జ్వరాల పంజా | Fever claw | Sakshi
Sakshi News home page

జ్వరాల పంజా

Published Wed, Oct 15 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

Fever claw

కోరుట్లలో డెంగీ, విషజ్వరాలు పంజా విసిరాయి. నెల రోజుల వ్యవధిలో పన్నెండు మంది మృత్యువాతపడ్డారు. వరుస మరణాల నేపథ్యంలో జ్వరం వచ్చిందంటే చాలు జనం వణికిపోతున్నారు. ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారు ఇతరులపైకి బాధ్యతను నెట్టే యత్నాలు చేస్తున్నారు.
 

 కోరుట్ల :
 సెప్టెంబర్ మొదటి వారంలో కోరుట్లలో వైరల్ జ్వరాృు జంభించగా.. ఆ వెంటనే తాగునీటి క్లోరినేషన్ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ వారు క్లోరోస్కోపు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని చోట్ల క్లోరినేషన్ సరిగా జరగడం లేదని తేలింది. వాస్తవానికి వాటర్ ట్యాంకుల సమీపంలో నీటిలో క్లోరిన్ 2.00పీపీఎం ఉండాల్సి ఉండగా.. కేవలం 1.0 పీపీఎం ఉందని, పైప్‌లైన్ చివరి ప్రాంతాల్లో క్లోరిన్ 0.20 పీపీఎంలు ఉండాల్సి ఉండగా.. అసలు ఆనవాళ్లు లేవని రిపోర్టుల్లో వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

పలుచోట్ల దోమల లార్వా నిల్వలు కనిపించాయని వారు వెల్లడించారు. మున్సిపల్ అధికారులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. క్లోరినేషన్ విషయంలో తాము ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వలేదని వాదిస్తున్నారు. ఆ తరువాత వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అధ్వర్యంలో వైద్యశిబిరాలు జరుగుతుండగా.. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్య చర్యలను విృస్తతం చేశారు.

ఎవరికి వారు జ్వరాల నివారణకు చర్యలు చేపట్టినా మరణాలు మాత్రం ఆగడం లేదు. విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ వారు చేసిన సర్వే ప్రకారం పట్టణంలోని 31 వార్డుల్లో శివారుల్లో ఉన్న 18 వార్డుల్లో జ్వరాలు అధికంగా ఉన్నాయని తేలింది. ఈ 18 వార్డుల్లో ఒక్కో వార్డులో కనీసం 150 నుంచి 200 మందికిపైగా జ్వరపీడితులున్నారని చెబుతున్నారు. వీరితో పాటు పట్టణంలోని మిగిలిన జ్వరపీడితులను కలుపుకుంటే కనీసం 5 నుంచి 8వేల మంది జ్వర పీడితులుంటారని అంచనా.

 దోమలు.. నీటివల్లే..!
 కోరుట్ల పట్టణంలో పారిశుధ్యం కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. పట్టణ శివారు ప్రాంతాల్లోని మురికివాడల్లో మురికికాల్వలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడ నీరు నిల్వ ఉండటంతో అవి దోమలకు ఆవాసంగా మారాయి. ఈ దోమలు జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయన్న వాదనలున్నాయి. దీంతోపాటు మంచినీటి సరాఫరాలో లోపాలు ఉన్నాయి.

పట్టణంలో ఫిల్టర్‌బెడ్ లేకపోవడంతో తాగునీరు పూర్తిస్థాయిలో పరిశుభ్రం కాకుండానే సరఫరా చేస్తున్నారరు. తాగునీటి వనరుగా ఉన్న వాగులోనూ నెలకొన్న అపరిశుభ్రత వల్ల నీరు కలుషితమవుతోంది. ఈ కారణాలతో పాటు వాతావరణంలో మార్పులతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది. పారిశుధ్యం మెరుగుపరిచి, రక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో మున్సిపల్ యంత్రాంగం, జ్వరాలను అదుపు చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫమలయ్యాయి.

 పేదలపై పెనుభారం..
 వైరల్ జ్వరాల వ్యాప్తి పేదలకు పెనుభారంగా మారింది. పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో జనం ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో జనంలో జ్వరాలపై ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుని వచ్చిన ప్రతీ రోగికి మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ప్లెట్‌లెట్స్ పరీక్షలు చేయిస్తున్నారు. ప్లెట్‌లెట్స్ సంఖ్య 1.50 లక్షల కంటే తక్కువ ఉన్న వారిని ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకుంటున్నారు.

వీరికి రోజుకు రెండుసార్లు ప్లేట్‌లెట్స్ పరీక్షలు చేయడానికి రూ.500 ఖర్చు అవుతున్నాయి. ప్లేట్‌లెట్స్ సంఖ్య 50వేలకు పడిపోతే.. సెలైన్‌బాటిళ్లు పెడుతున్నారు. వీటికి కేవలం రూ.50లోపు ఖర్చు అవుతుండగా.. రూ.200 వరకు బిల్లు వేస్తున్నారు. కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల వారు అమినోయాసిడ్స్‌ను ఐవీ రూపంలో రోగులకు ఎక్కించి రూ.3-4వేల బిల్లు వసూలు చేస్తున్నారు. ఇలా జ్వరంతో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులకు బిల్లుల భారం రూ.10 వేల నుంచి రూ.50 వేలు అవుతోంది. ప్లెట్‌లెట్స్ సంఖ్య మరీ తక్కువగా రోగిని కరీంనగర్‌కు తరలిస్తున్నారు. కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో రోగులు ఎక్కువగా ఉండటంతో కొందరు గత్యంతరం లేక ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు.

 మృతుల వివరాలు..
 సెప్టెంబర్ 8న పట్టణంలోని గంగంపేటలో శ్రావణి అనే బాలిక, 27న ఏసుకొనిగుట్ట కాలనీలో భరత్‌కుమార్(22), 28న తాళ్ళచెరువుకు చెందిన రైసాబేగం(35), 29న అదే ప్రాం తానికి అప్సనాజ్(4), 30న ప్రకాశం రోడ్‌కు చెందిన గాజెంగి రాంబాబు(27) జ్వరంతో వృుతి చెందారు. ఈనెల 5న కాల్వగడ్డకు చెందిన సిరిమల్లె కవిత(24) చనిపోయింది. మరుసటి రోజు ఏకంగా ముగ్గురు వృుత్యువాతపడ్డారు. రథలాపంపునకు చెందిన సాలెహ్(23) అనే గర్భిణి కడుపులో శిశువుతో పాటు కన్నుమూసింది.


హైదరగూడలో హమీదబేగం అనే ృద్ధురాలు, గంగంపేటలో వెంకట్‌రెడ్డి గంగాధర్ చనిపోయారు. ఈనెల 12న బాలాజీరోడ్‌కు చెందిన చైతన్యప్రసాద్(12), 13న ప్రకాశంరోడ్‌లో  పోగుల రాజేష్ అనే యువకుడు డెంగీతో మృతి చెందారు. సోమవారం రాత్రి అల్లమయ్యగుట్టకు చెందిన దివ్యజ్యోతి అనే బాలిక జ్వరంతో బాధపడుతూ నోరు, ముక్కు నుంచి రక్తం వచ్చి చనిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement