Film distributors
-
మంత్రి పేర్ని నానితో సమావేశమైన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు
-
సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ
-
సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ
సాక్షి, విజయవాడ: సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. ఆన్లైన్ టికెట్ విధానం, సినిమాటోగ్రఫీ చట్టంలోని సవరణలపై చర్చ జరిపారు. అన్ని సినిమాలపై టికెట్ ధర ఒకే విధంగా ఉండేలా కొత్త విధానం, థియేటర్ల సమస్యలపైన సమావేశంలో చర్చించారు. ఆన్లైన్ టికెట్ విధానానికి అందరూ అంగీకారం: అంబికా కృష్ణ ఆన్లైన్ టికెట్ విధానానికి అందరూ అంగీకరించారని అంబికా కృష్ణ తెలిపారు. చిన్న ఊర్లలోని థియేటర్లలో గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాలని థియేటర్ యజమానులకు మంత్రి పేర్ని నాని సూచించారని ఆయన తెలిపారు చదవండి: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ -
ఈ 27 నుంచి కొత్త సినిమాలు రావా?
మార్చి 27 నుంచి తమిళనాడులో కొత్త సినిమాలను పంపిణీ చేయబోమని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ పేర్కొంది. సినిమా పంపిణీపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10 శాతం టీడీయస్ పన్నుని విధించింది. ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఆల్రెడీ సినిమా టికెట్ మీద 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది ప్రభుత్వం. దానికి తోడు ఇటీవలే 8 శాతం లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ టాక్స్ కట్టాలని ఆదేశించింది. దీంతో సినిమా చూసేవాళ్ల సంఖ్య క్రమేణా తగ్గిపోతుంది’’ అని పంపిణీదారుల సంఘం పేర్కొంది. 8 శాతం పన్ను విధింపును మరోసారి ఆలోచించి, నిషేధించాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ఈ 10 శాతం పన్ను జోడించడంతో మార్చి 27 నుంచి కొత్త సినిమాలు పంపిణీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. గవర్నమెంట్ ఈ పన్నుని తొలగించే వరకూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. -
కొత్త బొమ్మ పడినా.. చూసే జనాలేరి?
పెద్ద నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బగానే మారింది. గత మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో సినీ పరిశ్రమ బిత్తరపోయింది. ఆనవాయితీగా ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలో సందిగ్ధంలో పడే పరిస్థితి నెలకొంది. ఎలాగోలా అనుకున్న ప్రకారం కొన్ని సినిమాలు శుక్రవారం విడుదలైనా వాటిని పట్టించుకునే ప్రేక్షకుడే కరువయ్యాడు. శుక్రవారంనాడు స్టార్ హీరో సినిమా విడుదల అనగానే థియేటర్ల వద్ద భారీ కోలాహలం ఉంటుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ శుక్రవారం దేశంలోని అన్నీ భాషల్లో సినిమాలు విడుదలైనా.. గతంలో కనిపించేంత సందడి ఇప్పుడు లేదని, చాలాచోట్ల సినిమాలు చూసేవారు కరువయ్యారని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్ల జనం లేకపోవడంతో థియేటర్ల షోలు వేయాలా? వద్దా? అన్న దుస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దు వల్ల దాదాపు తెలుగురాష్ట్రాల్లో శుక్రవారం విడుదలైన సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడిందని అంటున్నారు. ఇక బెంగళూరులో అయితే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్ల వైపు వచ్చే జనమే లేకపోవడంతో అవి ఈగలను తోలుకుంటున్నాయి. షోలు వేసేందుకు తగిన టికెట్ మనీ కూడా రాకపోతుండటంతో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. -
సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం!
-
సినిమాలివ్వకుంటే సంగతి తేలుస్తాం!
