తమిళ చిత్రంలో అల్లరి నరేష్ | Allari Naresh goes to Kollywood | Sakshi
Sakshi News home page

తమిళ చిత్రంలో అల్లరి నరేష్

Published Fri, Jul 15 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

తమిళ చిత్రంలో అల్లరి నరేష్

తమిళ చిత్రంలో అల్లరి నరేష్

యువతరం హీరోల్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో అల్లరి నరేష్. ఈ మధ్య కాస్త తడబడి స్లో అయ్యాడు కానీ లేదంటే ఈ అల్లరోడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం సెల్పీరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టాల్ స్టార్ త్వరలో ఓ స్ట్రయిట్ తమిళ సినిమా చేయడానికి అంగకీరించాడు. ఇప్పటికే కురుంబు, పొరలి లాంటి తమిళ సినిమాల్లో నటించిన నరేష్ మరోసారి తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కిన శంభో శివ శంభో సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సముద్రఖని, ఈ అల్లరోడితో మరోసారి తమిళ సినిమా చేయించాలని డిసైడ్ అయ్యాడు. స్టార్ ఇమేజ్కు దూరంగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్ర కావటంతో నరేష్ కూడా వెంటనే అంగకీరించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా ఈ శుక్రవారం రిలీజ్ కాగా మరో రెండు తెలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న మా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాలో నటిస్తున్నాడు నరేష్. ఈ సినిమా తరువాత ప్రముఖ నటుడు కృష్ణభగవాన్ కథా కథనాలు అందిస్తున్న మేడ మీద అబ్బాయి సినిమా పటాలెక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement