కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సినీ డిస్ట్రిబ్యూటర్లపై టీడీపీ పెద్దల వేధింపుల పరంపర కొనసాగుతోంది. మల్టీప్లెక్స్‌ల సినిమా కలెక్షన్లలో న్యాయమైన వాటా కోసం డిమాండు చేయడమే ఇందుకు కారణం. తెలంగాణలో మాదిరిగా కలెక్షన్లలో 55 శాతం వాటా ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. కనీసం విశాఖపట్నంలో తాజాగా అంగీకరించిన విధంగా 53 శాతమైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే చినబాబు అండదండలు పుష్కలంగా ఉన్న మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్ల డిమాండును తిరస్కరిస్తున్నాయి. ఈ పరిణామాలతో మల్టీప్లెక్స్‌లలో సినిమాల ప్రదర్శనను డిస్ట్రిబ్యూటర్లు కొన్నిరోజులుగా నిలిపివేసిన విషయం చర్చనీయాంశంగా మారింది.