The Kerala Story Not To Be Screened In Tamil Nadu Multiplex Theatres - Sakshi
Sakshi News home page

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’కి షాక్‌.. తమిళనాడులో సినిమా షోలు రద్దు

Published Sun, May 7 2023 4:21 PM | Last Updated on Sun, May 7 2023 4:55 PM

The Kerala Story Not To Be Screened In Tamil Nadu Multiplex Theatres - Sakshi

ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ మూవీ అనేక అడ్డంకుల నడుమ మే 5న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత కూడా సినిమాను రాజకీయ వివాదం వదలడం లేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మధ్యప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించింది. 

తాజాగా ది కేరళ స్టోరీ సినిమాకు తమిళనాడలో భారీ షాక్‌ తగిలింది. తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్‌ థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశాయి. చెన్నై, కోయంబత్తూర్‌, మదురై, సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లో షోలు రద్దు చేశారు. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. సినిమాకు వ్యతిరేకంగా చెన్నై అన్నానగర్‌ అర్చ్‌ స్కై వాక్‌ మాల్‌ వద్ద పార్టీ అధినేత నటుడు, దర్మకుడు సీమన్‌ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సినిమాను బ్యాన్‌ చేయాలంటూ జెండాలు పట్టుకొని థియేటర్లలోకి ప్రవేశించి నినాదాలు చేశారు.
చదవండి: The Kerala Story: ది కేరళ స్టోరీ రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులను, చూడవద్దని ప్రేక్షకులను సీమన్‌ విజ్జప్తి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వమే కాకుండా తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు సైతం సినిమాను ప్రదర్శిస్తే.. థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. 

కేరళ స్టోరీ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గతంలో సీమాన్ డిమాండ్ చేశారు. కాగా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై రాజకీయ దుమారం మొదలైన విషయం తెలిసిందే. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు  సుదీప్తో సేన్‌ తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది
పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది.
చదవండి: కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’

ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. దీని వెనక ఆరెస్సెస్, బీజేపీలున్నాయని ఆరోపిస్తున్నాయి.సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. కోర్టు మెట్లు కూడా ఎక్కిన ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకే మొగ్గు చూపింది, 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement