ఈ శుక్రవారం కామెడీదా.. హర్రర్దా? | Comedy And Horror To Battle This Friday | Sakshi
Sakshi News home page

ఈ శుక్రవారం కామెడీదా.. హర్రర్దా?

Published Thu, Jul 14 2016 7:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

ఈ శుక్రవారం కామెడీదా.. హర్రర్దా?

ఈ శుక్రవారం కామెడీదా.. హర్రర్దా?

శుక్రవారం రాగానే సినీ ప్రియులకు గుర్తొచ్చేది కొత్త సినిమా. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా రిలీజ్ మాత్రం దాదాపుగా శుక్రవారమే. ఫ్రై డే అంటేనే ఫిల్మీ డే. తాజాగా ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు ధియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకటి చానాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న యంగ్ హీరో అల్లరి నరేష్ చిత్రం 'సెల్ఫీ రాజా' కాగా, రెండవది చెన్నై చిన్నది త్రిష నటించిన ద్విభాషా చిత్రం 'నాయకి'.

'సెల్ఫీ రాజా'గా అల్లరి నరేష్ తనకలవాటైన కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, త్రిష 'నాయకి'గా భయపెట్టేందుకు 'వన్ ఉమన్ షో'కి సిద్ధమైంది. ఈ సినిమాలు సక్సెస్ టాక్ తెచ్చుకోవడం అటు అల్లరి నరేష్కి, ఇటు త్రిష కెరీర్కి కూడా చాలా ముఖ్యం. మరి తెలుగు ప్రేక్షకులు కామెడీకి కమిట్ అవుతారో లేక భయానికి భళా అంటారో తెలియాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ రెండు సినిమాల కలెక్షన్లకు ఈ వారం కీలకం కానుంది. ఎందుకంటే వచ్చే వారం సూపర్ స్టార్ రజనీ 'కబాలి' ధియేటర్లపై దాడి చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement