్, టీవీ, ఇంటర్నెట్ స్క్రీనింగ్‌లో మునిగిపోతున్నాడు. దైనందిన జీవితంలో చాలామంది మేల్కొని ఉండే సమయంలో ఏకంగా 44 శాతం సమయాన్ని స్క్రీనింగ్ కోసమే కేటాయిస్తుండటం (40 శాతం ఇంటర్నెట్లో) ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటు స్క్రీనింగ్ రేటు 6.58 గంటలుగా ఉంది. ఇది 2013తో పోలిస్తే 49 నిమిషాలు పెరగడం గమనార్హం. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 10.46 గంటలు, అమెరికాలో అయితే 7.04 గంటలు, భారత్‌లో అయితే 7.18 గంటలుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి 0–2 ఏళ్లలోపు పిల్లలు 49 శాతం మంది సెల్ఫోన్లలో ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019లో సగటున 2.56 గంటల పాటు మొబైల్ స్క్రీన్ చూసిన వాళ్లు ఇప్పుడు 4.12 గంటలు చూస్తున్నారు. దేశంలో టీనేజర్లు అయితే ఏకంగా 8 గంటలకు పైగా ఆన్లైన్లోనే బతికేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సగటు స్క్రీనింగ్ సమయం కంటే ఎక్కువ. కళ్లు పొడారిపోతాయి ఎక్కువసేపు మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూడటంవల్ల కళ్లు పొడారిపోతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి దురదలు, మంటలు వస్తుంటాయి. క్రమేణా నల్లగుడ్డు సమస్యలకు దారితీస్తాయి. వీటితో పాటు నిద్రలేమి, మానసిక సమస్యలకు దారితీస్తాయి. విద్యార్థులైతే చదువుపై దృష్టి సారించలేక పోవడం, చదివినవి మర్చిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. అవసరమైన మేరకే టీవీలు, కంప్యూటర్, మొబైల్స్‌ను చూడాలి. – ఈఎస్ఎన్ మూర్తి, నేత్ర వైద్య నిపుణులు, జీజీహెచ్, విజయవాడ చిన్నారుల కోసం నిర్ణీత సమయం.. అమెరికన్ టీనేజర్లు అయితే కేవలం 3 గంటలు మాత్రమే టీవీ, వీడియోలు చూడటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చైనాలో వారానికి మూడు గంటలు మాత్రమే చిన్నారులకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోజుకు 26 నిమిషాలు మాత్రమే నచ్చిన పరికరంలో నచ్చిన అంశాలను వీక్షించవచ్చు. ఇదే దారిలో జపాన్, రష్యా కూడా 30 నిమిషాలు, ఇజ్రాయెల్ 19 నిమిషాలు చాలంటూ పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. ఆరోగ్యానికి హానికరం గంటల కొద్దీ తదేకంగా టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్కు అతుక్కుపోతే తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యుక్త వయస్కులకు స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారింది. దీనిని నోమోఫోబియాగా పిలుస్తారు. ఫోన్ లేకుండా వారు ఉండలేరు. చిన్నారుల్లో మానసికంగా, భావోద్వేగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలిమెంటరీ స్కూల్ స్థాయి పిల్లలు రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు స్క్రీనింగ్‌లో ఉంటే వారికి మెల్లగా స్థిరత్వాన్ని, నిర్ణయించుకునే శక్తి కోల్పోతారు. పలు దేశాల్లో 5–17 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో ఊబకాయం పెరిగింది. 9–10 ఏళ్ల వయసు పిల్లల్లో 3 గంటలకు పైగా స్క్రీన్‌ను చూస్తే టైప్–2 డయాబెటిస్ వచ్చినట్లు, గ్రహణశక్తిలో వెనుబడినట్లు గుర్తించారు. పెద్దల్లో అయితే నిద్రలేమికి దారితీస్తుంది. కంటి చూపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరం పనితీరులో మార్పులొస్తాయి. వీటిని అరికట్టేందుకు సోషల్ మీడియా వాడకాన్ని ప్రతిఒక్కరూ రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీలు.. స్క్రీనింగ్‌కు ఎక్కువగా కారణమవుతున్నాయి. అయితే, వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వాళ్లే ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్‌లో ఎక్కువసేపు లీనమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో 97.2 శాతం మంది టీవీ, 92 శాతం మంది వీడియో గేములు ఆడుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఇక్కడ 74 శాతం తల్లిదండ్రులు ఏడేళ్ల వయసు పిల్లలతో కలిసి ఎక్కువగా టీవీలు చూస్తున్నారు. -
క్యాన్సర్‌పై యుద్ధం..మాస్ స్క్రీనింగ్ దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంపై దృష్టిపెట్టింది. దేశంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు సంభవిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమైంది. క్యాన్సర్ వైద్యం, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్)గా నియమించింది. ఆయన ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంవల్ల నివారణకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా.. ప్రాణాపాయంతో పాటు, వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో మాస్ స్క్రీనింగ్‌కు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిద్వారా నోటి (ఓరల్) క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్), రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించాలనేది సర్కారు లక్ష్యం. గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. గ్రామంలో సచివాలయం యూనిట్‌గా మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సాయంతో ముగ్గురు గైనకాలజీ, ముగ్గురు అంకాలజీ వైద్యులు గత శనివారం స్క్రీనింగ్ నిర్వహించారు. గ్రామంలో 2,400 మంది జనాభా ఉండగా వీరిలో 30 నుంచి 60 ఏళ్లు పైబడిన మహిళలు 640 మందికి ఉన్నారు. వీరందరికీ స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ వలంటీర్, ఆశా వర్కర్, అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 240 మంది మహిళలు స్క్రీనింగ్‌కు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న 70 మందికి వైద్యులు ఎంఎంయూలోనే మామోగ్రామ్ పరీక్ష చేశారు. అదేవిధంగా 117 మందికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన పాప్‌స్మియర్ పరీక్ష నిర్వహించారు. రిపోర్ట్‌లన్నింటీని గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ కేర్ విభాగానికి తరలించారు. ఇక్కడి నిపుణుల పరిశీలన అనంతరం బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించనున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చిన 27 మంది పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు చేయగా ఇద్దరికి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గుర్తించిన అంశాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ నేతృత్వంలోని కోర్ కమిటీ ప్రణాళిక సిద్ధంచేసింది. మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు మూడు విధానాలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. సచివాలయం యూనిట్‌గా స్క్రీనింగ్ నిర్వహణ సచివాలయం యూనిట్‌గా మాస్ స్క్రీనింగ్ నిర్వహణ చేపట్టబోతున్నాం. అనంతరం గుర్తించిన క్యాన్సర్ రోగులను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ద్వారా దగ్గరలోని నెట్వర్క్ ఆసుపత్రికి తరలిస్తాం. ఆసుపత్రిలో వీరికి ప్రభుత్వమే ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తుంది. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు వాకబు చేస్తారు. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
కుంభస్థలాన్ని బద్దలు కొట్టనున్న ఆర్ఆర్ఆర్, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే?
‘‘ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం... రా’’ అంటూ రామ్, భీమ్ చేసిన యుద్ధాన్ని తెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఈ యుద్ధాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది వేల స్క్రీన్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం). రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ భారీ సినిమా కాబట్టి ఈ సినిమాతో పోటీ పడకుండా తెలుగుతో కలుపుకుని ఇతర భాషల్లో కూడా తమ చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నాయి పలు నిర్మాణ సంస్థలు. అంతెందుకు? దేశవ్యాప్తంగా చాలావరకూ ఎక్కువ స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ కనిపిస్తుంది. ఇక జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) అయితే శుక్రవారం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప వేరే సినిమా కనిపించదు. ఆ విశేషాల్లోకి వస్తే... సింగిల్ 100... మల్టీప్లెక్స్ 40 హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న థియేటర్లు ఎన్ని? అనే లెక్కలోకి వస్తే... సింగిల్ థియేటర్లు దాదాపు 100. మల్టీప్లెక్స్ దాదాపు 40 ప్రాపర్టీస్ (మల్టీప్లెక్స్‌లో పలు స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి వీటిని ప్రాపర్టీస్ అంటారు). మామూలుగా ఏ మల్టీప్లెక్స్ థియేటర్లో అయినా మినిమమ్ మూడు స్క్రీన్ల నుంచి మ్యాగ్జిమమ్ తొమ్మిది స్క్రీన్ల వరకూ ఉంటాయి. సో... టూకీగా ఒక్కో ప్రాపర్టీలో ఐదు స్క్రీన్లు ఉన్నాయనుకుందాం... అప్పుడు 40 ప్రాపర్టీస్‌లో 200 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతుందనుకోవచ్చు. సో.. సింగిల్, మల్టీప్లెక్స్ కలుపుకుని దాదాపు 300 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ ఆడుతుంది. మరి.. ఇప్పటివరకూ థియేటర్లలో ఉన్న సినిమాల సంగతేంటి? రెండు మూడు స్క్రీన్లు మినహా... గురువారం వరకూ ‘ద కశ్మీర్ ఫైల్స్’, ‘రాధే శ్యామ్’, ‘బచ్చన్ పాండే’, ‘జేమ్స్’తో పాటు హాలీవుడ్ ‘బ్యాట్ మేన్’ తదితర చిత్రాలు కొన్ని థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. అయితే శుక్రవారం రెండు మూడు స్క్రీన్లు మినహా మిగతా అన్నింటిలోనూ ‘ఆర్ఆర్ఆర్’ దర్శనమిస్తుంది. ఎన్ని రోజుల పాటు ఇలా అన్ని స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే ఉంటుంది అంటే..? ‘ద కశ్మీర్..’కి చాన్స్ జంట నగరాల్లో ఆడుతున్న ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’, ‘రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ చిత్రాల ప్రదర్శన గురువారంతో ముగిసింది. అయితే ‘ద కశ్మీర్ ఫైల్స్’ శుక్రవారం ఒకట్రెండు స్క్రీన్లలో మాత్రమే కనిపించి, మళ్లీ సోమవారం నుంచి కాస్త ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ వంటి రెండు మూడు చిత్రాలకూ స్కోప్ ఉంది. అయితే ఈ రెండు మూడు సినిమాలూ జస్ట్ పదీ పదిహేను శాతం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శితమవుతాయని, మిగతా అన్ని స్క్రీన్లలోనూ ఓ వారం.. పది రోజులు ‘ఆర్ఆర్ఆర్’ ఉంటుందని జంట నగరాలకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. ఆ పదిహేను శాతంలో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్లే ఎక్కువని, అది కూడా ‘ద కశ్మీర్...’ సినిమా స్క్రీన్లే ఎక్కువ అని కూడా తెలిపారు. ‘‘ఆదివారం వరకూ ఎలానూ ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వేరే సినిమాలకు ఎన్ని స్క్రీన్లు కేటాయించాలనేది ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చే స్పందన నిర్ణయిస్తుంది’’ అని ఓ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు.. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ, రే స్టీవెన్సన్... ఇలా భారీ తారాగణంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందింది. కోవిడ్ బ్రేక్స్ నడుమ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందించిన ఈ సినిమా నిడివి ఎంత అంటే.. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు. నిజానికి ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు అట. అయితే ముందు 1 నిమిషం 35 సెకన్ల నిడివిని తగ్గించారట. ఆ తర్వాత క్రెడిట్స్‌లో 3 నిమిషాల 26 సెకన్ల నిడివిని తగ్గించారని భోగట్టా. ఫైనల్‌గా ప్రేక్షకులు చూడనున్నది 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు ‘ఆర్ఆర్ఆర్’ అని తెలిసింది. చదవండి: RRR Movie: అందరిముందే అబద్ధాలు ఆడతాను: రాజమౌళి -
‘డైరెక్ట్‌గా పోర్న్ వీడియోలను చూపిస్తున్నారు’
న్యూఢిల్లీ: కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోర్నోగ్రఫీ కంటెంట్‌ని డైరెక్ట్‌గా ప్రసారం చేస్తున్నాయని.. కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయిన పొలిటికల్ డ్రామా ‘తాండవ్’లో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి.. వాటిని తొలగించాలంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొలుత అలహాబాద్ హై కోర్టు తాండవ్ మేకర్స్‌కి, అమెజాన్ ప్రైమ్ ఇండియా ఉన్నత ఉద్యోగి అపర్ణ పురోహిత్‌కి నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ అపర్ణ పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జస్టిస్ అశోక్ భూషన్ అధ్వర్యంలోని బెంచ్ గురువారం ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ సందర్భంగా అశోక్ భూషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటం సర్వసాధారణం అయ్యింది. కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్‌గా పోర్న్ కంటెంట్ ఉన్న వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ విచారణ కన్నా ముందే కేంద్రం తాజాగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు విడుదల చేసిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. చదవండి: ఓటీటీకి కూడా సెన్సార్ సోషల్ మీడియాకు కళ్లెం -
‘థర్మల్ స్క్రీనింగ్’ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. కరోనా వైరస్ (కోవిడ్–19) హైదరాబాద్‌ను కూడా తాకడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ‘తెలంగాణ లో కరోనా వైరస్ ప్రభావం లేదు. విదేశాల నుండి వచ్చే వారి ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుండి వచ్చే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీన్ చేస్తున్నామని’ అధికారులు మంత్రికి వివరించారు. -
నేడు పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష
– ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు నిర్వహణ – 27 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 16,796 మంది అభ్యర్థులు – మాల్ ప్రాక్టీస్ నివారణ కోసం బయోమెట్రిక్ స్కానింగ్ విధానం – భర్తీకానున్న 622 పోస్టులు – ఏర్పాట్లను పూర్తి చేసిన పోలీసు శాఖ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులకు కర్నూలులో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జిల్లాలకు సంబంధించి మెయిన్స్‌కు మొత్తం 16,796 మంది పరీక్షకు అర్హత సాధించారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్స్, జైల్ వార్డెన్ల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదట స్క్రీనింగ్ టెస్టును నిర్వహించింది. డిసెంబర్ 8 నుంచి 20వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షను ఆదివారం ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా బయోమెట్రిక్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు 27 కేంద్రాల్లో 94 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించారు. వారికి వ్యాస్ ఆడిటోరియంలో ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. ఈ విధానంలో అభ్యర్థుల నుంచి వేలిముద్రలు స్వీకరిస్తారు. అలాగే పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండే జిరాక్స్, నెట్ సెంటర్లను మూసి వేయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడు జిల్లాల్లో భర్తీకానున్న 622 పోస్టులు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలులోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 16,796 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థులు7.969, కడప -5,196, అనంతపురం అభ్యర్థులు 3,631మంది ఉన్నారు. కర్నూలులో 221 పోస్టులు, కడపలో 123, అనంతపురంలో 278 పోస్టులు భర్తీకానున్నాయి. మూడు జిల్లాలో కలిపి మొత్తం 622 పోస్టులు ఉన్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ఆకె రవికృష్ణ, కర్నూలు జిల్లా ఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తాం. నిమిషం ఆలస్యమైన అనుమతించం. అభ్యర్థులు హాల్ టిక్కెట్, ఆధార్ కార్డు లేదంటే ఇతర గుర్తింపు కార్డును కచ్చితంగా తీసుకురావాలి. పరీక్షలో సమాధానాలను బ్లాక్ లేదా బ్లూ పెన్నుతో మాత్రమే రాయాల్సి ఉంది. క్యాలిక్యులేటర్లు, వాచ్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించం. పరీక్షల నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. -
కొనసాగుతున్న స్క్రీనింగ్ టెస్ట్
కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఆరో రోజు శనివారం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన 713 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఛాతీ, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా పరీక్షలను నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 431 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు 128 మంది తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి వారిని అనుమతించకుండా వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న స్క్రీనింగ్ టెస్ట్
మూడో రోజు 424 మంది ఎంపిక కర్నూలు : కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతొంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో మూడో రోజు బుధవారం దేహదారుఢ్య పరీక్షలకు 800 మందిని ఆహ్వానించగా 710 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలించారు. అనంతరం బరువు, ఛాతీ, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 424 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు 215 మంది తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి వారిని అనుమతించకుండా వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
జ్వరాల పంజా
కోరుట్లలో డెంగీ, విషజ్వరాలు పంజా విసిరాయి. నెల రోజుల వ్యవధిలో పన్నెండు మంది మృత్యువాతపడ్డారు. వరుస మరణాల నేపథ్యంలో జ్వరం వచ్చిందంటే చాలు జనం వణికిపోతున్నారు. ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారు ఇతరులపైకి బాధ్యతను నెట్టే యత్నాలు చేస్తున్నారు. కోరుట్ల : సెప్టెంబర్ మొదటి వారంలో కోరుట్లలో వైరల్ జ్వరాృు జంభించగా.. ఆ వెంటనే తాగునీటి క్లోరినేషన్ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ వారు క్లోరోస్కోపు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని చోట్ల క్లోరినేషన్ సరిగా జరగడం లేదని తేలింది. వాస్తవానికి వాటర్ ట్యాంకుల సమీపంలో నీటిలో క్లోరిన్ 2.00పీపీఎం ఉండాల్సి ఉండగా.. కేవలం 1.0 పీపీఎం ఉందని, పైప్‌లైన్ చివరి ప్రాంతాల్లో క్లోరిన్ 0.20 పీపీఎంలు ఉండాల్సి ఉండగా.. అసలు ఆనవాళ్లు లేవని రిపోర్టుల్లో వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల దోమల లార్వా నిల్వలు కనిపించాయని వారు వెల్లడించారు. మున్సిపల్ అధికారులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. క్లోరినేషన్ విషయంలో తాము ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వలేదని వాదిస్తున్నారు. ఆ తరువాత వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అధ్వర్యంలో వైద్యశిబిరాలు జరుగుతుండగా.. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్య చర్యలను విృస్తతం చేశారు. ఎవరికి వారు జ్వరాల నివారణకు చర్యలు చేపట్టినా మరణాలు మాత్రం ఆగడం లేదు. విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ వారు చేసిన సర్వే ప్రకారం పట్టణంలోని 31 వార్డుల్లో శివారుల్లో ఉన్న 18 వార్డుల్లో జ్వరాలు అధికంగా ఉన్నాయని తేలింది. ఈ 18 వార్డుల్లో ఒక్కో వార్డులో కనీసం 150 నుంచి 200 మందికిపైగా జ్వరపీడితులున్నారని చెబుతున్నారు. వీరితో పాటు పట్టణంలోని మిగిలిన జ్వరపీడితులను కలుపుకుంటే కనీసం 5 నుంచి 8వేల మంది జ్వర పీడితులుంటారని అంచనా. దోమలు.. నీటివల్లే..! కోరుట్ల పట్టణంలో పారిశుధ్యం కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. పట్టణ శివారు ప్రాంతాల్లోని మురికివాడల్లో మురికికాల్వలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడ నీరు నిల్వ ఉండటంతో అవి దోమలకు ఆవాసంగా మారాయి. ఈ దోమలు జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయన్న వాదనలున్నాయి. దీంతోపాటు మంచినీటి సరాఫరాలో లోపాలు ఉన్నాయి. పట్టణంలో ఫిల్టర్‌బెడ్ లేకపోవడంతో తాగునీరు పూర్తిస్థాయిలో పరిశుభ్రం కాకుండానే సరఫరా చేస్తున్నారరు. తాగునీటి వనరుగా ఉన్న వాగులోనూ నెలకొన్న అపరిశుభ్రత వల్ల నీరు కలుషితమవుతోంది. ఈ కారణాలతో పాటు వాతావరణంలో మార్పులతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది. పారిశుధ్యం మెరుగుపరిచి, రక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో మున్సిపల్ యంత్రాంగం, జ్వరాలను అదుపు చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫమలయ్యాయి. పేదలపై పెనుభారం.. వైరల్ జ్వరాల వ్యాప్తి పేదలకు పెనుభారంగా మారింది. పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో జనం ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో జనంలో జ్వరాలపై ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుని వచ్చిన ప్రతీ రోగికి మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ప్లెట్లెట్స్ పరీక్షలు చేయిస్తున్నారు. ప్లెట్లెట్స్ సంఖ్య 1.50 లక్షల కంటే తక్కువ ఉన్న వారిని ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకుంటున్నారు. వీరికి రోజుకు రెండుసార్లు ప్లేట్లెట్స్ పరీక్షలు చేయడానికి రూ.500 ఖర్చు అవుతున్నాయి. ప్లేట్లెట్స్ సంఖ్య 50వేలకు పడిపోతే.. సెలైన్‌బాటిళ్లు పెడుతున్నారు. వీటికి కేవలం రూ.50లోపు ఖర్చు అవుతుండగా.. రూ.200 వరకు బిల్లు వేస్తున్నారు. కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల వారు అమినోయాసిడ్స్ను ఐవీ రూపంలో రోగులకు ఎక్కించి రూ.3-4వేల బిల్లు వసూలు చేస్తున్నారు. ఇలా జ్వరంతో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులకు బిల్లుల భారం రూ.10 వేల నుంచి రూ.50 వేలు అవుతోంది. ప్లెట్లెట్స్ సంఖ్య మరీ తక్కువగా రోగిని కరీంనగర్‌కు తరలిస్తున్నారు. కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో రోగులు ఎక్కువగా ఉండటంతో కొందరు గత్యంతరం లేక ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. మృతుల వివరాలు.. సెప్టెంబర్ 8న పట్టణంలోని గంగంపేటలో శ్రావణి అనే బాలిక, 27న ఏసుకొనిగుట్ట కాలనీలో భరత్‌కుమార్(22), 28న తాళ్ళచెరువుకు చెందిన రైసాబేగం(35), 29న అదే ప్రాం తానికి అప్సనాజ్(4), 30న ప్రకాశం రోడ్‌కు చెందిన గాజెంగి రాంబాబు(27) జ్వరంతో వృుతి చెందారు. ఈనెల 5న కాల్వగడ్డకు చెందిన సిరిమల్లె కవిత(24) చనిపోయింది. మరుసటి రోజు ఏకంగా ముగ్గురు వృుత్యువాతపడ్డారు. రథలాపంపునకు చెందిన సాలెహ్(23) అనే గర్భిణి కడుపులో శిశువుతో పాటు కన్నుమూసింది. హైదరగూడలో హమీదబేగం అనే ృద్ధురాలు, గంగంపేటలో వెంకట్‌రెడ్డి గంగాధర్ చనిపోయారు. ఈనెల 12న బాలాజీరోడ్కు చెందిన చైతన్యప్రసాద్(12), 13న ప్రకాశంరోడ్‌లో పోగుల రాజేష్ అనే యువకుడు డెంగీతో మృతి చెందారు. సోమవారం రాత్రి అల్లమయ్యగుట్టకు చెందిన దివ్యజ్యోతి అనే బాలిక జ్వరంతో బాధపడుతూ నోరు, ముక్కు నుంచి రక్తం వచ్చి చనిపోయింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా పరీక్షలు
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎబోలాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెడ్ అలెర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అధికారులు ....విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎబోలా వైరస్ సోకిన వారిని గుర్తించి వారిని హుటాహుటిన అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా రాష్ట్ర అత్యవసర వైద్య సేవల విభాగంకు చెందిన అంబులెన్సులు విమానాశ్రయంలో మోహరించాయి. దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఆఫ్రికా ఖండంలో పలు ప్రాంతాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. తీవ్ర జ్వరంతో ఆరంభమయ్యే ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతుంది. దీంతో భారత్‌లో ఈ వైరస్ ప్రబలకుండా కేంద్ర ఆరోగ్య శాఖ జాగ్రత చర్యల్లో పడింది.