ఈ 27 నుంచి కొత్త సినిమాలు రావా? | No new films will release in Tamil Nadu from March 27 | Sakshi
Sakshi News home page

ఈ 27 నుంచి కొత్త సినిమాలు రావా?

Published Thu, Mar 12 2020 6:05 AM | Last Updated on Thu, Mar 12 2020 6:05 AM

No new films will release in Tamil Nadu from March 27  - Sakshi

మార్చి 27 నుంచి తమిళనాడులో కొత్త సినిమాలను పంపిణీ చేయబోమని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. సినిమా పంపిణీపై  ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10 శాతం టీడీయస్‌ పన్నుని విధించింది. ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఆల్రెడీ సినిమా టికెట్‌ మీద 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది ప్రభుత్వం. దానికి తోడు ఇటీవలే 8 శాతం లోకల్‌ బాడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌ కట్టాలని ఆదేశించింది. దీంతో సినిమా చూసేవాళ్ల సంఖ్య క్రమేణా తగ్గిపోతుంది’’ అని పంపిణీదారుల సంఘం పేర్కొంది. 8 శాతం పన్ను విధింపును మరోసారి ఆలోచించి, నిషేధించాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ఈ 10 శాతం పన్ను జోడించడంతో మార్చి 27 నుంచి కొత్త సినిమాలు పంపిణీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. గవర్నమెంట్‌ ఈ పన్నుని తొలగించే వరకూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement