multiplex theatres
-
‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్.. తమిళనాడులో షోలు రద్దు
ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. విడుదలకు ముందే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ మూవీ అనేక అడ్డంకుల నడుమ మే 5న ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత కూడా సినిమాను రాజకీయ వివాదం వదలడం లేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మధ్యప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించింది. తాజాగా ది కేరళ స్టోరీ సినిమాకు తమిళనాడలో భారీ షాక్ తగిలింది. తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లో షోలు రద్దు చేశారు. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి పార్టీ శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. సినిమాకు వ్యతిరేకంగా చెన్నై అన్నానగర్ అర్చ్ స్కై వాక్ మాల్ వద్ద పార్టీ అధినేత నటుడు, దర్మకుడు సీమన్ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ జెండాలు పట్టుకొని థియేటర్లలోకి ప్రవేశించి నినాదాలు చేశారు. చదవండి: The Kerala Story: ది కేరళ స్టోరీ రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా? సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులను, చూడవద్దని ప్రేక్షకులను సీమన్ విజ్జప్తి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వమే కాకుండా తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు సైతం సినిమాను ప్రదర్శిస్తే.. థియేటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించడంతో థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదు. కేరళ స్టోరీ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గతంలో సీమాన్ డిమాండ్ చేశారు. కాగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై రాజకీయ దుమారం మొదలైన విషయం తెలిసిందే. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. చదవండి: కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’ ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. దీని వెనక ఆరెస్సెస్, బీజేపీలున్నాయని ఆరోపిస్తున్నాయి.సినిమాను విడుదల చేయకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. కోర్టు మెట్లు కూడా ఎక్కిన ప్రయోజనం లేకుండా పోయింది. కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సినిమా విడుదలకే మొగ్గు చూపింది, -
అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. త్వరలోనే ప్రారంభం
సినిమాలతో పాటు బిజినెస్‌లపై కూడా దృష్టిపెట్టారు మన స్టార్ హీరోలు. ఎంతోమంది హీరోలు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఏఎంబీ మాల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్సు రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ అల్లు అర్జున్ పేరిట హైదరాబాద్ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కూడా పూర్తయ్యి, ఓపెనింగ్‌కి ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్సును ప్రారంభించనున్నారు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
పీవీఆర్ కొత్త స్క్రీన్ల ఏర్పాటు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 100 స్క్రీన్లు(తెరలు) ఏర్పాటు చేయనున్నట్లు మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. మల్టీప్లెక్స్ రంగంలోని మరో కంపెనీ ఐనాక్స్ లీజర్తో విలీనం 2023 ఫిబ్రవరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్‌గా సంయుక్త బిజినెస్‌ను నిర్వహించనున్నట్లు పీవీఆర్ సీఈవో గౌతమ్ దత్తా పేర్కొన్నారు. వీక్షకులు తిరిగి సినిమా థియేటర్లకు వచ్చేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆహారం, పానీయాల విభాగం అమ్మకాలు సైతం పుంజుకున్నట్లు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై స్పందిస్తూ వివరించారు. వెరసి తెరల విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది బాటలోనే వచ్చే రెండు, మూడేళ్లలో కూడా విస్తరణను కొనసాగించే వీలున్నట్లు తెలియజేశారు. 60 శాతం తెరలను నగరాలలో ఏర్పాటు చేయనుండగా.. మిగిలిన వాటిని కొత్త ప్రాంతాలలో నెలకొల్పనున్నట్లు వివరించారు. రూర్కెలా, డెహ్రాడూన్, వాపి, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం, అహ్మదాబాద్‌లో విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిధులను నగదు నిల్వలు, అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. -
సినిమా ఊరట!
ఒకటి కాదు... రెండు కాదు... మూడు దశాబ్దాల పైగా సుదీర్ఘ నిరీక్షణ. ఎట్టకేలకు అది ఆదివారం నాడు ఫలించింది. కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో సరికొత్త మల్టీపర్పస్ సినిమా హాళ్ళు రెండింటిని జమ్మూ–కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రారంభించారు. అలాగే, కశ్మీర్లో తొలి మల్టీప్లెక్స్ సైతం 3 స్క్రీన్లతో మంగళవారం శ్రీనగర్‌లో మొదలైంది. పాలకులు చెబుతున్నట్టు కశ్మీర్లో సినీ రంగానికి ఇది చరిత్రాత్మక దినమే. 1980ల తర్వాత టీవీలో, ఇటీవల ఓటీటీలలో తప్ప థియేటర్లలో పదుగురితో కలసి సినీ సందర్శన అనుభవమే లేని కొత్త తరానికి ఇది మరో ప్రపంచపు స్వాగతమే. అదే సమయంలో వెండితెరతో పాటు జనజీవితాలూ వెలిగిపోవడానికి ఇది సరిపోతుందా? తీవ్రవాదంపై పోరులో తెరపై గెలిచే సినిమా... నిజజీవితంలో అదే తీవ్రవాదానికి దశాబ్దాలుగా బాధితురాలవడమే విచిత్రం. మిగిలిన భారతీయుల్లా కల్లోలిత కశ్మీర్ వాసులూ సాధారణ జీవితం గడపడానికీ, తీరికవేళ సినీవినోదాన్ని ఆస్వాదించడానికీ ఈ కొత్త సినిమా హాళ్ళు ఉపకరిస్తాయని భావన. అందుకే, ప్రతి జిల్లా ముఖ్యపట్టణంలో సినిమా హాలు నెలకొల్పాలని పాలకుల నిశ్చయం. అలా కేంద్రపాలిత జమ్మూ – కశ్మీర్‌లోని 20 జిల్లాల్లోనూ థియేటర్లు పెడతారు. జిల్లా పాలనా యంత్రాంగంతో కలసి ప్రభుత్వ ‘మిషన్ యూత్ డిపార్ట్మెంట్’ ఈ థియేటర్లను నెలకొల్పుతుంది. వాటి నిర్వహణను నిపుణులకు అప్పగిస్తారు. ఇందులో భాగంగా అనంతనాగ్, శ్రీనగర్, రాజౌరీ, పూంbŒ∙లాంటి చాలాచోట్ల త్వరలో సినీ వినోదశాలలు రానున్నాయి. అక్కడ సినిమా షోలతో పాటు విజ్ఞానభరిత వినోదం, యువతకు నవీన నైపుణ్యాభివృద్ధి వసతులు కల్పించాలని ప్రణాళిక. కనువిందైన మంచు కొండలు, కాదనలేని డాల్ సరస్సులో నౌకా విహారం వగైరాతో అందమైన ప్రకృతి, ఆహ్లాదభరిత వాతావరణంతో చాలాకాలం సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ కేంద్రం. రాజ్ కపూర్ నుంచి తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవి సినిమాల దాకా అన్నీ కశ్మీర్ అందాలను కెమెరాకంటితో బంధించినవే. 1989 నాటి వేర్పాటువాద విజృంభణతో ఆ పరిస్థితే పోయింది. మరోపక్క ఎందరో కశ్మీరీలు హిందీ చిత్రసీమలో పేరు తెచ్చుకున్నా, ఎప్పుడో 58 ఏళ్ళ క్రితం తొలి పూర్తినిడివి కశ్మీరీ ఫీచర్ ఫిల్మ్ ‘మైంజ్ రాత్’తో మొదలైన ‘కశ్మీరీ భాషా సినీపరిశ్రమలో ఇప్పటికీ ఎదుగూబొదుగూ లేదు. తర్వాత కొద్ది ఫిల్మ్‌లే వచ్చాయి. తీవ్రవాదుల భయానికి స్థానిక, పరభాషా చిత్రాల నిర్మాణం రెండూ స్తంభించాయి. చిత్రప్రదర్శనపై అప్రకటిత నిషేధం వచ్చిపడింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం, అనంతర పాలకులూ థియేటర్లు తెరిచేందుకు ప్రయత్నించినా తీవ్రవాద దాడులతో అవేవీ విజయవంతం కాలేదు. పైరసీ రాజ్యమేలుతోంది. హాలులో సినిమా చూడడానికి సినీప్రియులు కశ్మీర్ దాటి పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న పరిస్థితి. లోయలో సాధారణ పరిస్థితి తెస్తున్నామంటూ 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన పాలకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్ము – కశ్మీర్‌ను మళ్ళీ భారతీయ సినీనిర్మాణ పటంపైకి తీసుకురావా లని కేంద్రపాలిత ప్రాంత పాలనాయంత్రాంగం గత ఏడాది ఓ సరికొత్త చలనచిత్ర విధానాన్ని తెచ్చింది. హిందీ నిర్మాతలను మళ్ళీ కశ్మీర్ వైపు ఆకర్షించడానికి ప్రత్యేక వసతులు కల్పించింది. ఇప్పుడీ ప్రయత్నాలన్నిటి వల్ల కశ్మీరీలకు వెండితెర వినోదం అందుబాటులోకి రావడమే కాక, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయనేది ఆలోచన. వర్తమాన సంస్కృతి, విలువలతో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిఫలించే సినిమా మనోనేత్రానికి ద్వారాలు తీస్తుంది. మతమౌఢ్యంతో అన్నిటినీ నిరాకరించలేం. సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం పంథా మార్చుకొని, సినీ ప్రదర్శనలపై 35 ఏళ్ళ నిషేధాన్ని నాలుగేళ్ళ క్రితం 2018లో ఎత్తివేసి, మార్పును ఆహ్వానించడం ఒక సరికొత్త అధ్యాయం. సినిమా అనే శక్తిమంతమైన సృజనాత్మక సాధనం ఆసరాగా కశ్మీరీలను ప్రధాన స్రవంతిలో మమేకం చేయాలనే ఆలోచన మంచిదే. అయితే, అదొక్కటే సరిపోదు. దాని కన్నా ముందుగా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రతి చిన్న ప్రయత్నం స్థానిక వాణిజ్య కార్యకలాపాలకు కొత్త ప్రోత్సాహమే. కానీ, పాలకులు కశ్మీర్‌కు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచి పోషించాల్సిన లక్ష్యం ఇప్పటికీ సుదూరంగా నిలబడి చేరబిలుస్తోంది. కశ్మీర్ పండిట్ల కన్నీటి గాథలపై ‘కశ్మీరీ ఫైల్స్’ లాంటి ప్రచార చిత్రానికి పాలకులు ఇటీవల అండగా ఉండి, అక్కున చేర్చుకున్నారు. మరి, లోయలో సురక్షితంగా జీవించే పరిస్థితులు ఎందుకు కల్పించలేక పోతున్నారు? వారి సమస్యల పరిష్కారానికి ఇప్పటికీ ఎందుకు పూచీ పడలేకపోతు న్నారు? అవన్నీ జరగాలంటే ముందుగా స్థానిక ప్రజల మనసు గెలుచుకోవాలి. అభివృద్ధి సహా అన్నిటిలో తామూ భాగస్వాములమనే భావన కల్పించాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా తమ ప్రాంతాన్ని తామే పాలిస్తున్నామనే భావన కల్పించాలి. సైనికుల ఉక్కుపాదంతోనో, ఢిల్లీ ప్రభువుల కనుసన్నల్లోని పాలనా యంత్రాంగంతోనో అది సాధ్యం కాదు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ నుంచి తాజాగా ఓటర్ల జాబితాలో పేర్ల దాకా రకరకాల జిమ్మిక్కులతో పైచేయి కోసం ప్రయత్ని స్తున్న ఏలికలు దొడ్డిదోవ ప్రయత్నాలు మానుకోవాలి. నిజాయతీగా, నిష్పాక్షికంగా, ఎంత త్వరగా కశ్మీర్లో ఎన్నికలు జరిగితే అంత మేలు. కశ్మీర్ సమస్యల పరిష్కారం సినిమాల్లో చూపినంత సులభం కాదు... సినిమాలు చూపినంత సులభం కూడా కాదు. ఆ సంగతి పాలకులకూ తెలుసు! -
అది వేసుకుని వచ్చాడని సినిమా టికెట్ ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్...ఐతే
ఇటీవల చిన్న పెద్ద అంతా బయటకు వస్తే కచ్చితం ఫ్యాంట్ షర్టు లేదా షార్ట్స్ వంటి ఇతర ఫ్యాషెన్ డ్రెస్‌లను ధరంచడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ట్రెండ్ కూడా అదే. ఐతే ఎవరైన సంప్రదాయబద్ధమైన డ్రస్‌లు వేసుకుంటే నోరెళ్లబెట్టడమే కాకుండా రావద్దంటూ నిరాకరిస్తున్నారు. ఏదో చేయరాని నేరం చేసినట్లు చూడటం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక బంగ్లాదేశ్ వ్యక్తి సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినందుకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పించుకుని తగిన గౌరవాన్ని పొందాడు బంగ్లాదేశ్‌లోని సమాన్ అలీ సర్కార్ అనే వృద్ధుడు మల్టీప్లెక్స్ థియేటర్‌కి లుంగీతో వచ్చాడు. అతను బంగ్లదేశ్ రాజధాని సోనీ స్క్వేర్ బ్రాంచ్‌లో ఉన్న మల్టీపెక్స్ థియేటర్లో 'పురాణ్' అనే ప్రముఖ సినిమాను వీక్షించేందుకు వచ్చాడు. ఐతే థియోటర్ వాళ్లు అతని వేషధారణ చూసి సినిమా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం కాస్త సోషల్ మాధ్యమంలో పెద్ద దూమారం రేపింది. దురదృష్టవశాత్తు సదరు మల్టీప్లెక్స్ పై వ్యతిరేక భావన ఏర్పడటమే గాకుండా నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మల్టీప్లెక్స్ థియేటర్ వెంటనే అప్రమత్తమై సరిచేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం జరిగిన దానికి వివరణ ఇస్తూ...సదరు వ్యక్తి సమాన్ అలీని, అతని కుటుంబాన్ని సినిమా చూసేందుకు థియోటర్‌కి ఆహ్వానించడమే కాకుండా వారితో తీసుకన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడొచ్చు అని, థియేటర్‌కి ఇలానే రావాలనే పాలసీ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు రెడీ అయ్యి రావచ్చు అని సదరు థియేటర్ యజమాన్యం వివరణ ఇచ్చుకుంది. (చదవండి: తప్పులు సరిదిద్దుకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా) -
ఐనాక్స్‌ను ప్రారంభించిన ప్రముఖ నటుడు అడవి శేషు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ అగ్రగామి మల్టీప్లెక్స్ ఛెయిన్ ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ నగరంలో తమ నాలుగో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్‌ను ఏర్పాటు చేసింది. కవాడిగూడ మెయిన్ రోడ్‌లోని సత్వా నెక్లెస్ మాల్లో ఏర్పాటైన మల్టీప్లెక్స్‌ను ప్రముఖ నటుడు అడవి శేషు, దర్శకుడు శశికిరణ్ శనివారం ప్రారంభించారు. ఈ మల్టీ ప్లెక్స్‌లో మొత్తం 7స్క్రీన్స్ 1534 సీట్స్ ఉంటాయని ఐనాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అట్మాస్ సరౌండ్ సౌండ్, అడ్వాన్స్డ్ డిజిటల్ ప్రొజెక్షన్, 3డీ వ్యూ వంటి కిడ్స్ ప్లే ఏరియా తదితర ప్రత్యేకతలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారన్నారు. ఈ మల్టీప్లెక్స్‌తో కలిపి నగరంలో తాము 26 స్క్రీన్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. చదవండి: (వాకింగ్‌కు వెళ్లిన.. సినీ నిర్మాత దుర్మరణం) -
ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..!
భారత్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్ బ్రాండ్స్ పీవీఆర్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ సంస్థలు పూర్తిగా వీలినమయ్యాయి. కంపెనీల వీలినాన్ని డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పీవీఆర్ లిమిటెడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐనాక్స్ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. మల్టీప్లెక్స్ సంస్థల్లో ఇరు కంపెనీల వీలినం అతి పెద్ద డీల్‌గా నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీగా పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ అవతరించనుంది. విలీనానంతర సంస్థకు పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లీ ఎండీగా కొనసాగనున్నారు. ఇదే సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఐనాక్స్ గ్రూప్ ఛైర్మన్ పవన్ కుమార్ జైన్ బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, సిద్థార్థ్ జైన్ నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఎక్సేంజీలకు ఇరు సంస్థలు వెల్లడించాయి. వీలినంలో భాగంగా ఐనాక్స్ షేర్ హోల్డర్లందరికీ పీవీఆర్ షేర్లు లభించనున్నాయి. కాగా ఈ వీలినానికి ఎక్సేచేంజ్లు, సెబీ, సీసీఐ నుంచి అనుమతి రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడే సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లోని 181 ప్రాంతాల్లో 871 స్క్రీన్స్ ఉన్నాయి. ఐనాక్స్కు 72 పట్టణాల్లోని 160 ప్రాంతాల్లో 675 తెరలున్నాయి. ఓటీటీ కారణం.. కోవిడ్-19 రాకతో థియేటర్లు భారీ నష్టాలను చవిచూశాయి. థియేటర్లు పూర్తిగా మూసివేయడంతో సినీ నిర్మాతలు అమెజాన్ ప్రైం, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హట్‌స్టార్ వంటి ఓటీటీ సంస్థల తలుపులను తట్టారు. అదే స్థాయిలో ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు భారీ మొత్తంలోనే డబ్బులను చెల్లించాయి. దీంతో థియేటర్ల మనుగడకు భారంగా మారింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. నష్టాలను పూడ్చుకోవడానికి థియేటర్ల యాజమాన్యం ఫంక్షన్ హాల్స్గా మార్చేశారు. ఓటీటీ సంస్థల నుంచి వీపరితమైన పోటీ రావడంతో ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్లు పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి దారి తీసినట్లు తెలుస్తోంది. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..! -
నిబంధనలకు విరుద్ధంగా... మల్టీప్లెక్స్, థియేటర్లలో ధరల బాదుడు
సాక్షి హైదరాబాద్: మల్టీప్లెక్స్, థియేటర్లలో ‘దోపిడీ’ ఆగడం లేదు. ప్యాకేజ్డ్ కమొడిటీస్ చట్టం అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. నిర్దేశించిన ధరలకే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్యాక్ చేసిన కొన్ని వస్తువుల ఎమ్మార్పీపై సైతం బాదేస్తున్నారు. ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. యథేచ్ఛగా దోపిడీ.. ఐఎస్ఐ బ్రాండ్ లీటర్ మంచినీళ్ల ధర బహిరంగ మార్కెట్లో రూ.19. మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ. 25కు అమ్ముతున్నారు. 400 ఎంఎల్ కోకాకోలా ధర రూ.70., ఎగ్‌పఫ్ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్ రూ.160కు విక్రయించడం సర్వసాధారణమైంది. ఇక పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కంబై¯Œన్డ్ అప్‌సైజ్ కపుల్ కాంబోను జీఎస్టీ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ధరల సూచికలో పేర్కొన్న వాటి కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. సంబంధిత నిర్వాహకులను నిలదీస్తే కేవలం ప్యాకేజ్డ్ ఫుడ్ ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని నిబంధన ఉందని, ప్యాకింగ్ లేని ఆహార పదార్థాల విషయంలో నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురిచేస్తోంది. నిబంధనలు ఇలా.. తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎ మ్మార్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. ఇవన్నీ వినియోగదారులుకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్ప టికప్పుడు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎమ్మార్పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉంచాలి. ఎమ్మార్పీ ఉన్న ఫుడ్స్ మాత్రమే విక్రయించాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్ ప్రదర్శించాలి. కేసులకే పరిమితం మల్టీప్లెక్స్, థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీపై కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవన్న తూనికలు, కొలతల శాఖ కేవలం కేసుల నమోదుతో చేతులు దులుపుకొంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు జరిమానా, రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ. 50 వేలు, మూడోసారి రూ. లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. అధికారులు మల్టీప్లెక్స్, థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. -
ఓపెన్ సెసేమ్...
ఎనిమిదిన్నర నెలల పైగా విరామం... వేలాది సినీ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణ... లక్షలాది సినీ ప్రియుల ఆకాంక్ష... ఎట్టకేలకు ఫలిస్తోంది. తెలుగు నేలపై మరో రెండురోజుల్లో... తెలంగాణలో సినిమా హాళ్ళు తెరిచేందుకు మల్టీప్లెక్స్ యజమానులు సిద్ధమవుతున్నారు. క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ లాంటి వాటితో ఈ శుక్రవారం నుంచి మళ్లీ గల్లాపెట్టెలు గలగలలాడాలని ఆశిస్తున్నారు. తెలుగు సినీవ్యాపారంలో సింహభాగమైన నైజామ్ ఏరియాలో, అందులోనూ అతి కీలకమైన హైదరాబాద్‌లో హీరో మహేశ్ బాబు – ఏషియన్ ఫిల్మ్స్ నారంగ్ కుటుంబానికి చెందిన అధునాతన మల్టీప్లెక్స్ ‘ఏ.ఎం.బి. సినిమాస్’ ఈ 4వ తేదీ నుంచి ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో వస్తున్న ‘టెనెట్’తో మళ్లీ ఓపెన్ అవుతోంది. కొత్త తెలుగు సినిమాలేవీ లేకపోవడంతో ప్రస్తుతానికి పాత ఇంగ్లీషు, హిందీ, ప్రాంతీయ భాషా చిత్రాలను ప్రదర్శించనుంది. అయితే, లిమిటెడ్ షోలు మాత్రమే వేయనున్నట్లు ‘ఏ.ఎం.బి’ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే, ఐనాక్స్, పి.వి.ఆర్, సినీప్లెక్స్ లాంటి ఇతర మల్టీప్లెక్సులు సైతం పరిమిత షోలతో తమ హాళ్ళు తెరిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ ప్రయత్నం సఫలమై, జనం నెమ్మదిగా థియేటర్ల దారి పడితే గనక, మార్చి నెల మధ్య నుంచి తెలుగు నేలపై మూసి ఉన్న సినిమా హాళ్ళు నిదానంగా అయినా కళకళలాడతాయి. ఆల్ రెడీ... ఆంధ్రాలో... నిజానికి ఉత్తరాదిన ముంబయ్ లాంటి ప్రాంతాలలోనూ, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ళు పరిమితంగానైనా ఇప్పటికే తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ అన్ లాక్ డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ మధ్య నుంచే సినిమా ప్రదర్శనలకు అనుమతించింది. మొదట తటపటాయించినా, ఆపైన ఎగ్జిబిటర్లు దసరా, దీపావళి టైమ్‌కి ధైర్యం చేశారు. పూర్తిస్థాయిలో కాకపోయినా, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటి కేంద్రాలలో ఇప్పటికే కొన్ని నాన్ ఏ.సి. హాళ్ళు తెరుచుకున్నాయి. హాళ్ళలో సగం సీటింగ్ కెపాసిటీకే ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు పెరిగిన శానిటైజేషన్ ఖర్చులు, కట్టాల్సి వచ్చిన లాక్డౌన్ కరెంట్ బిల్లుల బకాయిలు భయపెడుతున్నాయి. అయినప్పటికీ అలవాటైన వ్యాపారాన్ని వదిలి పోలేక, సొంత థియేటర్ల యజమానులు మాత్రం కష్టం మీదనే హాళ్ళు నడుపుతున్నారు. తెనాలి, చిలకలూరిపేట మొదలు అనేక కేంద్రాలలో కొంతమంది పాతకాలపు రీలు ప్రింట్లతో, కొందరు పెన్ డ్రైవ్‌లతో ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, ‘మనుషులంతా ఒక్కటే’ లాంటి పాత ఎన్టీఆర్ సూపర్ హిట్లను ప్రదర్శిస్తూ, ఆశాజనకంగా వ్యాపారం సాగిస్తుండడం విశేషం. పబ్లిసిటీ అందుబాటులో ఉన్న అలాంటి ఓల్డ్ హిట్ చిత్రాలు ఈ కష్టకాలంలో ఆపద్బాంధవులయ్యాయి. అలాగే, తెరిచిన కొన్ని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కరోనాకు ముందు రిలీజైన లేటెస్ట్ పాత సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి, కరోనా దెబ్బతో ఈ సంవత్సరం దక్కిన అతి కొద్ది హిట్లు – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ ‘భీష్మ’, వగైరా. తక్షణమే కొత్త సినిమాలేవీ రిలీజుకు లేక ఈ పాత హిట్లే తాజాగా ఓపెనైన థియేటర్లకూ, ప్రేక్షకులకూ దిక్కయ్యాయి. షో ఖర్చులు రాకపోయినా, ఒకవేళ ఖర్చులు పోనూ రెండు, మూడు వేల లాభమే వస్తున్నా సొంత థియేటర్లున్నవాళ్ళు రిస్కు చేస్తున్నారు. ప్రేక్షకులు భారీయెత్తున రాకపోయినా, అసలంటూ థియేటర్లకు రావడాన్ని మళ్లీ జనానికి అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ కొద్ది హాళ్ళు నడుస్తుండడం గమనార్హం. జనాన్ని రప్పించడం కోసం... కాగా, ఇప్పుడు తెలంగాణలోనూ హాళ్ళు తెరిచిన వారం తరువాత ఈ డిసెంబర్ 11న ‘కరోనా వైరస్’ సినిమాతో దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ జనం ముందుకు రానున్నారు. లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లోనే తక్కువ రోజుల్లో, అతి తక్కువ యూనిట్‌తో, దాదాపు ఒకే ఇంట్లో, తన శిష్యుడి దర్శకత్వంలో వర్మ నిర్మించిన చిత్రం ఇది. వివిధ భాషల్లో డబ్బింగ్ చేస్తూ, అన్ని పనులూ పూర్తయినా, చాలాకాలంగా రిలీజ్ చేయకుండా వర్మ ఆపిన ఈ చిత్రం ఇప్పుడీ అన్ లాక్డౌన్ వేళ ఎన్ని థియేటర్లలో, ఎంత భారీగా రిలీజవుతుందో చెప్పలేం. అయితే, హాళ్ళు తీయగానే రిలీజైన తొలి చిత్రమనే క్రెడిట్ దక్కించుకొనేలా ఉంది. అదే రోజున హిందీ చిత్రం ‘ఇందూ కీ జవానీ’ రిలీజుకు సిద్ధమవుతోంది. ఆ తరువాత సరిగ్గా రెండు వారాలకు డిసెంబర్ 25వ తేదీ, క్రిస్మస్ నాడు సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తొలి పెద్ద సినిమాగా థియేటర్లలో రానుంది. అయితే, కరోనా అనంతరం సోషల్ డిస్టెన్స్, మాస్కుల న్యూ నార్మల్ ప్రపంచంలో థియేటర్లకు ఏ మేరకు జనం వస్తారు, ఏ సినిమాలు ఏ మేరకు వసూళ్ళు తెస్తాయన్నది ఇప్పటికీ కోట్ల రూపాయల ప్రశ్నే. ఇంట్లో కూర్చొని టీవీలో ఓటీటీ చూడడానికి కొద్ది నెలలుగా అలవాటుపడిపోయిన జనాన్ని ఇంటి నుంచి హాలుకు తీసుకురావడం ఇప్పుడో పెద్ద సవాలు. పేరున్న పెద్ద స్టార్ల సినిమాలు వస్తే కానీ, జనం హాళ్ళకు క్యూలు కట్టేలా లేరు. అలాంటి సినిమాలు రావడానికి కనీసం సంక్రాంతి సీజన్ దాకా ఆగాల్సిందే. అందుకే, కొత్త సినిమా కంటెంట్ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇటీవల ఓటీటీల్లో వచ్చి హిట్టయిన సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి సినిమాలను ఇప్పుడు హాళ్ళలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా ఓటీటీలో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రాన్ని కూడా పరిమితంగానైనా హాళ్ళలోకి తీసుకువద్దామంటే, 60 రోజుల గడువు నిబంధన ఉన్నట్టు సమాచారం. ఆటకు సగటున పాతిక టికెట్లే! మరోవైపు ఇప్పటికే అనేక కష్టనష్టాలతో అల్లాడుతున్న సినిమా వ్యాపారానికి, మరీ ముఖ్యంగా ఎగ్జిబిటర్ సెక్టార్ అయిన సినిమా హాళ్ళకు కరోనా గట్టి దెబ్బే కొట్టింది. ఒక్క హైదరాబాద్‌లోనే బిజీ సెంటర్లలో కనీసం 12 నుంచి 15 పేరున్న సినిమా హాళ్ళు ఇప్పుడు శాశ్వతంగా మూతబడ్డాయి. గోడౌన్లుగా, కల్యాణమండపాలుగా మారిపోయాయి. ఆంధ్ర ప్రాంతంలోనూ ఇదే దుఃస్థితి. పెరిగిన ఖర్చులు, తగ్గిన సీటింగ్ కెపాసిటీ, కరోనా కాలంలో క్యాంటీన్ ఫుడ్ పట్ల జనం అనాసక్తి లాంటి అనేక కారణాల మధ్య అన్ని ప్రాంతీయ భాషా సినీసీమల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. హాళ్ళు తెరిచినా, జనం పెద్దగా రావడం లేదు. తమిళనాట నవంబర్ 10వ తేదీ నుంచే హాళ్ళు తెరవడం మొదలుపెట్టారు. ఇప్పటికి మూడు వారాలు గడిచినా, అక్కడి ప్రసిద్ధ మల్టీప్లెక్సుల్లో ఆటకు సగటున పాతిక టికెట్లే తెగుతుండడం గమనార్హం. సింగిల్ స్క్రీన్లలో కూడా ప్రభుత్వం అనుమతించిన సగం సీటింగ్ కెపాసిటీలో సైతం 20 నుంచి 25 శాతమే నిండుతున్నాయని చెన్నై సినీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సంక్రాంతి సీజన్‌కైనా..? జనం రావాలంటే, పెద్ద తారల సినిమాలు రిలీజవ్వాలి. కానీ, పదుల కోట్ల ఖర్చుతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలను ఈ సగం సీటింగ్ కెపాసిటీ టైములో హాళ్ళలో రిలీజ్ చేస్తే, నిర్మాతలకూ, బయ్యర్లకూ గిట్టుబాటు కాదు. కాబట్టి, తమిళనాట విజయ్ ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాలను రానున్న సంక్రాంతికి సైతం రిలీజ్ చేయకపోవచ్చని టాక్. తెలుగునాట కూడా ఇదే డైలమా నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ రిలీజుల రేసులో పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, రామ్ ‘రెడ్’, రానా ‘అరణ్య’, రవితేజ ‘క్రాక్’, ఆ పైన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, కరోనా సెకండ్ వేవ్, ఈ డిసెంబర్లో హాళ్ళు మరిన్ని తెరిచాక ‘సోలో బ్రతుకు సో బెటర్’ లాంటి చిత్రాలకు వచ్చే జనం స్పందనను బట్టి ఈ రిలీజుల్లో మార్పులు చేర్పులు తప్పేలా లేవు. అందుకే, ఇది ఒక రకంగా పెళ్ళి కుదిరితే కానీ పిచ్చి కుదరదు... పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు లాంటి పరిస్థితి. జనం రావాలంటే పెద్ద సినిమాలు రావాలి. పెద్ద సినిమాలు రిలీజు కావాలంటే, హాళ్ళలో ఫుల్ కెపాసిటీ జనం కావాలి. మరి, కరోనాకు టీకా వచ్చేలోగానే ఈ పరిస్థితి మారేందుకు సినీ వ్యాపారంలో మధ్యంతర మార్గం మరేదైనా దొరుకుతుందేమో చూడాలి. ఇప్పుడు ఎలాగోలా థియేటర్లు ఓపెన్ కావడం మాత్రం ఆ ప్రయత్నంలో ఓ తొలి అడుగు అనుకోవచ్చు. – రెంటాల జయదేవ -
తెలంగాణలో ‘బొమ్మ’ పడుద్ది..
సాక్షి, హైదరాబాద్ : కంటైన్మెంట్ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లను 50% సీటింగ్ సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తెరిచేందుకు కేంద్రం గత అక్టోబర్ 30నే అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తెరవాల్సిన తేదీలను తర్వాత ప్రకటిస్తామని అప్పట్లో పేర్కొంది. తాజాగా వీటికి అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. పాటించాల్సిన నిబంధనలు ఇవే... ►ప్రేక్షకులు, సిబ్బంది సహా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ►ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ►భౌతిక దూరం పాటించాలి ►ప్రతి ఆట తర్వాత శానిటైజ్ చేయాలి. ►24 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ మధ్య ఏసీలను సెట్ చేయాలి. గాలి లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ►వేర్వేరు ఆటలకు సంబంధించిన విరామాలు ఒకే సమయంలో ఉండకుండా ఆటల వేళలను నిర్ణయించాలి. ప్రముఖుల హర్షం.. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వడంపై ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ తాండ్ర ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మూడునాలుగు రోజుల్లో థియేటర్లు ప్రారంభిస్తామని చెప్పారు. -
నేడే చూడండి టికెట్ కేవలం 50 రూపాయిలే
కోవిడ్ వల్ల థియేటర్స్ వైపుకు రావట్లేదు ప్రేక్షకులు. వాళ్లందరూ మళ్లీ థియేటర్స్ బాట పట్టాలంటే ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. మంచి సినిమా ఉండాలి. బంఫర్ ఆఫర్ ఉండాలి. వీటన్నింటినీ కలిపి ఇవ్వడానికి ప్లాన్ సిద్ధం చేశాయి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, పలు మల్టీప్లెక్స్ చైన్లు. ఆ విశేషాలు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలోకి వచ్చి 50 ఏళ్లయింది. యాభై ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన, సంచలనమైన సినిమాలను అందిస్తూ వస్తోంది. 50ఏళ్ల ప్రయాణం సందర్భంగా పలు భారీ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఓ కొత్త ఆలోచనతో యశ్‌రాజ్ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లుగా తమ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ఏదైనా ఇవ్వాలనుకుంది. తమ సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ఆనందించేలా చేయాలనుకుంది. కోవిడ్ వల్ల మర్చిపోయిన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను తిరిగి రుచి చూపించాలనుకుంది. అది కూడా తక్కువ ధరకే. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన సూపర్ హిట్ సినిమాల్లో కొన్నింటిని దీపావళి సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 12 నుంచి 19 వరకూ ఈ సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్ ధర జస్ట్ 50 రూపాయిలే. మరి.. ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కు తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలి. రండీ.. ఆనందించండీ ‘సినిమా విడుదలకు మంచి సీజన్ దీపావళి. పండగకి సినిమాను ఆనందించడం సినీ ప్రేమికులకు ఇష్టమైన ఆనవాయితీ. యశ్‌రాజ్ సంస్థ ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాలను మళ్లీ పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే వీలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్ ప్రతినిధులు. ప్రదర్శితం కానున్న చిత్రాలు యశ్‌రాజ్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో పాటు కభీ కభీ, సిల్సిలా, దిల్ తో పాగల్ హై, వీర్ జరా, బంటీ ఔర్ బబ్లీ, రబ్నే బనాదీ జోడీ, ఏక్‌థా టైగర్, బ్యాండ్ బాజా భారాత్, సుల్తాన్, వార్, మర్దానీ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. -
మల్టీ దోపిడీ!
మల్టీప్లెక్స్‌లలో ధరల మాయాజాలం నడుస్తోంది. రొటీన్‌కు భిన్నంగా సినీ‘మాల్స్’లో మూవీ చూద్దామని వెళ్తున్న ప్రేక్షకుల జేబులకు చిల్లు పడుతోంది. టిక్కెట్ ధరల నుంచి పార్కింగ్..తినుబండారాల ధరలు ప్రేక్షకులను గడగడలాడిస్తున్నాయి. ‘బాబోయ్...మరోసారి ఇక్కడికి రావొద్దు..’అనే స్థాయికి తీసుకువస్తున్నాయి. ఒక్కో వస్తువు ధర బయటి ధరల కంటే పది..ఇరవై రెట్లు ఎక్కువగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. పది రూపాయల పాప్‌కార్న్ ధర రూ.215 ఉందంటే పరిస్థితి ఏ రీతిన ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ధరలు నియంత్రించాల్సిన అధికారగణం నిర్లక్ష్యం వహిస్తోందని సగటు ప్రేక్షకుడు ఆరోపిస్తున్నాడు. గ్రేటర్‌లోని పీవీఆర్..బిగ్ సినిమాస్.. ఐనాక్స్.. ఐమాక్స్.. ఇలా అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ ధరల దోపిడీ కొనసాగుతోంది. – బంజారాహిల్స్ -సీన్ వన్... యూసుఫ్‌గూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నం.2లోని మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్లాడు. సినిమా విరామ సమయంలో పిల్లలకు పాప్‌కార్న్ తెద్దామని ఫుడ్ కోర్టుకు వచ్చాడు. పావుకిలో బరువున్న పాప్‌కార్న్ ధర రూ.215 అని చెప్పడంతో నివ్వెరపోయాడు. అంతేకాకుండా అర లీటర్ వాటర్ బాటిల్ రూ.50, రెండు సమోసాలకు రూ.100 ధర ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. చేసేదేమీ లేక వాటిని కొనుగోలు చేశాడు. బయట రూ.10 మాత్రమే విలువ చేసే పాప్‌కార్న్‌ను ఏకంగా రూ. 215కు అమ్మడం ఏంటో అర్థం కాక నిట్టూరుస్తూ వచ్చి సీట్లో కూర్చున్నాడు. -సీన్ టు.. బేగంపేటకు చెందిన యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి నెక్లెస్‌రోడ్‌లో మల్టీప్లెక్స్ థియేటర్‌కు వచ్చాడు. వెజ్బర్గర్ కోసం రూ.160 సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక కూల్ డ్రింక్స్ ఒక్కోదానికి రూ. 210 ఖర్చుచేయాల్సి వచ్చింది. సినిమా చూసిన ఆనందం కంటే జేబుకు పడ్డ చిల్లును చూసి ఉసూరుమంటూ బయటకు వచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో యథేచ్ఛగా ప్రేక్షకులను దోచుకుంటున్నారు. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నం 2లోని ఆర్కే సినీప్లెక్స్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, పాప్‌కార్న్ పేరుతో ప్రేక్షకులను అడ్డంగా దోచుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్, బంజారాహిల్స్ రోడ్ నం.1లోని జీవీకే మాల్లోని ఐనాక్స్, పంజగుట్ట హైదరాబాద్ సెంట్రల్‌లోని పీవీఆర్ సినిమాస్, అమీర్‌పేటలోని బిగ్ సినిమాస్, కూకట్‌పల్లిలోని సుజనా ఫోరమ్ మాల్, కాచిగూడలోని బిగ్ సినిమాస్.. ఇలా ఎక్కడ చూసినా దోపిడీ కొనసాగుతూనే ఉంది. రూ.10కి దొరికే పాప్‌కార్న్‌ను ఆకర్షణీయమైన ప్యాక్‌లో వేసి రూ.215కు అమ్ముతున్నారు. ఇక ఇరానీ హోటల్లో రూ.10కి ఒకటి చొప్పున దొరికే సమోసాలకు ఏ మాత్రం తీసిపోకుండా అందమైన బాక్సుల్లో పెట్టి రూ.50కి అమ్మడం మల్టీప్లెక్స్ నిర్వాహకులకే చెల్లింది. అంతా మా ఇష్టం... ఏదైనా వస్తువు కానీ తినుబం«డారాలు కానీ తయారు చేసి వాటిని విక్రయించేందుకు ఎమ్మార్పీని నిర్ణయిస్తారు. ఆ వస్తువు నాణ్యత, ముడి పదార్థాల విలువకు కొంతమేర లాభాన్ని జోడించి ఎమ్మార్పీ నిర్ణయిస్తారు. అయితే మల్టీప్లెక్స్‌ల్లో వీటిని నిర్ణయించే తీరు మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉదాహరణకు ఆలుగడ్డ, మైదాపిండి తదితర వస్తువులతో తయారు చేసే సమోసాను సుమారు రూ.10 నుంచి రూ.15 ఖర్చుతో తయారు చేçస్తుంటారు. ఈ సమోసాలను ఏకంగా రూ.50కి అమ్మడం ఎంతవరకు సమంజసం అని సాధారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నామమాత్రపు దాడులు.. ప్రేక్షకులను నిలువుదోపిడీ చేస్తున్నా...నిలువరించే అధికారం తమకు లేదని తూనికలు కొలతల శాఖ చేతులెత్తేస్తోంది. అడ్డగోలుగా రేట్లను నిర్ణయించి అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు లేకుండాపోయింది. కేవలం ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించినపుడు, లేదా కొలతల్లో వ్యత్యాసం ఉంటేనే తాము దాడులు చేయగలమని వారు అంటున్నారు. అప్పుడప్పుడు దాడులు నిర్వహించి జరిమానాలు విధించడం, నోటీసులు జారీ చేయడం మినహా గట్టి చర్యలు తీసుకునే అధికారం ఈ శాఖకు లేదని మాల్స్ నిర్వాహకులకు తెలియడంతో వారి ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ‘సేల్స్ సెలెక్టివ్ చానెల్ ఓన్లీ’ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకుని సొంతంగా ఎమ్మార్పీలు నిర్ణయించుకుని అధిక ధరలకు అమ్ముకునే వీలు ఉండడంతో.. బయట రూ.20కి దొరికే వాటర్ బాటిల్ మాల్స్, మల్టీ ప్లెక్స్‌లు, ఎయిర్‌పోర్టులు, స్టార్ హోటళ్లు తదితర ప్రాంతాల్లో రూ.60గా ప్రింట్ చేసుకుని అమ్మేస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు కూడా నమోదు చేశారు. ఓ రెస్టారెంట్లో రూ. 20 ఉన్న వాటర్ బాటిల్‌ను రూ. 9 అధికంగా అమ్మిన నిర్వాహకుడిపై మాదాపూర్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో అధిక ధరకు వాటర్ బాటిల్ అమ్మినందుకు రూ. 20 వేల జరిమానా విధించారు. అలాగే మలీప్లెక్సుల్లో విక్రయాలపై కూడా నియంత్రణ ఉండాలని, సరైన ధరలకే అమ్మేలా చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు. వామ్మో ఇవేం ధరలు.. ఆర్కే సినీప్లెక్స్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో రేట్లు ఇలా ఉన్నాయి.. అరలీటర్ వాటర్ బాటిల్ = రూ. 50 అరలీటర్ పెప్సీ గ్లాస్ = రూ. 210 రెండు సమోసాలు = రూ. 100 పాప్‌కార్న్ రెగ్యులర్ = రూ. 230 కోల్డ్ కాఫీ = రూ. 130 టీ = రూ. 130 వెజ్ బర్గర్ = రూ. 160 చికెన్ బర్గర్ = రూ. 170 పన్నీర్ టిక్కా = రూ. 160 స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం... ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకునే అధికారం మాకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రోడ్డుపక్కన బడ్డీకొట్టు నుంచి స్టార్ హోటల్లోని రెస్టారెంట్ వరకు ఒకేధరకు ప్యాక్డ్ వస్తువులు విక్రయించేలా చట్టంలో సవరణ అమల్లోకి రానుంది. ఆ తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది. – భాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ -
సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం!
-
సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం!
∙మా వాళ్లని తెలిసి కూడా ఇలా చేస్తారా? ∙మీకు ఇతర వ్యాపారాలున్నాయని గుర్తుంచుకోండి.. ∙డిస్ట్రిబ్యూటర్లకు కృష్ణా జిల్లా టీడీపీ కీలక నేత హెచ్చరిక ∙మల్టీప్లెక్స్‌లకు సినిమాల నిలిపివేతపై ఆగ్రహం ∙కలెక్షన్ల వాటాల వివాదంలో చినబాబు జోక్యం ∙రాజకీయ దౌర్జన్యంపై డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన సాక్షి, అమరావతి బ్యూరో: ‘మా వాళ్లని తెలిసి కూడా మల్టీప్లెక్స్‌లకు సినిమాలు ఇవ్వరా?.. కలెక్షన్లలో వాటాల వివాదం తరువాత చూసుకుందాం. ముందు సినిమాలు ఇవ్వండి. మీకు ఇతర వ్యాపారాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. వాటి సంగతి తేలుస్తాం’ ఇదీ కృష్ణాజిల్లాకు చెందిన ఓ కీలక నేత డిస్ట్రిబ్యూటర్లకు చేసిన హెచ్చరిక. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సినీ డిస్ట్రిబ్యూటర్లపై టీడీపీ పెద్దల వేధింపుల పరంపర కొనసాగుతోంది. మల్టీప్లెక్స్‌ల సినిమా కలెక్షన్లలో న్యాయమైన వాటా కోసం డిమాండు చేయడమే ఇందుకు కారణం. తెలంగాణలో మాదిరిగా కలెక్షన్లలో 55 శాతం వాటా ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. కనీసం విశాఖపట్నంలో తాజాగా అంగీకరించిన విధంగా 53 శాతమైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే చినబాబు అండదండలు పుష్కలంగా ఉన్న మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్ల డిమాండును తిరస్కరిస్తున్నాయి. ఈ పరిణామాలతో మల్టీప్లెక్స్‌లలో సినిమాల ప్రదర్శనను డిస్ట్రిబ్యూటర్లు కొన్నిరోజులుగా నిలిపివేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఏం చేసైనా సరే డిస్ట్రిబ్యూటర్ల మెడలు వంచు.. మల్టీప్లెక్స్‌లలో తెలుగు సినిమాల ప్రదర్శనను డిస్ట్రిబ్యూటర్లు నిలిపివేయడం చినబాబు దృష్టికి వెళ్లింది. ఇప్పటికే నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన ‘ఇజం’, కార్తీ నటించిన ‘కాషో్మరా’ తదితర సినిమాలు మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించడం లేదు. సుమంత్ నటించిన ‘నరుడా... డోనరుడా’తోపాటు కొన్ని సినిమాలు శుక్రవారం విడుదల కానున్నాయి. నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’, అల్లరి నరేష్ నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా యువత మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేందుకు ఇష్టపడే సినిమాలే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సినిమాలు ప్రదర్శించలేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు చినబాబు వద్ద ఆందోళన చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన కృష్ణా జిల్లాలో కీలక ప్రజాప్రతినిధితో మాట్లాడారు. ఏంచేసైనా సరే డిస్ట్రిబ్యూటర్ల మెడలు వంచాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. ఫిలిం చాంబర్, డిస్ట్రిబ్యూషన్ అసోషియేషన్లకు చెందిన ముగ్గురు ప్రతినిధులను పిలిపించారు. ‘ఏం మల్టీప్లెక్స్‌లకు సినిమాలు ఇవ్వరా!.. కలెక్షన్లలో వాటాల పంపకం సంగతి తరువాత మాట్లాడదాం. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలు మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ కావాల్సిందే. మీకు ఇతర వ్యాపారాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి’అని హెచ్చరించారు. చాంబర్ ప్రతినిధులు తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ పెద్దల పెత్తనం ఏమిటి? సినిమా రంగానికి సంబంధించిన వివాదంలో అధికార పార్టీ పెద్దల జోక్యంపై డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏపీ ఫిలిం చాంబర్, దక్షిణ భారత ఫిలిం చాంబర్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) తదితర వేదికలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని నియంత్రించాలని భావించడం సమంజసం కాదని స్పష్టం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి సామరస్యంగా ప్రయత్నించకుండా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం సినీ పరిశ్రమకు హాని చేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.