సెల్ఫీ రాజా మూవీ రివ్యూ
టైటిల్ : సెల్ఫీ రాజా
జానర్ : కామెడీ ఎంటర్ టైనర్
తారాగణం : అల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్నా రనౌత్
సంగీతం : సాయి కార్తీక్
దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి
నిర్మాత : చలసాని రాంబ్రహ్మం చౌదరి
కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో విఫలమవుతూ వస్తున్న యంగ్ హీరో అల్లరి నరేష్ ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి తన మార్క్ రెగ్యులర్ కామెడీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న జి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మరోసారి స్ఫూఫ్ కామెడీతో సెల్పీరాజా సినిమా చేశాడు. మరి నరేష్ చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది. మినిమమ్ గ్యారెంటీ హీరో ట్యాగ్ కి దూరమవుతున్న ఈ యంగ్ హీరో తిరిగి ఆకట్టుకున్నాడా..
కథ :
సెల్పీరాజా (అల్లరి నరేష్) సరదాగా టైం పాస్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సిటీ కమిషనర్ కూతురు (కామ్న రనౌత్)ని లవ్ లో పడేసి పెళ్లి చేసుకుంటాడు. అయితే తన నోటి దురుసు వల్ల సమస్యలను కొని తెచ్చుకోవటం ఈ సెల్పీ రాజాకు అలవాటు. అదే నోటి దురుసుతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి దూరమవుతాడు. భార్య వెళ్లిపోవటంతో కృంగిపోయిన సెల్ఫీరాజా చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. తనని కాల్చి చంపమని ఓ క్రిమినల్ (రవిబాబు)తో ఒప్పందం చేసుకుంటాడు. కానీ ఆ క్రిమినల్ సెల్ఫీ రాజాను చంపకుండా మరో ప్లాన్ చేస్తాడు. ఇంతకీ ఆ క్రిమినల్ ప్లాన్ ఏంటి.? చివరకు సెల్ఫీరాజా కథ ఏమయ్యింది అన్నదే మిగతా కథ.
నటీనటులు :
కొంత కాలంగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న నరేష్.. ఈసారి అలాంటి రిస్క్ ఏదీ చేయకుండా తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నంలో నరేష్ వందశాతం సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా స్ఫూఫ్ కామెడీలలో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక తొలి సినిమానే అయినా కామ్న రనౌత్ మంచి నటన కనబరిచింది. 30 ఇయర్స్ పృథ్వి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. సాక్షి చౌదరి, రవిబాబులతో పాటు ఇతర కమెడియన్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
తొలి భాగాన్ని పర్ఫెక్ట్ కామెడీతో ఇంట్రస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఈశ్వర్ రెడ్డి, రెండోభాగం విషయంలో మాత్రం ఆ పట్టు కోల్పోయినట్టు అనిపించింది. వరుసగా కొత్త పాత్రలను పరిచయం చేస్తూ కథ సాగటంతో కథనంలో వేగం తగ్గింది. సాయి కార్తీక్ సంగీతం బాగానే ఉన్న సినిమా ఫ్లోలోకు ఇబ్బంది కరంగా మారాయి. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
అల్లరి నరేష్
30 ఇయర్స్ పృథ్వి
క్లైమాక్స్ కామెడీ
మైనస్ పాయింట్స్ :
రోటీన్ స్ఫూఫ్ కామెడీ
సెకండ్ హాఫ్ సాంగ్స్
ఓవరాల్గా సెల్ఫీ రాజా అల్లరి నరేష్ మార్క్ స్పూఫ్ కామెడీ