∙మా వాళ్లని తెలిసి కూడా ఇలా చేస్తారా? ∙మీకు ఇతర వ్యాపారాలున్నాయని గుర్తుంచుకోండి.. ∙డిస్ట్రిబ్యూటర్లకు కృష్ణా జిల్లా టీడీపీ కీలక నేత హెచ్చరిక ∙మల్టీప్లెక్స్‌లకు సినిమాల నిలిపివేతపై ఆగ్రహం ∙కలెక్షన్ల వాటాల వివాదంలో చినబాబు జోక్యం ∙రాజకీయ దౌర్జన్యంపై డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన సాక్షి, అమరావతి బ్యూరో: ‘మా వాళ్లని తెలిసి కూడా మల్టీప్లెక్స్‌లకు సినిమాలు ఇవ్వరా?.. కలెక్షన్లలో వాటాల వివాదం తరువాత చూసుకుందాం. ముందు సినిమాలు ఇవ్వండి. మీకు ఇతర వ్యాపారాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. వాటి సంగతి తేలుస్తాం’ ఇదీ కృష్ణాజిల్లాకు చెందిన ఓ కీలక నేత డిస్ట్రిబ్యూటర్లకు చేసిన హెచ్చరిక. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సినీ డిస్ట్రిబ్యూటర్లపై టీడీపీ పెద్దల వేధింపుల పరంపర కొనసాగుతోంది. మల్టీప్లెక్స్‌ల సినిమా కలెక్షన్లలో న్యాయమైన వాటా కోసం డిమాండు చేయడమే ఇందుకు కారణం. తెలంగాణలో మాదిరిగా కలెక్షన్లలో 55 శాతం వాటా ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. కనీసం విశాఖపట్నంలో తాజాగా అంగీకరించిన విధంగా 53 శాతమైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే చినబాబు అండదండలు పుష్కలంగా ఉన్న మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్ల డిమాండును తిరస్కరిస్తున్నాయి. ఈ పరిణామాలతో మల్టీప్లెక్స్‌లలో సినిమాల ప్రదర్శనను డిస్ట్రిబ్యూటర్లు కొన్నిరోజులుగా నిలిపివేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఏం చేసైనా సరే డిస్ట్రిబ్యూటర్ల మెడలు వంచు.. మల్టీప్లెక్స్‌లలో తెలుగు సినిమాల ప్రదర్శనను డిస్ట్రిబ్యూటర్లు నిలిపివేయడం చినబాబు దృష్టికి వెళ్లింది. ఇప్పటికే నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన ‘ఇజం’, కార్తీ నటించిన ‘కాషో్మరా’ తదితర సినిమాలు మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించడం లేదు. సుమంత్ నటించిన ‘నరుడా... డోనరుడా’తోపాటు కొన్ని సినిమాలు శుక్రవారం విడుదల కానున్నాయి. నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’, అల్లరి నరేష్ నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా యువత మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేందుకు ఇష్టపడే సినిమాలే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సినిమాలు ప్రదర్శించలేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు చినబాబు వద్ద ఆందోళన చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన కృష్ణా జిల్లాలో కీలక ప్రజాప్రతినిధితో మాట్లాడారు. ఏంచేసైనా సరే డిస్ట్రిబ్యూటర్ల మెడలు వంచాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. ఫిలిం చాంబర్, డిస్ట్రిబ్యూషన్ అసోషియేషన్లకు చెందిన ముగ్గురు ప్రతినిధులను పిలిపించారు. ‘ఏం మల్టీప్లెక్స్‌లకు సినిమాలు ఇవ్వరా!.. కలెక్షన్లలో వాటాల పంపకం సంగతి తరువాత మాట్లాడదాం. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలు మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ కావాల్సిందే. మీకు ఇతర వ్యాపారాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి’అని హెచ్చరించారు. చాంబర్ ప్రతినిధులు తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ పెద్దల పెత్తనం ఏమిటి? సినిమా రంగానికి సంబంధించిన వివాదంలో అధికార పార్టీ పెద్దల జోక్యంపై డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏపీ ఫిలిం చాంబర్, దక్షిణ భారత ఫిలిం చాంబర్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) తదితర వేదికలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని నియంత్రించాలని భావించడం సమంజసం కాదని స్పష్టం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి సామరస్యంగా ప్రయత్నించకుండా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం సినీ పరిశ్రమకు హాని చేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘లింగా’ సమస్య మళ్లీ మొదటికి?
చెన్నై : కొలిక్కి వచ్చిందనుకున్న లింగా చిత్ర సమస్య మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. రజనీకాంత్ లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టపరిహారంగా రూ.10కోట్లు చెల్లించడానికి ముందుకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ డబ్బును నష్టపోయిన వారికి అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లింగా చిత్ర చెంగల్పట్టు ఏరియా డిస్ట్రిబ్యూటర్ మన్నన్, ఉత్తర, దక్షిణ ఆర్కాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ క్రిష్ణమూర్తి, నెల్లై ఏరియా డిస్ట్రిబ్యూటర్ రూపన్ సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్రానికిగానూ చెంగల్పట్టు ఏరియాకు ఏడున్నర కోట్లు, ఆర్కాడు ఏరియాకు నాలుగు కోట్లు, నెల్లై ఏరియాకు రెండున్నర కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని తెలిపా రు. మొదట్లో నష్టపరిహారం చెల్లించాలంటూ బయ్యర్లు గగ్గోలు పెట్టి, ఇప్పుడు కట్ట పంచాయితీ చేస్తున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్లతో చర్చించకుండా తిరుపూర్ సుబ్రమణియన్ ఏకపక్ష నిర్ణయాలతో కట్ట పంచాయితీ చేయరాదని సూచించారు. ఇంతకు ముందు రజనీ నటించిన పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఆయన కోట్ల రూపాయలు లాభాలు సంపాదించారని తెలిపా రు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లింగా చిత్ర నష్టాల్ని డిస్ట్రిబ్యూటర్లు భరించాలనడం ఎంతమాత్రమూ సమంజసం కాదని పేర్కొన్నారు. నష్టపరిహారాన్ని సక్రమం గా పంచాలని, లేని పక్షంలో మళ్లీ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు.