సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. కరోనా వైరస్ (కోవిడ్–19) హైదరాబాద్‌ను కూడా తాకడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ‘తెలంగాణ లో కరోనా వైరస్ ప్రభావం లేదు. విదేశాల నుండి వచ్చే వారి ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుండి వచ్చే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీన్ చేస్తున్నామని’ అధికారులు మంత్రికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment