New cinema
-
6 కోట్లు ఇస్తేనే ఆటోగ్రాఫ్ అట్లుంటది డీజే టిలుతో
-
రవితేజ సినిమాల జాతర.. ప్రభాస్, మహేష్ ఉన్నా తగ్గేదేలే
-
భారీ స్థాయిలో మరో రామాయణం సీతగా సాయి పల్లవి.. రాముడు ఎవరంటే?
-
ఈ 27 నుంచి కొత్త సినిమాలు రావా?
మార్చి 27 నుంచి తమిళనాడులో కొత్త సినిమాలను పంపిణీ చేయబోమని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ పేర్కొంది. సినిమా పంపిణీపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10 శాతం టీడీయస్ పన్నుని విధించింది. ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఆల్రెడీ సినిమా టికెట్ మీద 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది ప్రభుత్వం. దానికి తోడు ఇటీవలే 8 శాతం లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ టాక్స్ కట్టాలని ఆదేశించింది. దీంతో సినిమా చూసేవాళ్ల సంఖ్య క్రమేణా తగ్గిపోతుంది’’ అని పంపిణీదారుల సంఘం పేర్కొంది. 8 శాతం పన్ను విధింపును మరోసారి ఆలోచించి, నిషేధించాలంటూ ఇటీవలే ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ఈ 10 శాతం పన్ను జోడించడంతో మార్చి 27 నుంచి కొత్త సినిమాలు పంపిణీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. గవర్నమెంట్ ఈ పన్నుని తొలగించే వరకూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. -
ఈ శుక్రవారం కామెడీదా.. హర్రర్దా?
శుక్రవారం రాగానే సినీ ప్రియులకు గుర్తొచ్చేది కొత్త సినిమా. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా రిలీజ్ మాత్రం దాదాపుగా శుక్రవారమే. ఫ్రై డే అంటేనే ఫిల్మీ డే. తాజాగా ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు ధియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకటి చానాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న యంగ్ హీరో అల్లరి నరేష్ చిత్రం 'సెల్ఫీ రాజా' కాగా, రెండవది చెన్నై చిన్నది త్రిష నటించిన ద్విభాషా చిత్రం 'నాయకి'. 'సెల్ఫీ రాజా'గా అల్లరి నరేష్ తనకలవాటైన కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, త్రిష 'నాయకి'గా భయపెట్టేందుకు 'వన్ ఉమన్ షో'కి సిద్ధమైంది. ఈ సినిమాలు సక్సెస్ టాక్ తెచ్చుకోవడం అటు అల్లరి నరేష్‌కి, ఇటు త్రిష కెరీర్‌కి కూడా చాలా ముఖ్యం. మరి తెలుగు ప్రేక్షకులు కామెడీకి కమిట్ అవుతారో లేక భయానికి భళా అంటారో తెలియాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ రెండు సినిమాల కలెక్షన్లకు ఈ వారం కీలకం కానుంది. ఎందుకంటే వచ్చే వారం సూపర్ స్టార్ రజనీ 'కబాలి' ధియేటర్లపై దాడి చేయనుంది.