selfie raja
-
సెల్ఫీ రాజా మూవీ రివ్యూ
టైటిల్ : సెల్ఫీ రాజా జానర్ : కామెడీ ఎంటర్ టైనర్ తారాగణం : అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్నా రనౌత్ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి నిర్మాత : చలసాని రాంబ్రహ్మం చౌదరి కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో విఫలమవుతూ వస్తున్న యంగ్ హీరో అల్లరి నరేష్ ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి తన మార్క్ రెగ్యులర్ కామెడీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న జి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మరోసారి స్ఫూఫ్ కామెడీతో సెల్పీరాజా సినిమా చేశాడు. మరి నరేష్ చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది. మినిమమ్ గ్యారెంటీ హీరో ట్యాగ్ కి దూరమవుతున్న ఈ యంగ్ హీరో తిరిగి ఆకట్టుకున్నాడా.. కథ : సెల్పీరాజా (అల్లరి నరేష్) సరదాగా టైం పాస్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సిటీ కమిషనర్ కూతురు (కామ్న రనౌత్)ని లవ్ లో పడేసి పెళ్లి చేసుకుంటాడు. అయితే తన నోటి దురుసు వల్ల సమస్యలను కొని తెచ్చుకోవటం ఈ సెల్పీ రాజాకు అలవాటు. అదే నోటి దురుసుతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి దూరమవుతాడు. భార్య వెళ్లిపోవటంతో కృంగిపోయిన సెల్ఫీరాజా చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. తనని కాల్చి చంపమని ఓ క్రిమినల్ (రవిబాబు)తో ఒప్పందం చేసుకుంటాడు. కానీ ఆ క్రిమినల్ సెల్ఫీ రాజాను చంపకుండా మరో ప్లాన్ చేస్తాడు. ఇంతకీ ఆ క్రిమినల్ ప్లాన్ ఏంటి.? చివరకు సెల్ఫీరాజా కథ ఏమయ్యింది అన్నదే మిగతా కథ. నటీనటులు : కొంత కాలంగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న నరేష్.. ఈసారి అలాంటి రిస్క్ ఏదీ చేయకుండా తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నంలో నరేష్ వందశాతం సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా స్ఫూఫ్ కామెడీలలో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక తొలి సినిమానే అయినా కామ్న రనౌత్ మంచి నటన కనబరిచింది. 30 ఇయర్స్ పృథ్వి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. సాక్షి చౌదరి, రవిబాబులతో పాటు ఇతర కమెడియన్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : తొలి భాగాన్ని పర్ఫెక్ట్ కామెడీతో ఇంట్రస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఈశ్వర్ రెడ్డి, రెండోభాగం విషయంలో మాత్రం ఆ పట్టు కోల్పోయినట్టు అనిపించింది. వరుసగా కొత్త పాత్రలను పరిచయం చేస్తూ కథ సాగటంతో కథనంలో వేగం తగ్గింది. సాయి కార్తీక్ సంగీతం బాగానే ఉన్న సినిమా ఫ్లోలోకు ఇబ్బంది కరంగా మారాయి. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అల్లరి నరేష్ 30 ఇయర్స్ పృథ్వి క్లైమాక్స్ కామెడీ మైనస్ పాయింట్స్ : రోటీన్ స్ఫూఫ్ కామెడీ సెకండ్ హాఫ్ సాంగ్స్ ఓవరాల్‌గా సెల్ఫీ రాజా అల్లరి నరేష్ మార్క్ స్పూఫ్ కామెడీ -
తమిళ చిత్రంలో అల్లరి నరేష్
యువతరం హీరోల్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో అల్లరి నరేష్. ఈ మధ్య కాస్త తడబడి స్లో అయ్యాడు కానీ లేదంటే ఈ అల్లరోడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం సెల్పీరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టాల్ స్టార్ త్వరలో ఓ స్ట్రయిట్ తమిళ సినిమా చేయడానికి అంగకీరించాడు. ఇప్పటికే కురుంబు, పొరలి లాంటి తమిళ సినిమాల్లో నటించిన నరేష్ మరోసారి తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కిన శంభో శివ శంభో సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సముద్రఖని, ఈ అల్లరోడితో మరోసారి తమిళ సినిమా చేయించాలని డిసైడ్ అయ్యాడు. స్టార్ ఇమేజ్‌కు దూరంగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్ర కావటంతో నరేష్ కూడా వెంటనే అంగకీరించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా ఈ శుక్రవారం రిలీజ్ కాగా మరో రెండు తెలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న మా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాలో నటిస్తున్నాడు నరేష్. ఈ సినిమా తరువాత ప్రముఖ నటుడు కృష్ణభగవాన్ కథా కథనాలు అందిస్తున్న మేడ మీద అబ్బాయి సినిమా పటాలెక్కనుంది. -
'సెల్ఫీ రాజా' రివ్యూ
సినిమా : సెల్ఫీ రాజా జానర్ : కామెడీ ఎంటర్టెయినర్ నటీనటులు : అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్నా సింగ్ రనావత్, కృష్ణ భగవాన్, రవిబాబు, పృధ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ : ఎస్.లోకనాథన్ మాటలు : డైమండ్ రత్నం నిర్మాత : చలసాని రామబ్రహ్మం చౌదరి కథ, దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి సినిమాల్లో కాలం చెల్లని కాన్సెప్ట్ 'కామెడీ'. అలాంటి ఎవర్ గ్రీన్ ఎలిమెంట్‌ను నమ్ముకున్నాడు కాబట్టే అల్లరి నరేష్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా అల్లరోడి సినిమాలన్నీ ఫట్ మంటుండటంతో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తనకి బాగా అలవాటైనా 'స్పూఫ్' నే సేఫ్ గా భావించి ఈ శుక్రవారం 'సెల్ఫీ రాజా'ని ధియేటర్లలో దించాడు. మరి సెల్ఫీ రాజా సందడేంటో చూద్దాం.. కథ : రాజా (అల్లరి నరేష్)కి సెల్ఫీల పిచ్చి. దానికి తోడు నోటి దురుసు. తనకున్న ఈ స్పెషల్ ఎఫెక్టులతో తనతోపాటు తన చుట్టుపక్కల ఉన్నవాళ్లను కూడా ఇబ్బందుల్లో పడేస్తుంటాడు. అనుకోకుండా రాజాకు పోలీస్ కమీషనర్ కూతురు శ్వేత(సాక్షి చౌదరి)తో పరిచయం అవుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారి, అదృష్టవశాత్తూ ఆ ప్రేమ.. పెళ్లికి దారి తీస్తుంది. అయితే మొదటి రాత్రే ఇద్దరి మధ్య అపార్థాలు చోటుచేసుకోవడంతో భార్య అతన్ని వదిలి వెళ్లిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను కాదని వెళ్లిపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు రాజా. వీలైనన్ని ప్రయత్నాలూ చేస్తాడు. వాటిలో ఒక్కటి కూడా ఫలించకపోవడంతో వినూత్న ఐడియాతో జీవితానికి వీడ్కోలు పలకాలని డిసైడ్ అవుతాడు. ఎలాగైనా తనను హత్య చేయాలంటూ ప్రొఫెషనల్ కిల్లర్ మామ్స్(రవిబాబు)కి సుపారీ ఇచ్చేస్తాడు. పని మొదలుపెట్టాక పూర్తి చేయనిదే నిద్రపోని ఈ క్రేజీ కిల్లర్ రాజాని వెంటాడుతూ ఉంటాడు. ఈలోగా రాజాకి, అతని భార్యకి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి భార్యాభర్తలు ఒక్కటవుతారు. అంతటితో కథ సుఖాంతం అవుతుందనుకుంటే పొరపాటే. డబ్బు తీసుకున్నాక చంపి తీరాల్సిందేనంటూ కిల్లర్ మామ్స్.. భీమ్స్(అల్లరి నరేష్)తో కలిసి వేటని ముమ్మరం చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు హీరోలతో కన్ఫ్యూజన్ కామెడి షురూ అవుతుంది. అసలు రాజాకి, భీమ్స్ కి సంబంధం ఏమిటి? మామ్స్, భీమ్స్ కలిసి రాజాని చంపేస్తారా? ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే మిగిలిన కథ. ఎవరెవరు ఎలా.. రెండు పాత్రల్లో కనిపించిన అల్లరి నరేష్ తనదైన కామెడీ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. జూ.ఎన్టీఆర్ మొదలుకుని పవన్ కల్యాణ్ వరకూ ఎవ్వరినీ వదల్లేదు. స్పూఫ్ లతో అల్లాడించాడు. ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ షోకే పరిమితమయ్యారు. రవిబాబు, కృష్ణ భగవాన్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, షకలక శంకర్, సుదర్శన్ లాంటి కామెడీ స్టార్లు తమ పాత్ర మేరకు నటించారు. కమెడియన్లంతా కలసిమెలసి నటించినా కితకితలు కలిగింది తక్కువే అని చెప్పొచ్చు. లేటెస్ట్ ట్రెండ్ 'సెల్ఫీ'ని పేరులో వాడుకున్నా సినిమాలో అంతగా వాడలేదు. 'సెల్ఫీ రాజా' కంటే 'స్పూఫ్ రాజా' అంటే బావుంటుందనేది ధియేటర్ బయట టాక్. -
ఈ శుక్రవారం కామెడీదా.. హర్రర్దా?
శుక్రవారం రాగానే సినీ ప్రియులకు గుర్తొచ్చేది కొత్త సినిమా. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా రిలీజ్ మాత్రం దాదాపుగా శుక్రవారమే. ఫ్రై డే అంటేనే ఫిల్మీ డే. తాజాగా ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు ధియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకటి చానాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న యంగ్ హీరో అల్లరి నరేష్ చిత్రం 'సెల్ఫీ రాజా' కాగా, రెండవది చెన్నై చిన్నది త్రిష నటించిన ద్విభాషా చిత్రం 'నాయకి'. 'సెల్ఫీ రాజా'గా అల్లరి నరేష్ తనకలవాటైన కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, త్రిష 'నాయకి'గా భయపెట్టేందుకు 'వన్ ఉమన్ షో'కి సిద్ధమైంది. ఈ సినిమాలు సక్సెస్ టాక్ తెచ్చుకోవడం అటు అల్లరి నరేష్‌కి, ఇటు త్రిష కెరీర్‌కి కూడా చాలా ముఖ్యం. మరి తెలుగు ప్రేక్షకులు కామెడీకి కమిట్ అవుతారో లేక భయానికి భళా అంటారో తెలియాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ రెండు సినిమాల కలెక్షన్లకు ఈ వారం కీలకం కానుంది. ఎందుకంటే వచ్చే వారం సూపర్ స్టార్ రజనీ 'కబాలి' ధియేటర్లపై దాడి చేయనుంది. -
సెల్పీరాజాతో ఎక్స్‌ప్రెస్ రాజా
గమ్యం, నువ్వా నేనా.. సినిమాల్లో కలిసి నటించిన యంగ్ హీరోస్ అల్లరి నరేష్, శర్వానంద్ మరో సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. అయితే ఇది ఈ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా మాత్రం కాదు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా., ఈ నెల 15న రిలీజ్‌కు రెడీ అవుతోంది. చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే తనతో హిట్ సినిమాల్లో నటించిన శర్వానంద్‌ను సెల్ఫీరాజా ప్రాజెక్ట్‌లో భాగం చేశాడు. సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే వాయిన్ నేరేషన్‌ను శర్వానంద్ అందిస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నరేష్. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెల్పీరాజా సినిమాలో సాక్షి చౌదరి, కామ్నా రనౌత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Selfie Raja ki voice-over essuthunna maa Express Raja! pic.twitter.com/RjHVgaHNJx — Allari Naresh (@allarinaresh) 11 July 2016 -
'రెండేళ్లలో నా డెరైక్షన్‌లో మూవీ'
రెండేళ్లలో నా డెరైక్షన్‌లో మూవీ ఈవీవీ కాన్సెప్ట్ కామెడీతో సొంత బ్యానర్లో మూవీ యూత్‌ఫుల్ కామెడీగా ‘సెల్ఫీ రాజా’ ‘సాక్షి’తో హీరో అల్లరి నరేష్ పెదవాల్తేరు : ‘‘నాన్న ఈవీవీ సత్యనారాయణ గారి కామెడీ ట్రెండ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తిలకించి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. జంద్యాల శిష్యుడుగా నాన్నగారు తెరకెక్కించిన చిత్రాలన్నీ శత శాతం సక్సెస్‌ను సాధించాయి. ఆ కామెడీ చిత్రాలను చూస్తూ పెరగడం వల్లనేమో నేను కూడా తెరపై కామెడీని అవలీలగా పండిస్తున్నాననిపిస్తుంది. అమ్మ, నాన్న, అన్నా, చెల్లెలు ఇలా యావత్తు కుటుంబం చూసే విధంగానే కామెడీ సీన్లుండేలా చాలా జాగ్రత్త పడతాను. అంతేకాదు సందర్భోచితంగా వేసే సెటైర్లలో సైతం ఎక్కడా ద్వంద్వార్ధాలకు తావు లేకుండా జాగ్రత్తపడతాను. అందుకే నా చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటాను...’ అన్నారు వెండితెర ‘అల్లరి’ హీరో నరేష్. తన సినీ సంగతులను ‘సాక్షి’తో కాసేపు పంచుకున్నారు. ఈవీవీ బ్యానర్‌పై నాన్నగారి కామెడీ బ్రాండ్మూవీ ఈవీవీ బ్రాండ్ కామెడీ మూవీని మరలా ప్రేక్షకులకు అందించాలని సొంత బ్యానర్‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని పూర్తిగా పల్లె అందాల నడుమ సాగే కథాంశంతో తీయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కుటుంబంలో చేదు, తీపి సంఘటనల సమ్మేళనంగా సాగే సాఫీ జీవనాన్ని చక్కని ఆరోగ్యకరమైన కామెడీని జోడించి తీయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈవీవీ గారు గుర్తు రావాలన్నదే మా కాంక్ష. రెండేళ్ళలో నా డెరైక్షన్‌లో మూవీ మరో రెండేళ్ళలో నా డై రెక్షన్లో ఓ చిత్రాన్ని తీ యడానికి ఇప్పటి నుంచే కథను తయారు చేస్తున్నాం. నన్ను దర్శకుడుగా నాన్న చూడాలనుకున్నారు. అయితే యాదృచ్ఛికంగా హీరో అయ్యాను. దీంతో ఆయన కలను నెరవేరలేదు. ఇప్పుడు ఆయన కలను నెరవేర్చడానికి మెగా ఫోన్ పట్టుకునేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇప్పటికే సహాయ దర్శకుడిగా పని చేసిన అనుభవంతో దర్శకుడిగా అవతారమెత్తాలని నిర్ణయించుకున్నా. ఈ చిత్రాన్ని కూడా సొంత బ్యానర్లో తీస్తాం. నిర్మాణంలో రెండు మూవీలు సొంత బ్యానర్లో రెండు చిత్రాలను నిర్మిస్తున్నాం. వీటిలో ‘ఇంట్లో దెయ్యం- మాకేంటి భయం’ చిత్రం నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అలాగే కమెడియన్ కృష్ణ భగవాన్ కథ, స్క్రీన్‌ప్లేలో ‘మేడ మీద అబ్బాయి’ చిత్రం కూడా నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలను వినూత్న కథాంశాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధగా ఎక్కడా రాజీ లేకుండా నిర్మిస్తున్నాం. ఈ చిత్రాల నిర్మాణాన్ని అన్నయ్య రాజేష్ చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు 2017 వేసవిలో విడుదల చేస్తాం. నాన్నగారి పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు నాన్న పుట్టి పెరిగిన నిడదవోలు కేంద్రంగా ఈవీవీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్కడి గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాం. అంతేకాకుండా మాకు ఎంతో ఇష్టమైన మా సొంతవూరులో సేవ చేయడం ఎంతో భాగ్యంగా భావించి ఈ ప్రణాళికను తయారు చేస్తున్నాం. ఈ ట్రస్ట్ త్వరలోనే ఏర్పాటు చేస్తాం. యూత్‌ఫుల్ కామెడీ మూవీ సెల్ఫీరాజా ప్రస్తుతం యూత్ యావత్తూ సెల్ఫీల మాయలో ఉన్నారు. ఈట్రెండ్లో పడి సెల్ఫీ వ్యక్తిగత జీవితాల మీదుగా తెచ్చుకుంటున్నారు. సుమారు రెండువేలమంది సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇది యూత్‌కు తెలిసేట్టుగా ఫుల్యూత్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నా మార్కు కామెడీ ఉంటుంది. -
ఆ గ్యాప్ వాడేసుకుంటున్నారు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టుగా కబాలి జూలై 15న మాత్రం రిలీజ్ కావటం లేదంటూ ఫిక్స్ అయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే ఆలోచనతో తమ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. స్టార్ హీరోలు రిస్క్ చేయకపోయినా చిన్న సినిమా నిర్మాతలు మాత్రం గ్యాప్ ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు. బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ మరోసారి సెల్పీ రాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న లేడి ఓరియంటెడ్ మూవీ నాయకీ. తొలిసారిగా గ్లామర్ హీరోయిన్ త్రిష ఓ లేడిఓరియంటెడ్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్నాళ్లు రిలీజ్ డేట్ విషయంలో ఆలోచన చేస్తూ వచ్చిన నాయకీ టీం కూడా కబాలి రిలీజ్ వాయిదా పడుతుందన్న ఆలోచనతో జూలై 15నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. -
ఆకాశంలో అల్లరి సెల్ఫీ
వినోదభరిత చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు ‘అల్లరి’ నరేశ్. తొలి చిత్రం ‘అల్లరి’ నుంచి గత ఏడాది వచ్చిన ‘మామ మంచు అల్లుడు కంచు’ వరకూ వినోదాన్నే నమ్ముకుని ప్రేక్షకులకు కితకితలు పెడుతున్నారాయన. నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫీ రాజా’. సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ ఫేం జి.ఈశ్వర్ దర్శకత్వంలో గోపీ ఆర్ట్స్ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శుక్రవారం ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా ‘సెల్ఫీ రాజా’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే సెల్ఫీ మోజులో నరేశ్ ఆకాశంలోకి ఎగిరి మరీ సెల్ఫీ తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. సెల్ఫీ అంటే మనోడికి అంత మోజని అర్థమవుతోంది. -
సెల్పీరాజా ఫస్ట్ లుక్
కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ సెల్పీరాజా. గతంలో విజయ్ మాల్యాతో కలిసి నరేష్ దిగిన ఫోటోతో ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్. తాజాగా దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో గోపి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు జి నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా అప్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా సెల్ఫీరాజాను తెరకెక్కిస్తున్నారు.